ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చేతులెత్తి మొక్కుతున్నాం.. వదిలేయండన్నా వినని గ్రామస్తులు.. అక్కాతమ్ముళ్లను చెట్టుకు కట్టేసి మరీ చిత్రహింసలు పెట్టడం వెనుక..

ABN, First Publish Date - 2023-04-10T15:13:21+05:30

అదొక పల్లెటూరు. వారిద్దరూ అక్కాతమ్ముళ్లు (brother sister). ఆమెకు వివాహం అయింది. భర్త పని మీద బయటకు వెళ్లాడు. ఊరు నుంచి తమ్ముడు వస్తే ఆరుబయట మంచం మీద కూర్చుని ఆ ఊసూ ఈ ఊసూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపటికే గ్రామ పెద్దలు (Villagers) ఆ ఇద్దర్నీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అదొక పల్లెటూరు. వారిద్దరూ అక్కాతమ్ముళ్లు (brother sister). ఆమెకు వివాహం అయింది. భర్త పని మీద బయటకు వెళ్లాడు. ఊరు నుంచి తమ్ముడు వస్తే ఆరుబయట మంచం మీద కూర్చుని ఆ ఊసూ ఈ ఊసూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపటికే గ్రామ పెద్దలు (Villagers) ఆ ఇద్దర్నీ తాళ్లతో బంధించి చెట్టు(tree)కు కట్టేసి చావబాదారు. వదిలేయండి అంటూ చేతులెత్తి మొక్కినా ఒక్కడూ కనికరించలేదు. అసలు వారిద్దరు చేసిన నేరమేంటి? ఎందుకు కట్టేసి కొట్టారు. వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

సహజంగా గ్రామాలకు ఎవరైనా కొత్త వారు వచ్చారంటే అనుమానంగా చూస్తుంటారు. అదే పట్టణాల్లో అయితే ఎవరి దారినా వారు వెళ్లిపోతుంటారు. పెద్దగా ఇబ్బందులు ఉండవు. అదే పల్లెటూరులో అయితే అన్ని అనుమానాలే.. కొత్తగా వచ్చిన వ్యక్తి గురించి తెలుసుకునేంత వరకూ నిద్ర పట్టదు. అంతగా అబ్జర్వేషన్ చేస్తుంటారు. అదే ఆ కుర్రాడికి ముప్పుతీసుకొచ్చింది. సోదరుడని అక్క చెప్పినా గ్రామస్తులు పెడచెవిని పెట్టి దారుణంగా హింసించారు.

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) ఖాండ్వా జిల్లా పిప్లాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బామండ గ్రామం. అక్రమ సంబంధం ఉందన్న అనుమానంతో జ్ఞాన్‌లాల్ అనే 21 ఏళ్ల యువకుడిని, అతని అక్క (కజిన్ సిస్టర్) కళావతిని చెట్టుకు కట్టేసి దారుణంగా గ్రామస్తులు చితక కొట్టారు. ఈనెల 3న (ఏప్రిల్) ఈ దుర్ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో గురువారం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది. బాధితుడు తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు గ్రామంలోకి రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేపట్టారు.

అక్క కళావతిని కలిసేందుకు బామండ గ్రామానికి వచ్చినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇద్దరం కలిసి ఇంటి ముందు ఒకే మంచంపై కూర్చున్నామని తెలిపాడు. అటుగా వచ్చిన గ్రామ పెద్దలు చూసి తమ మధ్య ఏదో అక్రమ సంబంధం ఉందనుకుని చెట్టుకు కట్టేసి కొట్టారని తెలిపాడు. ఇలా జరుగుతున్నప్పుడే జ్ఞాన్‌లాల్ తన బావ అంటూ కళావతి భర్త ఫోన్‌లో చెప్పినప్పటికీ గ్రామస్తులు ఏ మాత్రం వినిపించుకోకుండా కొట్టారని బాధితుడు ఫిర్యాదులో తెలియజేశాడు. జ్ఞాన్‌లాల్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు చెట్టుకు కట్టేసి పైశాచికంగా దాడి చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-04-10T15:21:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising