ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking: నా భర్తను ఎవరో చంపేశారంటూ ఏడుస్తూ గగ్గోలు పెట్టిన భార్యే.. అసలు నేరస్తురాలని తెలిసి అంతా షాక్.. ఏంటీ పని అని నిలదీస్తే..!

ABN, First Publish Date - 2023-08-28T20:52:33+05:30

ఆ వ్యక్తి వృద్ధాప్యానికి చేరువవుతున్నాడు.. పెద్ద కొడుక్కి పెళ్లి కూడా చేశాడు.. అయినా అతడిలోని కామవాంఛ మాత్రం తగ్గలేదు.. ఏకంగా కొడుకు భార్య పైనే కన్నేశాడు.. తన పక్కలోకి రావాలని కోడలిని నిరంతరం టార్చర్ పెడుతున్నాడు.. దీంతో ఆ యువతి తీవ్ర మానసిక వ్యథ అనుభవించింది..

ఆ వ్యక్తి వృద్ధాప్యానికి చేరువవుతున్నాడు.. పెద్ద కొడుక్కి పెళ్లి కూడా చేశాడు.. అయినా అతడిలోని కామవాంఛ మాత్రం తగ్గలేదు.. ఏకంగా కొడుకు భార్య పైనే కన్నేశాడు.. తన పక్కలోకి రావాలని కోడలిని (Daughter in law) నిరంతరం టార్చర్ పెడుతున్నాడు.. దీంతో ఆ యువతి తీవ్ర మానసిక వ్యథ అనుభవించింది.. విషయం తెలుసుకున్న అత్త భర్తపై తీవ్ర అసహ్యం పెంచుకుంది.. అతడిని దారుణంగా హత్య చేసింది (UP woman slits husband's throat).. తప్పించుకునేందుకు రకరకాల కథలు చెప్పి చివరకు పోలీసులకు దొరికిపోయింది (Crime News).

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని రాయ్ బరేలి సమీపంలోని బిల్సీ పట్టణంలోని తన ఇంటి పెరట్లో నిద్రిస్తున్న తేజేంద్ర సింగ్ కొద్ది రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. ఎవరో అతడిని గొంతు కోసి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ఇంట్లోని వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. గుర్తు తెలియని వ్యక్తులు తేజేంద్ర సింగ్ ను హత్య చేసినట్లు అతని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. తేజేంద్ర సింగ్ భార్య మిథ్లేష్ దేవి పదేపదే స్టేట్‌మెంట్‌లను మారుస్తుండడంతో ఆమె మీద పోలీసులకు అనుమానం పెరిగింది. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది (UP Crime News).

Wife: ఆమె భర్త చనిపోయాడని తేల్చేందుకు 10 ఏళ్లు పట్టింది.. 2013వ సంవత్సరం నుంచి న్యాయపోరాటం చేస్తే..!

తన భర్త అకృత్యాలు భరించలేక తానే హత్య చేశానని అంగీకరించింది. భర్త తరచూ తనను కొట్టేవాడని, కోడలు తనతో పడుకునేలా ఒప్పించమని బలవంతం చేసేవాడని, తన కోడలిని లైంగిక వేధింపులకు గురి చేసేవాడని మిథ్లేష్ పోలీసులకు చెప్పింది. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చి బయట నిద్రపోతున్న భర్తపై కొడవలితో దాడి చేసి అతని గొంతు కోసి చంపేశానని, కోడలిని రక్షించడానికి అలా చేసానని ఆమె నేరం అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-08-28T20:54:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising