Viral News: బ్యాంకు దోచుకోవడానికి వెళ్ళిన దొంగకు ఊహించని అనుభవం.. డబ్బు చేతిలో పడే సమయానికి ఏం జరిగిందో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-05-29T17:38:07+05:30
డబ్బంతా ఇచ్చెయ్యకపోతే తన దగ్గర ఉన్న బాంబులతో బ్యాంకును పేల్చేస్తానని దొంగ బెదిరించాడు. తప్పనిసరి పరిస్థితిలో డబ్బంతా దొంగచేతుల్లో పెట్టే సమయానికి..
అక్రమంగా డబ్బు సంపాదించే మార్గాలలో దొంగతనం కూడా ఒకటి. డబ్బు పుష్కలంగా ఉన్న బ్యాంకులకు కన్నం వేయడం కొందరు చేసేపని అయితే మరికొందరు బాహాటంగానే బ్యాంకులమీద పడి దోచుకుంటారు. ఓ దొంగ బ్యాంకు దోచుకోవడానికి వెళ్ళాడు. క్యాషియర్ దగ్గరకు వెళ్ళి డబ్బంతా ఇచ్చెయ్యకపోతే తన దగ్గర ఉన్న బాంబులతో బ్యాంకును పేల్చేస్తానని బెదిరించాడు. అతని మాటలకు బ్యాంకులో అందరూ గందరగోళంలో మునిగిపోయారు. తప్పనిసరి పరిస్థితిలో డబ్బంతా దొంగచేతుల్లో పెట్టే సమయానికి ఎవరూ ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి తెలిసిన నెటిజన్లు ' ఇలాంటి దొంగలు కూడా ఉంటారా?' అని అవాక్కవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
శంకర్ దాదా ఎంబిబియస్(Shankar dada MBBS) సినిమా చూశారా? ఆ సినిమాలో హాస్పిటల్ ఫ్లోర్ తుడుస్తున్న తాతను ఆత్మీయంగా కౌగిలించుకుని ఆ తాత బాధను పోగడతాడు మన మెగాస్టార్. నిజంగా ఇలా ఆత్మీయంగా కౌగిలించుకోవడంలో ఇంత ఊరట లభిస్తుందా అంటే అవును నిజంగా లభిస్తుంది. దానికి ఓ దొంగ విషయంలో జరిగిన ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ. అమెరికాలోని(America) కాలిఫోర్నియాలో 'బ్యాంక్ ఆఫ్ ది వెస్ట్'(Bank of the West) బ్రాంచ్ ఉంది. ఈ బ్యాంక్ కు ఓ దొంగ(Thief) కస్టమర్ లా వచ్చాడు. అతను తన ముఖానికి మాస్క్ వేసుకుని క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లాడు. డబ్బంతా తనకు అప్పగించకపోతే తన బ్యాగ్ లో ఉన్న పేలుడు పదార్థాలతో(explosives) బ్యాంక్ ను పేల్చేస్తానని(black mail to blast Bank) బెదిరించాడు. ఇతని మాటలతో బ్యాంక్ ఉద్యోగస్తుల దగ్గర నుండి కస్టమర్ల వరకు అందరూ భయాందోళనలో మునిగిపోయారు. డబ్బు ఇచ్చేస్తే అందరి ప్రాణాలు నిలబడతాయనే కారణంతో క్యాషియర్ దొంగకు డబ్బు అప్పగిస్తున్న సమయంలో ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది.
Bride: పెళ్ళైన రెండోరోజే నాభార్య నగలతో సహా పారిపోయిందని పోలిస్ స్టేషన్లో వరుడి ఫిర్యాదు.. అసలు నిజం బయటపడటంతో..
మైఖేల్ ఆర్మస్ అనే 69ఏళ్ళ వృద్దుడు(69 years old man) తన చెక్ ను డిపాజిట్ చెయ్యడానికి అదే బ్యాంకుకు వెళ్ళాడు. అతను బ్యాంకులో భయాందోళనలు సృష్టిస్తున్న దొంగను చూశాడు. దొంగ దగ్గరకు వెళ్ళి అతనితో మెల్లిగా మాటలు కలిపి కాస్త దూరం తీసుకొచ్చాడు. దొంగను ఆత్మీయంగా కౌగిలించుకుని(old man hug to thief) 'దొంగతనం ఎందుకు చేస్తున్నావు? నీకు ఉద్యోగం లేదా?'అని ఎంతో ఆప్యాయంగా అడిగాడు. ఆ వృద్దుడు అలా అడిగేసరికి ఆ దొంగ ఎమోషన్(Thief got emotional) అయిపోయాడు. అతను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ వృద్దిడితో 'నాకంటూ ఎవరూ లేరు.. ఎలాంటి ఉద్యోగం లేదు, ఎక్కడుండాలో కూడా తెలియదు. అందుకే జైలుకు వెళ్ళాలని అనుకున్నాను. దొంగతనం కోసం అందుకే వచ్చాను' అని చెప్పాడు. అతను వృద్దుడితో ఇలా మాట్లాడుతున్న సమయంలో బ్యాంకు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకుకు చేరుకుని సదరు దొంగను అరెస్ట్ చేశారు. అతని బ్యాగును పరిశీలించగా అతని బ్యాగులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు. వారు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సంఘటన తరువాత పోలీసులు వృద్దుడి సమయస్పూర్తిని మెచ్చుకున్నారు.
Viral Video: ఇతని గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్రాణాపాయంలో ఉన్న శునకాన్ని ఎలా కాపాడాడంటే..
Updated Date - 2023-05-29T17:38:07+05:30 IST