కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral News: పార్క్ చేసి ఉన్న కారు డోరుకు అంటించి ఉందో నోటీస్ బోర్డు.. సంతకం చేసి మరీ అందులో ఏం రాశారో చదివితే..!

ABN, First Publish Date - 2023-06-30T15:34:51+05:30

కాలంతో పాటు ప్రజలు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు. తాము చెప్పాలనుకున్నదాన్ని, చెయ్యాలనుకున్నదాన్ని చాలా వింతగా, వెరైటీగా చేస్తుంటారు. బెంగుళూరులోనూ ఇప్పుడు అలాంటిదే ఓ సంఘటన చోటుచేసుకుంది

Viral News: పార్క్ చేసి ఉన్న కారు డోరుకు అంటించి ఉందో నోటీస్ బోర్డు.. సంతకం చేసి మరీ అందులో ఏం రాశారో చదివితే..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలంతో పాటు ప్రజలు కూడా చాలా అప్డేట్ అవుతున్నారు. తాము చెప్పాలనుకున్నదాన్ని, చెయ్యాలనుకున్నదాన్ని చాలా వింతగా, వెరైటీగా చేస్తుంటారు. బెంగుళూరుకు చెందిన ఓ పొరుగింటివారు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కారు డోరుకు నోటిసు బోర్డు అంటించి మరీ వారు చేసిన పనేంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు. 'ఇలా కూడా చేయచ్చా' అనే ఫీల్ ఇస్తున్న నోటీస్ బోర్డు కథ ఏంటో పూర్తీగా తెలుసుకుంటే..

సాధారణంగా ఇరుగిల్లు, పొరుగిల్లు అంటే ఏవో ఒక గొడవలు, కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళింటి చెత్త వీళ్ళింటికి, వీళ్ల కుక్క వాళ్ళింట్లోకి, ఇరుగుపొరుగు పిల్లల అల్లర్లు ఇలా చాలానే గొడవలకు కారణం అవుతుంటాయి. బెంగుళూరు నగరం(Bengaluru city) కొరమంగళ ప్రాంతంలో(Koramangal area) నివసించే ఇరుగు పొరుగు(neighbour) వారి మధ్యనా ఓ సమస్య నెలకొంది. వారిమధ్య కార్ పార్కింగ్(car parking note) విషయంలో సమస్య నెలకొంది. దీనికి పరిష్కారంగా ఓ కుటుంబం తమకున్న ఇబ్బందిని తెలియజేస్తూ తమ పొరుగువారి కారుమీద నోటీసు బోర్డు అతికించారు(notice board stick on car window glass). అందులో ఇలా రాసుంది. 'హాయ్..దయచేసి మీ కారును ఇక్కడ పార్క్ చేయకండి. ఈ విషయాన్ని మీకు మేము చాలా సార్లు చెప్పాము. మేము ఈ ప్రాంతంలో 2000సంవత్సరం నుండి ఉంటున్నాము. మాకు రెండు కారులు ఉన్నాయి. మా కారులు పార్క్ చేసుకోవడానికి మాకు స్థలం కావాలి. కాబ్టటి మీరు మీ కారును ముందు పార్క్ చేసుకునే చోటనే పార్క్ చేసుకోండి. మనం మంచి ఇరుగుపొరుగు వారిగా ఉందాం. ఇట్లు మీ పొరుగువారు'. అంటూ ఆ నోటీసు బోర్డులో సారాంశం సాగింది.

Anand Mahindra: సిటీలో ఉంటున్నారా..? అయితే ఈ వీడియో మీ కోసమే.. ఆనంద్ మహీంద్రాయే ఫిదా అయిపోయారు..!


ఈ నోటీస్ బోర్డును Subhasis Das (సుభాసిస్ దాస్ )అనే వ్యక్తి ట్విట్టర్(Twitter) అకౌంట్ లో షేర్ చేశారు. ఇది తనకు బెంగుళూరు నగరం కొరమంగళ ప్రాంతంలో కనిపించిందని క్యాప్షన్ లో మెన్షన్ చేశారు. ఈ నోటీస్ చూసిన నెటిజన్లు దీనికి ఫిదా అవుతున్నారు. 'తమ సమస్యను ఇంత మర్యాదపూర్వకంగా ఎవరూ ఇంత వరకు చెప్పి ఉండరేమో.. చాలా వరకు ఇలాంటి విషయాల్లో గొడవలు చోటుచేసుకుంటాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'మంచి పొరుగువారిగా ఉండటం మంచిది కదా' అని మరొకరు అన్నారు. 'బెంగుళూరు ప్రజలు ఎంతమంచివారో' అని ఈ నోటీస్ బోర్డుకు ఇంప్రెస్ అవుతున్నారు. 'ఇదే గుర్గావ్ లో జరిగి ఉంటే పొరుగువారు బేస్ బాల్ బ్యాట్ తో కారు విండోలు పగలగొట్టేవారు' అని మరొకరు చెప్పుకొచ్చారు.

Viral: డాబాపై టీవీ యాంటినాకు ఇలా ప్లాస్టర్లు వేసి మరీ ఓ డబ్బాను చుట్టేశారు.. సడన్‌గా ఇప్పుడీ ఫొటో ఎందుకు వైరల్‌గా మారిందంటే..!


Updated Date - 2023-06-30T15:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising