ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cardiac Arrest: ఒకే కారణంతో 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి.. ఈ ఆహార పదార్థాలను కనుక రోజూ తినే అలవాటు ఉండి ఉంటే..!

ABN, First Publish Date - 2023-08-11T15:43:02+05:30

ప్రస్తుత రోజుల్లో గుండెపోటు కారణంగా చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఫిట్‌గా కనిపించేవారు, యుక్త వయసులో ఉండేవారు హఠాత్తుగా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు.

ప్రస్తుత రోజుల్లో గుండెపోటు (Heart Attack) కారణంగా చనిపోతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఫిట్‌గా కనిపించేవారు, యుక్త వయసులో ఉండేవారు హఠాత్తుగా గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు కార్డియాక్ అరెస్ట్ (Cardiac Arrest) వల్ల చనిపోయారు. వారిలో ఒకరు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ``బాడీగార్డ్`` డైరెక్టర్ సిద్ధిక్ ఇస్మాయిల్ (Siddique Ismail) కాగా, మరొకరు పెప్పర్‌ఫ్రై సహ వ్యవస్థాపకుడు అంబరీష్ మూర్తి (Ambrish Murthy). ఇద్దరూ ఫిట్‌గా ఉండే వ్యక్తులే. వారి మరణాల వల్ల మరోసారి కార్డియాక్ అరెస్ట్ గురించి మరోసారి ఆందోళన మొదలైంది.

గుండెపోటు కంటే కార్డియాక్ అరెస్ట్ అత్యంత ప్రమాదకారి. క్షణాల్లో మొత్తం జరిగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్‌కు కరోనరీ ఆర్టరీ వ్యాధి, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ధూమపానం, గుండెపోటు చరిత్ర మొదలైనవి కారణాలు కావొచ్చు. అలాగే పొటాషియం (Potassium), మెగ్నీషియం (Magnesium) లోపాలు కూడా కార్డియాక్ అరెస్ట్‌కు దారి తీస్తాయి. రక్తంలో పొటాషియం తక్కువగా ఉండటాన్ని హైపోకలేమియా (hypokalemia) అంటారు. ఈ హైపొకలేమియా కూడా కార్డియాక్ అరెస్ట్‌కు ఓ ప్రధాన కారణం అని పరిశోధకులు గుర్తించారు.

Viral Video: పులితో ఆట ఇలాగే ఉంటుంది.. మహిళకు చుక్కలు చూపించిన పులి.. షాకవుతున్న నెటిజన్లు!

పొటాషియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అరటిపళ్లు, ఎండు ద్రాక్ష, పప్పులు, డార్క్ చాక్లెట్, అవకాడో, గింజలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, బంగాళాదుంపలు, ఆప్రికాట్లు, పచ్చని ఆకు కూరల నుంచి పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. వీటని తరచుగా ఆహారంగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు తలెత్తవని చెబుతున్నారు.

Updated Date - 2023-08-11T15:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising