ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ప్రేయసికి ప్రపోజ్ చేస్తోంటే సడన్‌గా వచ్చి ఉంగరం లాక్కున్నాడో వ్యక్తి.. ఈ వైరల్ వీడియో వెనుక అసలు నిజాలివీ..!

ABN, First Publish Date - 2023-04-20T22:17:13+05:30

జీవితంలో ఎంతో తియ్యని జ్ఞాపకంగాఉండాల్సిన ప్రపోజల్ మూమెంట్స్ కాస్తా ఇలా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవితంలో కొన్ని విషయాలు చాలా స్పెషల్. అలాంటి వాటిలో ప్రేమ, పెళ్ళి ముందువరుసలో ఉంటాయని చెప్పవచ్చు. తనకు నచ్చిన అమ్మాయికి ప్రపోజ్ చేయడం ప్రతీ అబ్బాయి చేస్తాడు. అయితే కొందరు మాత్రం కాస్త ప్రత్యేకంగా ప్రపోజ్ చెయ్యాలని అనుకుంటారు. అమ్మాయికి ఎంతో ఇష్టమైన ప్రదేశానికి తీసుకెళ్ళి, ఆమెకు ఇష్టమైన స్పాట్ లో ప్రపోజ్ చేస్తే ఆమె ఎంతో సంతోషిస్తుందని ప్లాన్ చేస్తారు. ఓ వ్యక్తి తన ప్రేయసికి ఎంతో ఇష్టమైన స్పాట్ కు తీసుకెళ్ళాడు. తన వెంట తెచ్చిన ఉంగరాన్ని ఆమెకు చేతి వేలికి పెట్టే సమయానికి ఓ వ్యక్తి వచ్చి అతని చేతినుండి ఉంగరం లాగేసుకుని వారిని అక్కడినుండి పంపేశాడు. జీవితంలో ఎంతో తియ్యని జ్ఞాపకంగాఉండాల్సిన ప్రపోజల్ మూమెంట్స్ కాస్తా విషాదం అయిపోయాయే అని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అసలింతకూ ఆ వ్యక్తి ఉంగరమెందుకు లాగేసుకున్నాడు? వాళ్ళను అక్కడినుండి ఎందుకు పంపేశాడు.. పూర్తీగా తెలుసుకుంటే..

జీవితంలో ప్రేమ చాలా గొప్ప మలుపు అని చెప్పుకోవచ్చు. ఓ అమ్మాయిని ఇష్టపడటం ఆమెను జీవితభాగస్వామిగా(Life partner) మార్చుకోవడం ప్రతీ అబ్బాయికీ ఎంతో స్పెషల్.. ఫ్రాన్స్(France) దేశానికి చెందిన ఓ వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయిని పారిస్(Paris) లో ఆమెకు ఎంతో ఇష్టమైన డిస్నీ ల్యాండ్(Disney land) కు తీసుకెళ్ళాడు. అక్కడ ఆమెను వేదిక(stage) మీదకు తీసుకెళ్లి తన వెంట తెచ్చిన ఉంగరం(ring) ఆమె చేతికి పెట్టి పెళ్ళి ప్రపోజల్(marriage proposal) చేయాలన్నది అతని ఆలోచన. తను అనుకున్నట్టే ఆమెను వేదిక మీదకు తీసుకెళ్ళాడు. తన పాకెట్ నుండి రింగ్ బాక్స్ బయటకుతీసి రింగ్ ఆమె చేతి వేలికి పెడదాం అనుకుంటుండగా అక్కడికి ఓ వ్యక్తి వచ్చాడు. అతను డిస్నీ ల్యాండ్ లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయి(Disneyland employee). అక్కడి నిబంధనల(terms) ప్రకారం వేదిక మీదకు ఎవరూ వెళ్ళకూడదు. ఈ కారణంతో ఆ ఎంప్లాయీ ఉంగరాన్ని తీసుకుని వేదిక కిందకు వెళ్లాడు. ఆ జంటను కూడా కిందకు దిగి రావాల్సిందిగా అతను కోరాడు. ఆ జంట అయిష్టంగానే వేదిక నుండి దిగి వచ్చింది.

Viral Video: నిజమైన హీరోవంటే నువ్వేనయ్యా.. ఒంటె ఓ గొయ్యిలోకి తొంగి చూస్తోందేంటని ఈ వ్యక్తికి అనుమానం వచ్చి వెళ్లి చూస్తే..


అమ్మాయికి ప్రపోజ్ చేయబోయిన వ్యక్తి ముందుగానే అనుమతి(permission) అడిగి వేదిక మీదకు వెళ్లాడట. ఆ ఎంప్లాయీ మధ్యలో కల్పించుకుని వారిని నిరాశపరిచారని తెలిసింది. ఈ వీడియోను రెడ్డిట్(Reddit) అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షేర్ చేశారు. కాగా ఈ వీడియో చూసిన డిస్నీ ల్యాండ్ ప్రతినిధి(Disneyland representative) ఒకరు ఆ జంట సంతోషానికి భంగం కలిగించినందుకు క్షమాపణ చెప్పారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ జంట పట్ల విచారం వ్యక్తం చేశారు. మరికొందరు డిస్నీ ఎంప్లాయీకి మద్దతు పలికారు. 'రూల్ అందరికీ ఒకటే కదా.. అతని డ్యూటీ అతను చేశాడు ఇందులో తప్పేముంది?' అంటున్నారు. మరికొందరు 'ఆ జంట జీవితంలో కొన్ని ఆనందకరమైన క్షణాలు ఆ ఎంప్లాయీ వల్ల నాశనమైపోయాయి' అని కామెంట్స్ చేస్తున్నారు.

Viral News: తల్లి నుంచి మెసేజ్.. ఆఫీసులో మీటింగ్‌లో ఉన్నా.. ఏమైనా అర్జెంటా..? అని ఆ కొడుకు అడిగితే తల్లి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి..


Updated Date - 2023-04-20T22:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising