ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: తస్మాత్ జాగ్రత్త.. 90,864 స్మార్ట్ ఫోన్‌లు చోరీ.. ప్రతి 6 నిమిషాలకు ఒకటి మాయం.. ఎక్కడంటే..?

ABN, First Publish Date - 2023-08-16T16:34:22+05:30

ప్రస్తుత ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్‌ల వాడకం ఎక్కువైపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దాదాపుగా ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్‌లు కనిపిస్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుంటే నామోషీగా ఫీలవుతున్నారు.

ప్రస్తుత ఆధునిక యుగంలో మొబైల్ ఫోన్‌ల వాడకం ఎక్కువైపోయింది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా దాదాపుగా ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్‌లు కనిపిస్తున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుంటే నామోషీగా ఫీలవుతున్నారు. చేతిలో ఏం ఉన్న లేకున్నా స్మార్ట్ ఫోన్ మాత్రం కచ్చితంగా ఉండాల్సిందే. దీంతో ధర ఎంతైనా సరే వెచ్చించి స్మార్ట్ ఫోన్‌లు కొంటున్నారు. అయితే విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్‌లు కనిపిస్తుంటే దొంగ బాబులు మాత్రం ఎందుకు ఉరుకుంటారు. అందినకాడికల్లా దోచేసుకుంటున్నారు. పైగా స్మార్ట్ ఫోన్‌లను సెకండ్ హ్యాండ్‌లో అమ్మిన మంచి ధరే పలుకుతుంది. దీంతో స్మార్ట్ ఫోన్‌లను దొంగిలించి వాటిని అమ్మితే వచ్చిన సొమ్ముతో దొంగలు దర్జాగా బతికేస్తున్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్‌ల దొంగతనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ దొంగతనాల సంఖ్య లండన్‌లో మరి ఎక్కువగా ఉంది. ఎంతలా అంటే ప్రతి 6 నిమిషాలకు ఒక స్మార్ట్ ఫోన్‌ దొంగతనానికి గురవుతుంది. దీనిని బట్టే చెప్పొచ్చు. లండన్‌లో స్మార్ట్ ఫోన్‌ల దొంగతనాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో.


మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2022 సంవత్సరం మొత్తంలో లండన్‌లో 90,864 స్మార్ట్ ఫోన్‌లు దొంగిలించబడ్డాయి. అంటే ఒక రోజుకు సగటున 250 స్మార్ట్ ఫోన్‌లు చోరీకి గురవుతున్నాయి. ప్రతి 6 నిమిషాలకు ఒక స్మార్ట్ ఫోన్‌ను దొంగలు కొట్టేస్తున్నారు. దొంగల వ్యక్తిగత దోపిడీలో ఫోన్ దొంగతనాలే 38 శాతం ఉన్నాయి. గత సంవత్సరం లండన్‌లో జరిగిన దొంగతనాలలో దాదాపు 70 శాతం సెల్ ఫోన్‌లకు సంబంధించినవే అని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇందులో 14 నుంచి 20 సంవత్సరాల వయసు గల వారు ఎక్కువగా ఉన్నారు. ఈ వయసు గల వారిలో బాధితులు, నేరస్థులు ఇద్దరూ ఉన్నారు. కాగా ఈ ఏడాది జనవరిలో స్మార్ట్ ఫోన్‌ల దొంగతనాలకు సంబంధించి 8,500 ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 119 ఫిర్యాదులకు సంబంధించి ఫోన్‌లను రికవరీ చేసి యజమానులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ల దొంగతనాలకు సంబంధించి లండన్ మేయర్ సాదిక్ ఖాన్, మెట్రోపాలిటన్ పోలీస్ కమీషనర్ సర్ మార్క్ రౌలీ సంయుక్తంగా ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. ఈ దొంగతనాలను నిరోధించడానికి స్మార్ట్ ఫోన్‌ల కంపెనీల యాజమాన్యంతో కలిసి పని చేస్తున్నట్లు వారు తెలిపారు.

Updated Date - 2023-08-16T16:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising