ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shocking Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కొండపై నుంచి కిందకు ఎలా పడ్డారో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-08-21T11:24:23+05:30

చాలా కొద్ది మంది వ్యక్తులకు సాహస క్రీడలంటే ఇష్టం ఉంటుంది. వారు తమ అభిరుచిని నెరవేర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తారు. కొందరు ఆకాశంలో గ్లైడింగ్ చేస్తారు. కొందరు పర్వతాల నుంచి కిందకు దూకుతారు. కొందరు సముద్రంలో సెయిలింగ్‌కు వెళతారు.

చాలా కొద్ది మంది వ్యక్తులకు సాహస క్రీడలంటే (Adventure games) ఇష్టం ఉంటుంది. వారు తమ అభిరుచిని నెరవేర్చుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తారు. కొందరు ఆకాశంలో గ్లైడింగ్ చేస్తారు. కొందరు పర్వతాల నుంచి కిందకు దూకుతారు. కొందరు సముద్రంలో సెయిలింగ్‌కు వెళతారు. అలాంటి ఎన్నో సాహస క్రీడలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఊపిరి ఆగినంత పని అవుతోంది.

@MindExpanding1 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కొండపై నీరు అతి వేగంగా ప్రవహిస్తోంది. కొండపై నుంచి కిందకు జలపాతం ఉరుకుతోంది. ఆ నీటిలో ఇద్దరు వ్యక్తులు చిన్న పడవలపై రాఫ్టింగ్‌ (Rafting)కు వచ్చారు. అంత ఎత్తైన కొండ మీద నుంచి జలపాతంతో పాటు పడవతో సహా కిందకు దూకారు. అతి వేగంగా ఆ పడవ నీళ్ల లోపలికి దూసుకుపోయింది. కొద్ది క్షణాల తర్వాత క్షేమంగా బయటకు వచ్చింది.

Viral: ఏంది సామీ ఇది.. కేక్ కట్ చేసినందుకు అంత దోపిడీనా? రెస్టారెంట్ బిల్లు చూసి అవాక్కైన కస్టమర్లు!

భయంకరమైన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా రాఫ్టింగ్ చేయాలంటే ధైర్యంతో పాటు ఎంతో ట్యాలెంట్ కూడా అవసరం. ఈ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ``వావ్.. ఇది అద్భుతం``, ``శౌర్యం, నైపుణ్యం కలయిక``, ``చూడడానికే భయంకరంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-21T11:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising