Super Splendor: ఏ బైక్‌కు అయినా రెండే కదా.. దీనికేంటి మూడు టైర్లున్నాయని అవాక్కవుతున్నారా..? ఈ కుర్రాడు దీన్నెలా మార్చేశాడో మీరే చూడండి..!
ABN, First Publish Date - 2023-03-21T17:49:28+05:30
‘‘నలుగురికీ నచ్చినది.. నాకసలే ఇక నచ్చదురో... నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో’’.. అనేది ఓ సినిమా పాట. ఈ పాటకు తగ్గట్టుగానే కొందరు యువకులు.. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తుంటారు. కళ్లముందున్న వస్తువులనే కాస్త అటూ ఇటుగా మార్చి..
‘‘నలుగురికీ నచ్చినది.. నాకసలే ఇక నచ్చదురో... నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో’’.. అనేది ఓ సినిమా పాట. ఈ పాటకు తగ్గట్టుగానే కొందరు యువకులు.. అందరిలా కాకుండా భిన్నంగా ఆలోచిస్తుంటారు. కళ్లముందున్న వస్తువులనే కాస్త అటూ ఇటుగా మార్చి.. చివరకు అద్భుతాన్ని సృష్టించి, అందరితో శభాష్ అనిపించుకుంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకుడు కూడా ఇలాంటి అద్భుతాన్నే సృష్టించాడు. ఓ యువకుడు తన బైక్‌కు ఏర్పాటు చేసిన మూడు టైర్లను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ యువకుడికి సంబంధించిన వీడియో (Viral videos) తెగ చక్కర్లు కొడుతోంది. అజయ్ దేవగన్ (Ajay Devgn) నటించిన 'గోల్మాల్: ఫన్ అన్లిమిటెడ్' (Golmaal Fun Unlimited) సినిమాలో నలుగురు స్నేహితులు ప్రయాణిచేందుకు వీలుగా బైక్‌కు మూడు టైర్లను (Three tire bike) ఏర్పాటు చేశారు. ఈ సీన్ అందరినీ తెగ ఆకట్టుకుంది. అయితే నిజ జీవితంలో ఓ యువకుడు దీన్ని నిజం చేసి చూపించాడు. సదరు వ్యక్తి తన హీరో సూపర్ స్ల్పెండర్ బైకును (Hero Super Splendor bike) వినూత్నంగా మార్చాలని అనుకున్నాడు. అనుకున్నట్లుగా గానే బైకును పార్ట్ పార్టులుగా ఊడదీసి, చివరకు దానికి మధ్యలో మరో టైర్‌ను ఏర్పాటు చేశాడు.
మూడు టైర్లను ఏర్పాటు చేసిన అనంతరం.. దాన్ని యథాతథంగా మళ్లీ కొత్త బైకులా మార్చాడు. చూసేందుకు కంపెనీ నుంచి అలాగే వచ్చిందేమో అన్నట్లుగా ఆ బైకును తీర్చిదిద్దాడు. చివరగా ఆ బైకుపై చక్కర్లు కొడుతూ.. ‘‘ఎలా ఉంది.. నా ఐడియా’’.. అంటూ వీడియోను నెటిజన్లు ముందుంచాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువకుడు వదిలితే బైకును రైలులా మార్చేట్టు ఉన్నాడే’’.. అని కొందరు, ‘‘బ్రదర్, దానికి ఇంకో టైరు యాడ్ చేయండి. అప్పుడు అది ఫోర్ వీలర్ అవుతుంది’’.. అని మరికొందరు, ‘‘వావ్! ఇది సింప్లీ సూపర్ స్పెండర్’’.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-03-21T17:49:28+05:30 IST