ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Lions vs Buffalow Fighting: దున్నపోతుపై రెండు సింహాల అటాక్.. పారిపోతుందనుకుంటే పెద్ద ఫైటింగే చేసేసింది.. చివరకు..!

ABN, First Publish Date - 2023-10-07T14:10:18+05:30

అడవి అంటే ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాదు.. ఎన్నో సాహసాలు, ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. అడవిలో బలవంతులదే రాజ్యం. బలం ఉన్న జంతువుకు ఆకలేసిందంటే బలహీనమైన జంతువు బలి కావాల్సిందే. సింహాలు, పులులు వంటి క్రూర మృగాలు అడవిలో సాధు జంతువులను వేటాడి చంపి ఆకలి తీర్చుకుంటాయి.

అడవి (Forest) అంటే ప్రకృతి దృశ్యాలు మాత్రమే కాదు.. ఎన్నో సాహసాలు, ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. అడవిలో బలవంతులదే రాజ్యం. బలం ఉన్న జంతువుకు ఆకలేసిందంటే బలహీనమైన జంతువు బలి కావాల్సిందే. సింహాలు (Lions), పులులు (Tigers) వంటి క్రూర మృగాలు అడవిలో సాధు జంతువులను వేటాడి చంపి ఆకలి తీర్చుకుంటాయి. అయితే అన్నిసార్లూ బలవంతులదే గెలుపు అని చెప్పలేం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Videos)లో ఓ అడవి గేదె (Buffalo) ఏకంగా రెండు సింహాలతో పోరాడి తన ప్రాణాలను నిలుపుకుంది.

ఇటీవలి కాలంలో చాలా మంది జంగిల్ టూర్లకు వెళుతున్నారు. అడవి జంతువులను, వాటి మధ్య జరిగే ఫైటింగ్‌లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ అడవి గేదెను చంపేందుకు రెండు సింహాలు ప్రయత్నిస్తున్నాయి (Lions vs Buffalow). ఒక సింహం ఆ గేదె మెడ పట్టుకుంది. మరో సింహం ఆ గేదె వెనుక కాళ్లను పట్టుకుంది. అయినా ఆ గేదె తలవంచలేదు. రెండు సింహాలతోనూ పోరాడింది.

Viral Video: బాబోయ్.. ఎంత తాగాడో కానీ పాముకే చుక్కలు చూపించాడు.. విషపూరిత పామును నోట్లో పెట్టుకుని..

రెండు సింహాలూ పట్టు బిగించినా ధైర్యం కోల్పోకుండా వాటిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది. మెడ పట్టుకున్న సింహాన్ని తన కొమ్ములతో పొడిచేసింది. చివరకు ఆ రెండు సింహాలు ఆ గేదెను వదిలేసి పారిపోయాయి. @Animal_WorId అనే ట్విటర్ (X) హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ అడవి గేదె పోరాడిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated Date - 2023-10-07T14:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising