ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

uterine fibroids: 30ఏళ్ళ తర్వాత మహిళలకు పెద్ద గండం.. ముందే తెలుసుకోకపోతే చాలా కష్టం..

ABN, First Publish Date - 2023-04-28T20:02:31+05:30

30ఏళ్ళు దాటాయంటే మహిళలు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు.. పైకి ఏమీ కాదు అన్నట్టుండే ఈ సమస్య రాను రాను విశ్వరూపం దాల్చి.. చివరికి.. ఇంత నష్టానికి దారితీస్తుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ మహిళ ఎప్పుడూ కడుపు నొప్పిగా(stomach ache) ఉంటోందని, రక్తస్రావం ఎక్కువగా(over bleeding) ఉందని గైనకాలజిస్ట్(gynecologist) ను సంప్రదించింది. అప్పుడే మూత్రంలో మంట(burning in urine), పనులు చేసుకునేటప్పుడు కదిలితే చాలు కడుపు నొప్పి ఉందంటూ మరొక మహిళ అదే గైనకాలజిస్ట్ ను సంప్రదించింది. ఆ మహిళల ఇద్దరి వయసు 30ఏళ్లు పైనే(above 30 years) కావడంతో ఆ గైనకాలజిస్ట్ కు వారి సమస్య ఏంటో అర్థం చేసుకోవడానికి పెద్దగా సమయం పట్టలేదు. ఎంతో మంది మహిళలకు 30ఏళ్ల తరువాత ఎక్కువగా ఎదురవుతున్న సమస్య ఏదైనా ఉందంటే అది గర్బాశయంలో గడ్డలు, లేదా కణితులు ఏర్పడటం. పెళ్లయినవారు, పెళ్ళికానివారు అనే తేడా లేకుండా ఈ సమస్య బారిన పడుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

స్త్రీల గర్బాశయం(uterine))లో ఏర్పడే కణితి లేదా గడ్డలను ఫైబ్రాయిడ్స్(fibroids) అని అంటారు. వీటి పరిమాణం చిన్నగానూ ఉండచ్చు దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది పుచ్చకాయంత పెద్దగానూ కావచ్చు. 30ఏళ్ల తరువాత శరీరంలో జరిగే హార్మోన్ అసమతుల్యత(hormone imbalance) వల్ల గర్భాశయంలో పైబ్రాయిడ్స్ వస్తాయి. 35ఏళ్ల తరువాత అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ కారణంగా వెన్ను నొప్పి(back pain), మూత్రాశయంలో మంట(bladder inflammation), అదిక రక్తస్రావం(over bleeding), పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు(infertility), కొంచెం తిన్నా కడుపు నిండిపోయిన అనుభూతి కలగడం, కటి భాగంలో నొప్పి(pelvis pain) వంటి సమస్యలు వస్తాయి. ఈ ఫైబ్రాయిడ్స్ మూడు రకాలుగా ఉంటుంది. (three types of fibroids)

సబ్ సెరోసల్ పైబ్రాయిడ్స్..(subserosal fibroid)

ఇవి గర్భాశయం పైన అంటే గర్భాశయం బయటి భాగంలో పెగుతాయి. దీనివల్ల వెన్ను నొప్పి, మూత్రంలో మంట వంటి సమస్యలు వస్తాయి. ఇది నెలసరి మీద ప్రభావం చూపించదు.

ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్..(intramural fibroids)

ఇవి గర్భాశయం లోపల పెరుగుతుంది. దీని లక్షణాలు తొందరగా గుర్తించలేరు. వెన్నుపాము, పురీషనాళం, కటి భాగంమీద తీవ్రమైన ఒత్తిడి తెస్తాయివి.

సబ్ మ్యూకసల్ పైబ్రాయిడ్స్..(submucosal fibroids)

ఇవి గర్భాశయం లోపల కుహురంలో పెరుగుతాయి. వీటి కారణంగా నెలసరి సక్రమంగా రాదు.

Viral Video: ఎందుకయ్యా ఇలాంటి సాహసాలు.. గాల్లో ఎగురుదామని కొండమీద నుండి దూకాడు.. కానీ చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..


చాలామంది మహిళలు పైబ్రాయిడ్స్ ఉన్నాయని తెలియగానే కంగారు పడిపోతారు. వాటిని తొలగించే క్రమంలో గర్బసంచి తీసేయాల్సి వస్తుందనే కారణంతో ఫైబ్రాయిడ్స్ తీయించుకోవడానికి జంకుతారు. అయితే సరైన సమయంలో వీటిని గుర్తించడం ద్వారా ఆపరేషన్ కూడా అవసరం లేకుండా మందులతో నయం చేయవచ్చు. ఫైబ్రాయిడ్లను మైయోమెక్టమీ ద్వారా తొలగించవచ్చు. లేదంటే హిస్టెరెక్టమీ, ఎండోమెట్రియల్ అబ్లేషన్ ద్వారా కూడా ఫైబ్రాయిడ్లు తొలగిస్తారు. అయితే చివరి రెండు పద్దతులలో గర్భసంచి కూడా తొలగించబడుతుంది. ఈ ఫైబ్రాయిడ్లు వచ్చేది హార్మోన్ల అసమతుల్యత వల్ల కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుని హార్మోన్లను సమతుల్యంగా ఉంటుకుంటే ఈ సమస్య రాకుండా జాగ్రత్తపడవచ్చు, సమస్య వచ్చిన తరువాత తొందరగా బయటపడవచ్చు.

Viral Video: అమ్మబాబోయ్ ఇంత పెద్ద కింగ్ కోబ్రాను మీరెప్పుడైనా చూశారా? ఓ వ్యక్తి దాని తోక పట్టుకుని మరీ..


Updated Date - 2023-04-28T20:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising