Viral News: వామ్మో.. రోజుకు రూ.8 లక్షల ఆదాయమా..? కాలేజీ డ్రాపవుట్ అయిన ఈ యువతి ఏం చేసి అంత సంపాదిస్తోందంటే..!
ABN, First Publish Date - 2023-06-27T17:26:27+05:30
డబ్బు సంపాదనలో మగవాళ్లే కాదు మహిళలు కూడా సత్తా చూపిస్తున్న కాలం ఇది.
డబ్బు సంపాదనలో మగవాళ్లే కాదు మహిళలు కూడా సత్తా చూపిస్తున్న కాలం ఇది. ఎంత గొప్ప యూనివర్సిటీలలో చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం పొందినా ఏడాదికి కోటి రూపాయల వరకు ప్యాకేజీ పొందగలరు. కానీ రోజుకు 8లక్షలు సంపాదన ఊహించగలరా? ఈ 19ఏళ్ళ యువతి దాన్ని సుసాధ్యం చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా రోజుకు 8లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఈ అమ్మాయి ఎవరు? ఆమె కథేంటి పూర్తీగా తెలుసుకుంటే..
ఈ ప్రపంచంలో డబ్బు సంపాదంనలో(money earning) కష్టపడి చదివి మంచి కంపెనీలలో ఓ ప్యాకేజీ కుదుర్చుకుని ఉద్యోగం చేసేవారు(jobers)మొదటి రకం. తమకు తాము ఓ కొత్త మార్గాన్ని సృష్టించుకుని సొంతంగా ఎదగడం రెండోరకం. క్లో ఝూ రెండోరకానికి చెందిన అమ్మాయి. ఆస్ట్రేలియా(Australia) దేశం సిడ్నీలో(sidney) నివసించే క్లో ఝూ వయసు 19 సంవత్సరాలు(19 years young lady). ఆమెకు చదువుమీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఈ కారణంగానే ఆమె తన డిగ్రీని రెండుచోట్లకు మార్చింది. అయినా ఎక్కడా ఆమె కుదురుగా ఉండలేకపోయింది. దీంతో తనకు కాలేజీ చదువు సెట్ కాదని ఆమె నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే 2019లో కరోనా రావడంతో ఆమెకు చదువు మరింత కష్టమైన వ్యవహారంగా మారింది. తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా కాలేజీ చదువు మానేసింది. సుమారు 8నెలల వరకు తను కాలేజీ మానేసిన విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఆమె తన కెమిస్ట్రీ లెక్చరర్ చేతి వేళ్ళకు పెట్టుడు గోళ్లు(press on nails, artificial nails)ఉండటం చూసి ఆకర్షితురాలైంది. దానిమీద ఆమెకు ఆసక్తి కలిగింది.
Crime: కొడుకు ఆర్మీ ఆఫీసర్ అయ్యాడని తల్లిదండ్రులు కూడా నమ్మేశారు.. అదే చెప్పి పెళ్లి కూడా చేశారు.. కానీ ఒక్క మిస్టేక్తో..
క్లో ఝూ ట్యూషన్లు చెప్పి డబ్బు సంపాదించడం ద్వారా సేవ్ చేసుకున్న 20లక్షలను పెట్టుబడిగా మార్చుకుంది. గ్లోవీ(Glowie)అనే బ్రాండ్ నేమ్ తో పెట్టుడు గోళ్ళ వ్యాపారాన్ని తన అపార్టెంట్లో ఉన్న చిన్న గదిలో ప్రారంభించింది. టిక్ టాక్ వీడియోల ద్వారా తన వ్యాపారానికి ప్రమోషన్లు ఇచ్చుకుంది(promote in tik tok videos) దీంతో ఆమె వ్యాపారం ప్రారంభించిన మొదటిరోజు నుండే అమ్మకాలు ఆశాజనకంగా సాగాయి. ఇప్పుడు రోజుకు 8లక్షల రూపాయల విలువైన అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ విషయమంతా తెలిశాక క్లో ఝూ కుటుంబ సభ్యులు అంత సంతోషంగా రెస్పాండ్ కాలేదు. వారు క్లో ఝూ ను వ్యాపారానికి విరామం తీసుకుని మరీచదువుకోమని చెప్పారు. కానీ ఆమె తన వ్యాపారం మీదనే దృష్టి సారించింది. ఎంతోమంది యువతులకు ప్రేరణగా నిలుస్తోంది.
Aunties vs Couple: మెట్రో రైల్లో కొత్త జంట సరసాలు.. ఇదేం పనంటూ హెచ్చరించిన మహిళలు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..!
Updated Date - 2023-06-27T17:26:27+05:30 IST