ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఇలాంటి వాళ్లే కదా జనాల గోడు వినేది.. నడిరోడ్డుపై కూర్చుని మరీ ఈ ముసలాయన చెప్పేది వింటున్న ఈమె ఎవరో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-04-04T11:44:26+05:30

కనీసం తమ గోడు ఎవరైనా విన్నా చాలు వారు సంతోషిస్తారు. ఓ వికలాంగ తాతగారు తన గోడు చెబుతుంటే ఓ మహిళ చాలా శ్రద్దగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సమాజంలో ఇబ్బందులు పడుతున్నవారు చాలామంది ఉంటారు.ఇందులో వికలాంగులు(Disabled people) ముందు వరుసలో ఉంటారు. మరీ ముఖ్యంగా వృద్ద వికలాంగులు(Old Disabled people) పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. పనులు చేసుకోవడానికి శరీరం సహకరించకా.. సహాయం చేసేవారు లేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. కనీసం తమ గోడు ఎవరైనా విన్నా చాలు వారు సంతోషిస్తారు. ఓ వికలాంగ తాతగారు తన గోడు చెబుతుంటే ఓ మహిళ చాలా శ్రద్దగా వింటున్న ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. 'ఎవరీమె..?' అంటూ నెటిజన్లు ఆమె ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు. దీని గురించి పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం కాన్పూర్(Kanpur) జిల్లాలో అనురౌధ నగర పంచాయితీలో ధనిరామ్ అనే ఒక తాత నివసిస్తున్నాడు. ఆ తాత వికలాంగుడు.. వయసేమో పెద్దది. దీంతో ఆయనకు నడవడానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. స్థానికంగా రాష్ట్రప్రభుత్వ కార్యక్రమం ఒకటి అక్కడ జరుగుతోంటే ఒక అర్జీ పత్రం(Application form) రాసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆయన సమావేశ భవనం బయట ఎర్రటి ఎండలో పడిగాపులు కాస్తూంటే అటుగా వెళ్తున్న మహిళ ఆ తాత పరిస్థితి చూసింది. ఆయన దగ్గరకు వెళ్ళి పరిస్థితి ఏంటని అడిగింది. పాపం నడవలేని ఆ తాత నేల మీద కూర్చొనే ఆ మహిళకు తన సమస్యను చెప్పాడు. ఆ మహిళ కూడా ఆ తాత చెప్పేదంతా అక్కడే కూర్చుని విన్నది. 'నడవడం ఇబ్బందిగా ఉంది, ఎలక్ట్రానిక్ సైకిల్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వ సాయం అడుగుదామని వచ్చాను' అని ఆ తాత ఆ మహిళతో చెప్పాడు. ఆమె స్వయానా ఐఏయస్ అధికారిణి(IAS Officer), కాన్పూర్ చీఫ్ డవలప్మెంట్ ఆఫీసర్(Kanpur chief development officer) కావడంతో ఆ తాత చెప్పింది విని చలించిపోయింది. ఆ తాతకు మాత్రమే కాకుండా వృద్దులకు అందరికీ ప్రయోజనాలు కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.

Read also: ముప్పై ఏళ్ళ తరువాత పక్కాగా ఇవి తీసుకోవాల్సిందే.. లేకపోతే 40ఏళ్ళకే 60లా..


కాన్పూర్ చీఫ్ డవలప్మెంట్ ఆఫీసర్ అయిన ఈమె పేరు సౌమ్య(Kanpur chief development officer saumya pandey). ఈమె నేల మీద కూర్చుని వికలాంగ వృద్దుడితో మాట్లాడుతున్న సమయంలో అక్కడ కొందరు ఫోటోలు తీశారు. కాన్పూర్ CDO ట్విట్టర్ అకౌంట్ CDO Kanpur Dehat లో ఈ ఫోటోలు షేర్ చేశారు. 'దివ్యాంగ వృద్దుడి సమస్య విన్న ఐఏయస్ అధికారిణి ఆయనకు అన్ని ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు' అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'అంత పెద్ద ఆఫీసర్ అయినా ఏమాత్రం గర్వం లేకుండా తాతతో మాట్లాడిన విధానం ఆమె ప్రవర్తన ఎలాంటిదో తెలుపుతోంది' అని అంటున్నారు నెటిజన్లు. 'వృత్తికి న్యాయం చేయడం అంటే ఇదే.. ఆమెకు అభినందనలు' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఐఏయస్ అధికారిణి అందరి హృదయాలను దోచేస్తోంది.

Read also: AC vs Coolers: కూలరా..? ఏసీనా..? రెండింటిలో ఏది బెస్ట్..? దేని నుంచి వచ్చే గాలి మంచిది..? చాలా మందికి తెలియని నిజాలివి..!


Updated Date - 2023-04-04T11:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising