Viral News: కామన్ మ్యాన్ ఖాతాలోకి రాత్రికి రాత్రే రూ.200 కోట్లు.. ఊళ్లో అందరికీ మెసేజ్ చూపించి మరీ ఏం చేశారంటే..!
ABN, First Publish Date - 2023-09-08T14:52:52+05:30
అతనొక దినసరి కూలి. రెక్కాడితే కానీ డొక్కాడదు. కానీ ఉన్నట్టుండి అతని బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 200కోట్లు జమ అయ్యాయి. ఈ విషయం తెలిసిన తరువాత ఆ కుటుంబం చేసిన పని తెలిస్తే..
అతనొక దినసరి కూలి. రెక్కాడితే కానీ డొక్కాడదు. కానీ ఉన్నట్టుండి అతని బ్యాంక్ ఖాతాలోకి ఏకంగా 200కోట్లు జమ అయ్యాయి. వేల రూపాయలు కళ్ళారా చూడటమే కష్టమైపోయిన వారికి కోట్ల సంఖ్య చూడగానే దిమ్మ తిరిగిపోయింది. కనీసం బ్యాంక్ అకౌంట్లో డబ్బు జమ అయిన విషయం కూడా అతనికి తెలియకపోవడం గమనార్హం. పోలీసులు స్వయంగా బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ అయిన విషయం తెలియజేశారు. డబ్బు అకౌంట్లో పడిందనిలతెలిసిన తరువాత జరిగిన పరిణామాలు విస్తుపోయేలా ఉన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
హర్యానా(Haryana) రాష్ట్రం చర్కీ-దాద్రీ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామంలో విక్రమ్ అనే కుర్రాడు నివసిస్తున్నాడు. ఇతను 8వ తరగతితో తన చదువు ఆపేశాడు. తన బంధువు అయిన ప్రదీప్ తో కలసి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరిది పేద కుటుంబం. లక్షలు, కోట్లు కాదు కదా వేల రూపాయలు కూడా కళ్లారా చూడటం అరుదే. అయితే పోలీసులు విక్రమ్ ఇంటికి చేరుకుని అతని యాష్ బ్యాంక్ ఖాతాలో 200కోట్లు జమ అయ్యాయని(200 crores add in bank account) చెప్పారు. దాని గురించి విచారించారు. పోలీసులు చెబుతున్నది నిజమా అబద్దమా అనే విషయం కూడా మొదట ఆ కుటుంబానికి అర్థం కాలేదు. ఆ తరువాత 200కోట్ల సంఖ్యను తన ఖాతాలో చూసి విక్రమ్ కి దిమ్మ తిరిగిపోయింది. వెంటనే తన బంధువు కూడా ఈ విషయం తెలుసుకుని విస్తుపోయాడు. బ్యాంక్ ఖాతాలో అంత డబ్బు ఎలా జమ అయ్యిందో తమకు తెలియదని వారు చెప్పారు. వారిద్దరూ బ్యాంక్ మెసేజ్ ను గ్రామస్తులందరికీ చూపించి మరీ డబ్బు జమ అయిన విషయం చెప్పారు. డబ్బు జమ కావడం పట్ల విక్రమ్ కుటుంబం మొత్తం భయపడుతోంది. 'మాకు ఇంత డబ్బు అవసరం లేదు, ఇంత డబ్బు మా దగ్గర ఉంటే కోరి శత్రువులను తయారుచేసుకున్నట్టే.. ఈ డబ్బును ప్రభుత్వం తీసుకుని దీంతో ఏవైనా ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది' అని విక్రమ్ కుటుంబం చెబుతోంది.
Tea vs Coffee: టీ, కాఫీలు తాగే అలవాటుందా..? సరిగ్గా 30 రోజుల పాటు వాటిని మానేస్తే జరిగేది ఇదే..!
బ్యాంక్ ఖాతాలో 200కోట్లు జమ అయిన తరువాత విక్రమ్ కూడా చాలా లోతుగా ఎంతో పరిణితితో ఆలోచించాడు. 'ఇదేదో పెద్ద స్కామ్ లాగా ఉంది. దీని వెనుక పెద్ద మోసాలు జరుగుతున్నట్టున్నాయి' అని చెప్పుకొచ్చాడు. వెంటనే ఈ విషయాన్ని ఇంటికి వచ్చిన పోలీసుల సహాయంతో ప్రధాని, సీఎం, డీజిపి, పోలీసు ఉన్నతాధికారులను మెన్షన్ చేస్తూ ట్విట్ చేశారు. ఆన్ లైన్ లోనే ఈ సంఘటన గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు గురించి పోలీసులు ఏమీ మాట్లాడలేదు. విక్రమ్ బ్యాంక్ ఖాతాను ఎవరో హ్యాండిల్ చేస్తున్నారనే విషయం మాత్రం చూచాయగా తెలిసింది. బ్యాంక్ అధికారులు ఈ బ్యాంక్ ఖాతాను స్థంభింపచేశారు. విక్రమ్ బెర్లాలో ఉంటూ కూలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే రెండు నెలల క్రితం ఉద్యోగం కోసం పటౌడీ వెళ్ళాడు. అక్కడ ఎక్స్పెస్ 20 అనే నిర్మాణ కంపెనీలో పనికి చేరాడు. ఆ సమయంలో అతని శాలరీ పేమెంట్ కోసం బ్యాంక్ ఖాతా తీయడానికి వివిధ సర్టిఫికెట్లు తీసుకున్నారు. అయితే 17రోజుల తరువాత ఉద్యోగం సరిగా చేయలేదనే కారణంతో ఈ ఉద్యోగంలో నుండి తొలగించారు. అతని బ్యాంకు ఖాతాను క్లోజ్ చేయమని చెప్పారు. కానీ విక్రమ్ అకౌంట్ క్లోజ్ చెయ్యలేదు.
Wife-Husband: భర్తతో పొరపాటున కూడా భార్య అనకూడని మాటలివీ.. సరదాకయినా ఈ కామెంట్స్ చేస్తే ఇక అంతే సంగతులు..!
Updated Date - 2023-09-08T14:52:52+05:30 IST