Director K Viswanath No More: కళాతపస్వి, దర్శక దిగ్గజం విశ్వనాథ్ ఇకలేరు..

ABN, First Publish Date - 2023-02-03T00:13:48+05:30

టాలీవుడ్‌లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న..

Director K Viswanath No More: కళాతపస్వి, దర్శక దిగ్గజం విశ్వనాథ్ ఇకలేరు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌లో దర్శక దిగ్గజం నేలకొరిగింది. ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ (92) (K Viswanath No More) అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని కుటుంబ సభ్యులు ఇంటికి తరలించారు. 50కి పైగా సినిమాలకు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయన చివరి సినిమా శుభప్రదం.

KV.jpg

దర్శకుడిగా ‘ఆత్మగౌరవం’ అనే సినిమాతో 1965లో విశ్వనాథ్ అరంగేట్రం చేశారు. సాగరసంగమం (Sagara Sangamam), శంకరాభరణం (Sankarabharanam), స్వర్ణ కమలం, శుభసంకల్పం సినిమాలు విశ్వనాథ్ సినీ జీవితంలో మరపురాని చిత్రాలుగా నిలిచాయి. ‘శంకరాభరణం’ సినిమా విడుదలై 43 ఏళ్లు పూర్తయిన రోజునే విశ్వనాథ్ శివైక్యం కావడం గమనార్హం. గుంటూరు జిల్లా రేపల్లెలో 1930, ఫిబ్రవరి 19న విశ్వనాథ్ జన్మించారు.

కళా తపస్వి కె.విశ్వనాథ్ గురించి మరిన్ని విశేషాలు:

* దాదాసాహెబ్ అవార్డ్ గ్రహీత డాక్టర్ కె విశ్వనాథ్

* చెన్నైలో సౌండ్ రికార్డిస్ట్‌గా సినిమా జీవితం ప్రారంభం

* శంకరాభరణం చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతి

* అన్నపూర్ణ సంస్థ వారి తోడికోడళ్ళు చిత్ర దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం సహాయ దర్శకుడిగా కెరీర్ ఆరంభం

* అన్నపూర్ణ బ్యానర్‌పై వచ్చిన ఇద్దరు మిత్రులు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు సహాయ దర్శకులు

* అక్కినేని హీరోగా వచ్చిన ఆత్మ గౌరవం చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌కి శ్రీకారం

* సిరిసిరిమువ్వ చిత్రంతో విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభకు గుర్తింపు

* శంకరాభరణం, సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వరాభిషేకం తదితర సినిమాల్లో శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలకు పెద్దపీట

* 1965లో ఆత్మగౌరవం సినిమాకు తొలి నంది అవార్డు

* 1992లో విశ్వనాథ్‌కు పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య పురస్కారాలు

* 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవం

* 5 నంది అవార్డులు, 5 జాతీయ అవార్డులు, 10 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న విశ్వనాథ్

* బాలీవుడ్‌లో 9 చిత్రాలకు దర్శకత్వం వహించిన విశ్వనాథ్

* తెలుగు, తమిళ భాషల్లో కలిపి 30కి పైగా చిత్రాల్లో నటించిన కళా తపస్వి

* పలు చిత్రాల్లో ప్రముఖ హీరోహీరోయిన్లకు అన్నగా, తండ్రిగా, తాతయ్యగా నటించి ప్రశంసలందుకున్నారు.

Updated Date - 2023-02-03T01:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising