Kolkata Local Train: నెట్టింట ఆంటీల ఫైటింగ్ హల్‌చల్.. లోకల్ ట్రైన్లో పొట్టుపొట్టు కొట్టుకున్నారు..!
ABN, First Publish Date - 2023-07-12T17:54:13+05:30
రెండు కొప్పులు ఒక దగ్గర ఉండలేవని తెలుగులో ఎప్పటి నుంచో ఒక నానుడి ఉంది. రోడ్లపై మహిళలు ఒకరిని ఒకరు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం, షాపింగ్ మాల్‌లో ఒకే చీర కోసం ఇద్దరు కొట్టుకోవడం, లేదంటే భర్తను భార్య కొట్టడం ఇలాంటి అనేక ఘటనలను మనం ఇప్పటికే చూసేశాం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇంతకు మించి అనేలా ఉంది.
రెండు కొప్పులు ఒక దగ్గర ఉండలేవని తెలుగులో ఎప్పటి నుంచో ఒక నానుడి ఉంది. రోడ్లపై మహిళలు ఒకరిని ఒకరు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం, షాపింగ్ మాల్‌లో ఒకే చీర కోసం ఇద్దరు కొట్టుకోవడం, లేదంటే భర్తను భార్య కొట్టడం ఇలాంటి అనేక ఘటనలను మనం ఇప్పటికే చూసేశాం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఇంతకు మించి అనేలా ఉంది. కోల్‌కతాలోని ఓ లోకల్ ట్రైన్‌లో 40 నుంచి 50 మంది మహిళలు గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. రైలులోని లేడీస్ కోచ్‌లో ఉన్న మహిళలు గొడవపడుతున్నారు. వారంతా 40 నుంచి 50 మంది వరకు ఉండొచ్చు. ఈ గొడవకు గల కారణం తెలియదు కానీ వారంతా గ్రూపులుగా విడిపోయి ఒకరినొకరు దారుణంగా కొట్టుకుంటున్నారు. చెప్పులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పరమ బూతులు తిట్టుకుంటూ ఇష్టమొచ్చినట్లుగా కొట్టుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వారి ఫైటింగ్ ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ ని మించిపోయిందనే చెప్పుకోవాలి. కనీసం ఆ గొడవను ఆపే ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. వీడియో చివరలో ఒకావిడ ఆ కోచ్‌లో ఉన్న ఏకైక అబ్బాయిని చెప్పుతో కొట్టడం గమనార్హం. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. రైలులో ఉచిత ఉబ్ల్యూడబ్ల్యూఈ అని ఒకరు వ్యంగ్యాస్త్రం సంధిస్తే.. మరొకరేమో ‘ముంబై లోకల్ ప్రొ వెర్షన్’ అని కామెంట్ చేశారు. మరికొందరైతే ఇప్పటి నుంచి రైలు ఎక్కినప్పుడు లేడీస్ కోచ్‌కు దూరంగా ఉంటామని నెట్టింట సెటైర్లేశారు.
Updated Date - 2023-07-12T17:54:13+05:30 IST