ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఈ ఫొటోలోని మహిళ రెండు కాళ్లను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-12-05T14:03:34+05:30

Viral News: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 63 ఏళ్ల బ్రిటనీ స్కోలాండ్ (Brittany Skoland) అనే మహిళ ఊహించని విధంగా తన రెండు కాళ్లను కోల్పోయింది. దీనికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

Viral News: అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 63 ఏళ్ల బ్రిటనీ స్కోలాండ్ (Brittany Skoland) అనే మహిళ ఊహించని విధంగా తన రెండు కాళ్లను కోల్పోయింది. దీనికి కారణం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆమె కుమారుడు పెంపుడు కుక్కలే ఇలా ఆమె రెండు కాళ్లు పోవడానికి కారణం. అవును మీరు విన్నది నిజమే. ఆమె కుమారుడు పెంచుకుంటున్న మూడు 'పిట్ బుల్స్' (Pit Bulls) కారణంగానే ఆమె తన రెండు కాళ్లు కోల్పోవాల్సి వచ్చింది. ఈ షాకింగ్ ఘటన నవంబర్ 24న డెస్ మోయిన్స్ పరిధిలోని ఫోర్ట్ డాడ్జ్‌లో చోటు చేసుకుంది. వృద్ధురాలిపై ఒక్కసారిగా విరుచుకుపడిన పిట్ బుల్స్ ఆమె బాడీ మొత్తాన్ని ఎక్కడికక్కడ గాయాలు చేసేశాయి.

Viral Video: ఇద్దరు పిల్లల మధ్య పదే పదే గొడవ.. ఒకే ఒక్క చిట్కాతో ఆ తల్లి ఎలా ఆపేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!


ఇక ఆమె అరుపులు విన్న పక్కింటి వ్యక్తి వెంటనే 911 కాల్‌చేసి చెప్పాడు. దాంతో ఫోర్ట్ డాడ్జ్‌ పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనాస్థలికి చేరుకున్నారు. అప్పటికీ ఇంకా అవి బ్రిటనీ స్కోలాండ్‌ను కరుస్తూనే ఉన్నాయి. దీంతో పోలీస్ అధికారి డెన్నీస్ క్వీన్న్ తన వద్ద ఉన్న ఆయుధంతో వాటిని బెదిరించాడు. అలా బెదిరించడం వల్ల అవి ముసలావిడను వదిలిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాయి. ఇక తీవ్రంగా గాయడిన బ్రిటనీ స్కోలాండ్‌ను పోలీసులు చికిత్స కోసం హూటాహూటిన హెలికాప్టర్‌లో మెథడిస్ట్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అక్కడ బ్రిటనీ స్కోలాండ్‌కు వైద్యం అందించిన డాక్టర్లు.. ఆమె రెండు కాళ్లు కుక్కల దాడిలో నుజ్జునుజ్జు కావడంతో మోకాళ్ల వరకు తీసేశారు. ఆమె గాయపడిన తీరును చూసి వైద్యులే షాక్ అయ్యారని పోలీస్ అధికారి బ్రాడీ కొట్టమ్ తెలిపారు. ఆమె తిరిగి మాములు మనిషి కావడానికి చాలా సర్జరీలు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారట. దాంతో ఆమె వైద్య ఖర్చుల కోసం 'గో‌ఫండ్‌మీ' ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు పోలీస్ అధికారి చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Aeroplane: విమానంలో షాకింగ్ ఘటన.. సీటు దగ్గర రక్తపు మరకలు.. సిబ్బందికి చెబితే మీరే తుడుచుకోండంటూ..!

Updated Date - 2023-12-05T14:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising