ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

ABN, First Publish Date - 2023-02-27T12:27:43+05:30

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ‘ఛలో’ (Chalo) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ భామకి.. ‘పుష్ప’ (Pushapa) సినిమాతో దేశం మొత్తం అభిమానులు ఏర్పడ్డారు.

Rashmika Mandanna
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న అతి కొద్దిమంది నటీమణుల్లో రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఒకరు. ‘ఛలో’ (Chalo) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ భామకి.. ‘పుష్ప’ (Pushapa) సినిమాతో దేశం మొత్తం అభిమానులు ఏర్పడ్డారు. దీంతో ఈ బ్యూటీని నేషనల్ క్రష్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. ఆ క్రేజ్‌తోనే వరుసగా పలు బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకుంది. అమితాబ్ బచ్చన్ నటించిన ‘గుడ్ బై’ (Goodbye) సినిమాతో ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైంది. ఈ సినిమాకిగానూ తాజాగా ‘బెస్ట్ డెబ్యూ ఫిమేల్’ విభాగంలో ఓ సినీ అవార్డును గెలుచుకుంది.

ఈ సినీ అవార్డుల కార్యక్రమంలో ఇటీవలే ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పొగ్రామ్‌కి రష్మిక కూడా హాజరైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ డ్రెస్‌ని రష్మిక ధరించింది. అయితే ఆ డ్రెస్ పలువురు నెటిజన్లకి నచ్చలేదు. దీంతో ఈ భామని ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

‘ఉర్ఫీ జావేద్‌ (Urfi Javed)ని చూసి ఫాలో అవుతున్నావా’.. ‘నువ్వు టాలెంట్‌తో పాపులారిటీ సాధించావు కదా.. ఇప్పుడేందుకు ఇలా చెత్త డ్రెస్ వేసుకున్నావు’.. ‘అదో చెత్త డ్రెస్. ఈ నటీమణులు ఎందుకు ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారో అర్థం కావట్లేదు’.. ‘పరిశ్రమకి ఏమైంది. వీరిని బాయ్‌కాట్ చేయడంతో తప్పే లేదు. పాపులారిటీ ఉన్నవారికి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది’ అని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - 2023-02-27T12:30:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising