Viral News: తెల్లారేసరికి ఇంట్లో కూతురు మిస్సింగ్.. పక్కింటి మహిళ తన తమ్ముడితో అదే పనిగా ఫోన్‌కాల్స్.. ఆ తండ్రికి డౌట్ వచ్చి..!
ABN, First Publish Date - 2023-09-26T12:51:35+05:30
రాత్రి సంతోషంగా అందరూ కలసి భోజనం చేశారు. కానీ తెల్లారేసరికల్లా ఆ ఇంటి కూతురు కనిపించలేదు. చివరకు తెలిసిన నిజంతో..
తండ్రులకు కొడుకులకంటే కూతుళ్లంటేనే ప్రేమ. ప్రతి తండ్రి తన కూతురిని యువరాణిలా పెంచుతాడు. ఓ తండ్రి తన కూతురిని అలాగే పెంచాడు. రాత్రి కుటుంబసభ్యులందరూ కలిసి సంతోషంగా భోజనం చేశారు. కానీ ఉదయానికంతా ఆ కూతురు అదృశ్యమైంది. తన కూతురు ఏమయ్యిందోనని పిచ్చోడిలా ఊరంతా తిరిగిన తండ్రికి కూతురు జాడ దొరకలేదు. ఇంతలోనే పక్కింటి మహిళ తన తమ్ముడితో పదే పదే మాట్లాడటం గమనించి విచారించగా షాకింగ్ నిజం బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh) రాష్ట్రం బండా నగరంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. బండా నగరంలో ఓ వ్యక్తి తన కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. అతనికి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కుమార్తె ఉంది. రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు అందరూ సంతోషంగా కలసి భోజనం చేశారు. అనంతరం ఎవరి గదులకు వారు వెళ్లి నిద్రపోయారు. తెల్లవారుజామున బాత్రుమ్ కు వెళ్లేందుకు నిద్రలేచిన తండ్రికి కూతురి గది తలుపులు తెరిచి ఉండటం కనిపించింది. కూతురు ఏం చేస్తోందోనని అతను గదిలోకి వెళ్లి చూడగా కూతురు కనిపించలేదు. ఇల్లంతా వెతికినా ఆమె ఇంట్లో లేదు. దీంతో ఊరంతా గాలించారు కానీ ఆమె కనిపించలేదు. అదే సమయంలో అతనికి పొరుగింటి మీద అనుమానం వచ్చింది. తన కూతురు ఎక్కుగా పొరుగింటికి వెళుతుండేదని గుర్తుకొచ్చి పొరుగింటికి వెళ్లాడు. పొరుగింట్లో ఉండే మహిళ తన తమ్ముడితో ఫోన్ మాట్లాడుతూ అతన్ని చూడగానే ఫోన్ పెట్టేసింది. ఇదే విధంగా పలుమార్లు జరగడంతో ఆ తండ్రి ఆ మహిళను, ఆమె భర్తను నిలదీశాడు.
High Cholesterol Signs: సైలెంట్ కిల్లర్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే.. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే చెవుల వద్ద సంకేతాలు..!
పొరుగింట్లో ఉండే మహిళకు ఒక అన్న ఉన్నాడు. అతను తరచుగా చెల్లెలి ఇంటికి వచ్చినప్పుడు అతనితో డిగ్రీ చదువుతున్న అమ్మాయికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. పొరుగింటి మహిళ, ఆమె భర్త ప్రణాళిక ప్రకారంగా ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి తమ అన్నతో ఆ అమ్మాయిని పూణేకి పంపించేశారని కూడా తెలిసింది. ఈ విషయాలు తెలిశాక ఆ అమ్మాయి తండ్రి కోపంతో రగిలిపోయాడు. పొరుగింటి వారితో తన కూతురుని వెనక్కు పిలిపించమని చెప్పినా వారు స్పందించలేదు. దీంతో వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు పొరుగింటి భార్యాభర్తల పై కేసు నమోదు చేసి ఆ అమ్మాయి కోసం వెతుకులాట ప్రారంభించారు.
Bald Head: బట్టతల వచ్చేస్తోందా..? రోజూ జుట్టు తెగ రాలిపోతోందా..? ఈ నూనెను కనుక రాసుకుంటే ఒక్క నెలలోనే..!
Updated Date - 2023-09-26T12:51:35+05:30 IST