Viral News: నిల్వ ఉంచిన మాంసం తింటున్నారా..మీరు డేంజర్‌లో పడ్డట్టే
ABN, First Publish Date - 2023-04-10T21:52:30+05:30
ఎర్ర మాంసంలో హేమ్ అనే రసాయనం విచ్చిన్నమై N-నైట్రోసో రసాయనాలు(N-Nitroso chemicals) ఏర్పడతాయి. ఇవి ప్రేగు(Bowel)లో ఉండే కణాలను..
ఎరుపు(Red meat), నిల్వ ఉంచిన మాంసం(Processed Meat)లో కొన్ని హానికరమైన రసాయనాలు ఉన్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. వీటి నుంచి వెలువడే రసాయనాలు క్యాన్సర్(Cancer)కు దారితీస్తున్నాయని తేలింది. ఎర్ర మాంసంలో హేమ్ అనే రసాయనం విచ్చిన్నమై N-నైట్రోసో రసాయనాలు(N-Nitroso chemicals) ఏర్పడతాయి. ఇవి ప్రేగు(Bowel)లో ఉండే కణాలను దెబ్బతీస్తాయని, ఇది ప్రేగు క్యాన్సర్(Bowel Cancer)కు దారితీస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే ప్రాసెస్డ్ చేసిన మాంసం తింటే కూడా వివిధ రకాల పదార్థాలు ఇలాంటి రసాయనాలే ఏర్పడతాయి.
తాజా ఐరోపా ఆరోగ్య నిపుణులు క్యాన్సర్‌కు కారణమయ్యే బీరు(Beer), నిల్వ ఉంచిన మాంసం(Processed Meat)లో కూడా రసాయనాలు ఉన్నాయని కనుగొన్నారు. ఈ కోణంలో పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు బీర్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని(అంటే ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వివిధ పదార్థాలు కలిపిన మాంసం) జాగ్రత్తగా ఉపయోగించాలని హెచ్చరించారు. కొన్ని ప్రాసెస్ చేసిన మాంసం, బీర్లలో నైట్రోసమైన్ వంటి హానికరమైన రసాయనాలు ఉన్నాయని, ఇవి ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఆరోగ్య నిపుణులు తెలిపారు.
నైట్రోసమైన్ చాలా ప్రమాదకరమైన రసాయనం, ఇది ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం, మూత్రపిండాలు, గొంతు, కడుపు క్యాన్సర్‌కు కారణమవుతుందని హెచ్చరించారు. శాస్త్రవేత్తలు ప్రాసెస్ చేసిన మాంసం (అనగా, ఎక్కువ కాలం నిల్వ ఉంచే అనేక పదార్థాలు జోడించబడిన మాంసం లేదా మాంసం నుండి తయారు చేసిన ఇతర వస్తువులు), ప్రాసెస్ చేసిన చేపలు, కోకో, బీర్, పాలు, తృణధాన్యాలు, కొన్ని రకాల కూరగాయలలో నైట్రోసమైన్(Nitrosamines)లను కనుగొన్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు, రుచికి, గులాబీ రంగులో మాంసం ఆకర్షణీయంగా కనిపించేందుకు నైట్రేట్స్ కలుపుతారు. ఇలా చేయడం వల్ల హామ్ తాజాగా కనిపిస్తుంది.
యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులు మాట్లాడుతూ..యూరప్‌లోని అన్ని వయసుల వారిపై నైట్రేట్‌ల ప్రభావాన్ని విశ్లేషించామని, నైట్రేట్‌లు అందరి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు కనుగొన్నామని చెప్పారు.
నైట్రోసమైన్స్ టాక్సిన్‌ను తొలగించడం అవసరం. శరీరం నుండి నైట్రోసమైన్ టాక్సిన్ ప్రభావాన్ని తగ్గించడానికి సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని యూరోపియన్ యూనియన్ యొక్క ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Updated Date - 2023-04-10T22:08:06+05:30 IST