ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: తొండాన్ని చూసి ఆశ్చర్యపోతున్న బుల్లి ఏనుగు.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో!

ABN, First Publish Date - 2023-09-01T15:49:27+05:30

ఈ భూమి మీద ఉన్న జంతువుల్లో అతి తెలివైనవి ఏనుగులు. భారీ ఆకారం కలిగిన ఏనుగులు సాధు జంతువులు. వాటి జోలికి వెళ్తే తప్ప ఎవరికీ ఎటువంటి హానీ కలిగించవు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏనుగులకు సంబంధించిన ఎన్నో వీడియోలు ప్రతిరోజు అప్‌లోడ్ అవుతున్నాయి.

ఈ భూమి మీద ఉన్న జంతువుల్లో అతి తెలివైనవి ఏనుగులు (Elephants). భారీ ఆకారం కలిగిన ఏనుగులు సాధు జంతువులు. వాటి జోలికి వెళ్తే తప్ప ఎవరికీ ఎటువంటి హానీ కలిగించవు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏనుగులకు సంబంధించిన ఎన్నో వీడియోలు (Elephant Videos) ప్రతిరోజు అప్‌లోడ్ అవుతున్నాయి. అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతున్నాయి. తాజాగా ఓ బుల్లి ఏనుగుకు (Baby Elephant) సంబంధించిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో తల్లి ఏనుగు పక్కనే ఓ పిల్ల ఏనుగు నిల్చుని ఉంది. చాలా చిన్న వయసులో ఉన్న ఆ ఏనుగుకు తన తొండం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అనుకోకుండా తొండం మీద కాలు వేయడంతో ఆ ఏనుగుకు ఆశ్చర్యం వేసింది. ఆ తొండాన్ని అనేక రకాలుగా పరీక్షించి చూసుకుంది (Baby elephant playing with its trunk). ఆ క్యూట్ వీడియో చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. ``పిల్ల ఏనుగు తన తొండాన్ని కనుగొంది`` అంటూ @buitengebieden అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.

Swiggy delivery boy: పాపం.. అతను అందరి ఆకలీ తీరుస్తాడు.. రోడ్డు పక్కన కూర్చుని తన ఆకలి ఎలా తీర్చుకుంటున్నాడో చూడండి..

ఈ క్యూట్ వీడియోను ఇప్పటివరకు 10 లక్షల మంది వీక్షించారు. అనేక మంది ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``అప్పుడే పుట్టిన పిల్లలు ఇలాగే తమ వేళ్లను చూసి ఆశ్చర్యపోతుంటారు``,` ``ఈ వీడియో చాలా క్యూట్``, ``ఈ తొండాన్ని ఎలా ఉపయోగించాలి అని పరీక్షిస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-01T15:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising