ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: పాకిస్తానీ యువతితో ఆన్‌లైన్‌ ప్రేమ.. పెళ్లి చేసుకునేందుకు ఫ్యామిలీతో సహా పాక్‌కు.. చివరకు ఎలా తిరిగి వస్తున్నాడంటే..!

ABN, First Publish Date - 2023-05-03T20:44:41+05:30

కుర్రాడు ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి కుటుంబంతో సహా పాకిస్తాన్ కు వెళ్లాడు. ఎంతో ఆశతో పాకిస్తాన్ కు వెళ్లిన ఆ కుర్రాడి కుటుంబానికి అక్కడ ఎదురైన అనుభవాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్తాన్ పేరె్త్తితేనే చిర్రుబుర్రులాడిపోతారు చాలామంది భారతీయులు. అలాంటిది భారతదేశానికి చెందిన ఓ కుర్రాడు పాకిస్తాన్ యువతితో ఏకంగా ప్రేమలో పడ్డాడు. అదేదో నేరుగా కలిసి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఆ తరువాత ప్రేమ వైపు అడుగులు వేసిన జంట కాదిది. పక్కాగా ఆన్లైన్లో సాగిన వ్యవహారం. ఇద్దరూ ఆన్లైన్లో పరిచయం అయ్యారు, ఆన్లైన్లోనే అభిప్రాయాలు తెలుసుకున్నారు, ఆన్లైన్లోనే ప్రపోజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కుర్రాడు ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి కుటుంబంతో సహా పాకిస్తాన్ కు వెళ్లాడు. ఎంతో ఆశతో పాకిస్తాన్ కు వెళ్లిన ఆ కుర్రాడి కుటుంబానికి అక్కడ ఎదురైన అనుభవాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. వారు పాక్ నుండి భారత్ కు ఎలా తిరిగివస్తున్నారో తెలిస్తే అంతా ఆశ్చర్యపోవాల్సిందే.. ప్రేయసితో పెళ్లి కోసం పాక్ కు వెళ్లిన ఈ కుర్రాడి గురించి పూర్తీగా తెలుసుకుంటే..

భారతదేశంలో(India) పాకిస్తాన్(Pakistan) పేరు ఎత్తినా.. పాకిస్తాన్ లో భారత్ పేరు ఎత్తినా అక్కడ ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందనే గ్యారెంటీ లేదు. రెండు దేశాల మధ్య శతృత్వం ఆ రేంజ్ లో ఉంటుంది. మన దేశంలో ముంబైకి(Mumbai man) చెందిన మహేంద్ర కుమార్ అనే కుర్రాడికి, పాకిస్తాన్ దేశం(Pakistan Women) సుక్కర్ లో నివసిస్తున్న సంజుగత్ అనే అమ్మాయికి ఆన్లైన్ లో స్నేహం(Online Friendship) కుదిరింది. వారిద్దరూ మొదట స్నేహితులు అయినా ఆ తరువాత వారి స్నేహం ప్రేమగా(friendship became love) మారింది. ఈ క్రమంలోనే వారు పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే దేశాలు వేరు కావడంతో అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబాన్ని చూడటానికి, అబ్బాయి కుటుంబం అమ్మాయి కుటుంబాన్ని చూడటానికి వీలుపడలేదు. కానీ మహేంద్ర, సంజుగత్ ఇద్దరూ నిరుత్సాహ పడలేదు. వారిద్దరూ తమ కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి వాట్సాప్ వీడియో కాల్ లోనే ఇరుకుటుంబాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచారు. రెండు కుటుంబాలు కూడా పరిస్థితులను అర్థం చేసుకున్నాయి.

Man with Woman Voice: పుట్టుకతోనే అమ్మాయి గొంతు.. మగాడివి కాదంటూ అంతా హేళన చేసినా.. ఈ కుర్రాడు ఇప్పుడేం చేస్తున్నాడంటే..


మహేంద్ర, సంజు ఇష్టానికి విలువ ఇస్తూ ఇరుకుటుంబాలు పెళ్లికి అంగీకరించాయి. ఈ క్రమంలోనే మహేంద్ర తన కుటుంబ సభ్యులను తీసుకుని పాకిస్తాన్ కు వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే మహేంద్ర కుటుంబానికి ఊహించని విధంగా ఘన స్వాగతం(grand welcome) లభించింది. వధూవరుల కుటుంబాలు రెండూ సుక్కర్ లో ఏర్పాటు చేసిన పెళ్లిమండపానికి చేరుకున్నారు. అక్క డ వారిద్దరి వివాహం భారతీయ హిందూ సంప్రదాయంలో(Indian Hindu Tradition) ఎంతో ఘనంగా జరిపించారు. పాకిస్తాన్ లో హిందూ సాంప్రదాయంలో పెళ్లి అంత ఘనంగా జరగటంతో వరుడి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. అంతే కాదు పాకిస్తాన్ లో చట్టపరమైన ఫార్మాలిటీలను పూర్తీచేసిన తరువాత సంజుగత్ పూర్తీగా భారతదేశానికి వచ్చేస్తున్నట్టు మహేంద్ర కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఈ జంట పెళ్లి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'ప్రేమకు సరిహద్దులు లేవు అనే మాట అక్షరాలా నిజం. మధ్యలో ఏవైనా ఇబ్బందులు వచ్చినా అవన్నీ నిజమైన ప్రేమ ముందు కొట్టుకుని పోతాయి' అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Leftover Rice: మిగిలిపోయిన అన్నంతో మర్నాడు టిఫిన్లు చేసే అలవాటున్న వాళ్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది..!


Updated Date - 2023-05-03T20:44:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising