Viral News: దీనికి ఓకే చెబితేనే జాబ్ ఇస్తామంటూ ఓ కంపెనీ వింత కండీషన్.. ఇదెక్కడి విడ్డూరమంటూ విస్తుపోతున్న నెటిజన్లు..!
ABN, First Publish Date - 2023-06-07T18:22:14+05:30
ఓ కుర్రాడు ఎంతో ఆశతో ఓ కంపెనీలో ఉద్యోగానికి దరకాస్తు చేసుకున్నాడు. కానీ సదరు కంపెనీ ఇలా చేస్తేనే ఉద్యోగమంటూ పెట్టిన షరతు చూస్తే..
ప్రతి కంపెనీ తమ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులకు కొన్ని నియమనింబంధనలు విధిస్తుంది. ఆయా సంస్థలలో పనిచేసేవారు తప్పనిసరిగా ఆ నింబంధనలు ఫాలో అవ్వాల్సిందే. అవన్నీ పనివేళలు, జీతం, ప్రమోషన్లు, ఆఫీసులో డిసిప్లిన్ వంటి విషయాలై ఉంటాయి. కానీ ఓ వ్యక్తి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా అతనికి వింత అనుభవం ఎదురైంది. సదరు కంపెనీ వారు అతనికి మెయిల్ చేసి 'అందుకు ఒప్పుకుంటేనే ఉద్యోగం' అని గట్టిగానే చెప్పారు. నా పరిస్థితి ఇలా తయారైందంటూ ఆ వ్యక్తి తన గోడును సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ఈ విషయం బయటకొచ్చింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. 'వామ్మో ఇదేం విచిత్రం ఇలాంటి రూల్స్ ఎక్కడా చూళ్ళేదు' అని వాపోతున్నారు. ఈ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ఉద్యోగాల కోసం దరఖాస్తు(Job applications) చేసుకునేట్పప్పుడు కంపెనీ నియమనిబంధనలు(Rules & conditions) తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఓ వ్యక్తి డాగ్ రెస్క్యూ సెంటర్ లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నాడు(job apply in dog rescue center). అతని దరఖాస్తు పరిశీలించిన సదరు సంస్థవారు అతనికి తమ నియమనింబంధనలను మెయిల్ చేసింది. అందులో ఉన్న విషయాలను స్క్రోల్ చేస్తూ చదువుతున్నఅతని కళ్ళ ఒక పాయింట్ దగ్గర ఆగిపోయాయి. ఆ పాయింట్ క్లియర్ గా చదివిన అతనికి దిమ్మతిరిగిపోయింది. 'మీరు మా కార్యాలయంలో పనిచేయాలని అనుకుంటే ఖచ్చితంగా వేగన్(vegan) అయి ఉండాలి. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీ వెంట శాఖాహారమే తెచ్చుకోవాలి. ఆఫీసులో మొక్కలు, మొక్కల ఆధారిత పదార్థాలు తినాలి. ఆఫీసుకు దూరంగా ఉన్నప్పుడు శాఖాహారం ఫాలో అవ్వక్కర్లేదు కానీ ఆఫీసులో మాత్రం వేగన్ ఫుడ్ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ నిబంధనను మీరు ధృవీకరించగలరా?' అని అతనికి పంపిన మెయిల్ లో పొందుపరిచారు. అది చదివి అతను షాకయ్యాడు. సదరు కంపెనీ వేగన్ ఫుడ్ తీసుకునే వ్యక్తిని ఉద్యోగానికి డిమాండ్ చేస్తున్నారని అతను అర్థం చేసుకున్నాడు(company demand to man change as vegan).
ఈ విషయాన్ని రెడ్డిట్(Reddit) అనే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో షేర్ చేశాడు. అతని పోస్ట్ చూసిన నెటిజన్లు అవాక్కయ్యారు. ఈ విషయం తెలిసినవారు పలువిధాలుగా స్పందిస్తున్నారు. జీతం బాగుంటే వర్క్ టైంలో శాఖాహారిగా ఉండటానికి నాకెలాంటి అభ్యంతరం లేదు' అని ఒకరు కామెంట్ చేశారు. 'నేను యూదుల కమ్యూనిటీ సెంటర్ లో పనిచేశాను అక్కడ కూడా అచ్చం మీకులానే మాంసాహారం తీసుకురావడానికి అనుమతించలేదు' అని మరొకరు స్పందించారు. 'ఇది చాలా విచిత్రంగా ఉంది. అన్నిచోట్లా మాంసం దుకాణాలు కాకుండా శాఖాహారం దుకాణాలు ఉంటే బాగుండేది' అని మండిపడ్డారు.
Viral News: అయ్యా.. నా కూతురు పది పాస్ అయిందంటూ సంతోషాన్ని పంచుకుందో పనిమనిషి.. ఆ యజమాని ఏం చేశారో మీరే చూడండి..!
Updated Date - 2023-06-07T18:53:30+05:30 IST