Viral News: మూడేళ్ల తర్వాత హుండీ తాళం తీసిన ఆలయ సిబ్బందికి షాక్.. భక్తుల విరాళాలను లెక్కిద్దామని కూర్చుంటే..!
ABN, First Publish Date - 2023-06-15T12:03:49+05:30
ఏ గుడికి వెళ్ళినా అక్కడ హుండీలు ఖచ్చితంగా ఉంటాయి. కాస్త పెద్ద గుడులు అయితే ఒకటికి మించి హుండీలు ఉంటాయి. భక్తులందరూ కానుకలను హుండీలలోనే వేస్తుంటారు. 'హుండీలో వేసిన కానుకలు దేవుడికే చెందుతాయి' అనే మాటను కూడా హుండీల మీద రాసి ఉంటారు. ఓ గుడిలో ఆలయ సిబ్బంది దేవుడి హుండీలో డబ్బులు లెక్కిద్దామని హుండీ తెరిచారు. అయితే ఆ హుండీలో కనిపించిన దృశ్యం చూసి వారు షాకయ్యారు.
ఏ గుడికి వెళ్ళినా అక్కడ హుండీలు ఖచ్చితంగా ఉంటాయి. కాస్త పెద్ద గుడులు అయితే ఒకటికి మించి హుండీలు ఉంటాయి. భక్తులందరూ కానుకలను హుండీలలోనే వేస్తుంటారు. 'హుండీలో వేసిన కానుకలు దేవుడికే చెందుతాయి' అనే మాటను కూడా హుండీల మీద రాసి ఉంటారు. ఓ గుడిలో ఆలయ సిబ్బంది దేవుడి హుండీలో డబ్బులు లెక్కిద్దామని హుండీ తెరిచారు. అయితే ఆ హుండీలో కనిపించిన దృశ్యం చూసి వారు షాకయ్యారు. ఈ హుండీకి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
బీహార్(Bihar) రాష్ట్రం సహర్భా జిల్లాలో కోసి నది ఒడ్డున(Kosi river bank) బాబా కరూ ధామ్ దేవాలయం(Sant Baba Karu Dham) ఉంది. ఇక్కడి బాబాకు విదేశాల్లో కూడా గుర్తింపు ఉంది. భారతదేశం నలుమూలల నుండే కాకుండా నేపాల్ తదితర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఈ కారణంగా ఇక్కడ హుండీలలో కానుకలు, విరాళాలు(gifts, donations) కూడా బాగానే వేస్తుంటారు. అయితే కరూ ధామ్ బాబా దేవాలయంలో 2018, 2019 సంవత్సరాల తరువాత ఆలయ హుండీలు(temple donation boxes) తెలరవనేలేదు. 2వేల రూపాయల నోట్ల రద్దు కారణమో లేక చాలా రోజులనుండి హుండీ డబ్బు లెక్కించలేదనే కారణమో తెలియదు కానీ ఆలయంలో ఉన్న ఆరు హుండీలను లెక్కించాలని అనుకున్నారు. ఆ పనిలో భాగంగా మొదట ఒక హుండీ తెరిచిన వారికి పెద్ద షాక్ తగిలింది. హుండీలో ఉన్న కరెన్సీ నోట్లు చాలా వరకు కుళ్లిపోయి కనిపించాయి. రెండు రోజుల లెక్కింపులో ఒక హుండీలోనే సుమారు లక్షరుపాయల విలువచేసే నోట్లు కుళ్లిపోయినట్టు(1lakh value currency rotten) తెలిసింది.
Death Escape: రోడ్డు పక్కన నిల్చుని ఏవో పేపర్లు చూస్తున్నాడో వ్యక్తి.. క్షణాల వ్యవధిలోనే ఏం జరిగిందో మీరే చూడండి..!
దేవాలయంలో ఉన్న హుండీల దగ్గర నైవేద్యం పేరుతో పాలు, నీరు వేస్తుంటారని, అవి పొరపాటున హుండీలో పడటం వల్లే ఇలా జరిగిందని ఆలయ సిబ్బందితో పాటు స్థానికులు తెలిపారు. మొత్తం ఆరుహుండీల నుండి 50లక్షల నిధులు ఉంటాయని ఆలయ సిబ్బంది ఊహించారు. కానీ నోట్లు కుళ్ళిపోవడం వల్ల లెక్కలు తారుమారైపోయాయి. కాగా 2019 తరువాత హుండీలను తెరవకపోవడం ఆలయ నిర్వాహణ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. హుండీ డబ్బును ఎప్పటికప్పుడు బ్యాంకులో డిపాజిట్ చెయ్యాల్సి ఉండగా సిబ్బంది ఆ పని చేయలేదు. ఈ కారణం వల్లే అంత పెద్ద మొత్తంలో నోట్లు కుళ్ళిపోయాయని అంటున్నారు. మిగిలిన హుండీలను తెరచిన తరువాత మొత్తం ఎంత విలువైన నోట్లు కుళ్లిపోయి ఉంటాయనే విషయం తెలుస్తుంది.
Netflix: కొత్త రూల్ దెబ్బకు మారిపోయిన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రయిబర్ల లెక్కలు.. పాస్‌వర్డ్ షేర్ చేయకూడదంటూ తెచ్చిన ఒక్క షరతుతో..!
Updated Date - 2023-06-15T12:03:49+05:30 IST