ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: అయ్యో పాపం.. జబ్బు నయమవుతుంది కదా అని మందులు వాడిన మహిళకు షాకింగ్ అనుభవం.. మరీ దారుణంగా నాలుక మీద కూడా..

ABN, First Publish Date - 2023-05-12T16:53:04+05:30

ఆమెను చూసి చాలామంది భయపడుతున్నారు. మొదటే అనారోగ్యంతో అల్లాడుతున్న ఆ మహిళ ఈ సమస్యతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జబ్బు చేసినప్పుడు మందులు వాడటం సహజం. అయితే కొన్ని సార్లు మందుల కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూంటాయి. ఓ మహిళకు ఇప్పుడు అలాంటి సమస్యే ఎదురయ్యింది. ఆమె వాడిన మందుల కారణంగా ఆమెకు నాలుక మీద నల్లని మచ్చలు ఏర్పడి, ఏకంగా వెంట్రుకలు పెరిగాయి. ఆమెను చూసి చాలామంది భయపడుతున్నారు. మొదటే అనారోగ్యంతో అల్లాడుతున్న ఆ మహిళ ఈ సమస్యతో మరింత కుంగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఇప్పటికాలంలో యాంటీబయాటిక్స్(antibiotics) వాడకం చాలా సాధారణమైపోయింది. కానీ వీటిని అధికంగా వినియోగించడం వల్ల ప్రయోజనాలు చేకూర్చకపోగా హాని కలిగిస్తాయి. జపాన్(Japan) లో ఓ 60ఏళ్ల మహిళకు దారుణమైన అనుభవం ఎదురయ్యింది. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడిన కారణంగా ఆమెకు నాలుకపై నల్లని మచ్చలతో పాటు చిన్న వెంట్రుకలు కూడా పెరిగాయి. దీన్ని బ్లాక్ హెయిరీ నాలుక(BHT) అని అంటున్నారు. 60ఏళ్ళ మహిళ రెక్టల్ క్యాన్సర్(rectal cancer) తో బాధపడుతోంది. ఈ కారణంగా ఆమెకు కీమోథెరపీ(chemotherapy) ఇస్తున్నారు. కీమోథెరపీలో మొటిమల నుండి న్యూమోనియా వరకు చాలా సమస్యలు ఎదురవుతాయి. వీటిని కంట్రోల్ లో ఉంచడానికి మినో సైక్లిన్(minocycline) అనే మెడిసిన్ వాడుతోందట. ఈ కారణంగా ఆ మహిళకు నాలుక మీద నల్లని మచ్చలు(black heads) ఏర్పడి వెంట్రుకలు(hair become on tongue) కూడా పెరిగాయి. అప్పటికే ఉన్న క్యాన్సర్ కు తోడు ఈ సమస్య కూడా ఎదురుకావడంతో ఆ మహిళ మరింత కృంగిపోయింది.

Beer-powered Motorcycle: ఒక్క బాటిల్ బీరు పడ్డాక ఈ బైక్ తో మామూలుగా ఉండదు.. దీని వేగమెంతో తెలిస్తే..


ఈ సంఘటన జరిగిన తరువాత ఆ మహిళ తనకు ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్యుని వద్దకు వెళ్ళి తన గోడు వెళ్ళబోసుకుంది. మెడిసిన్ రియాక్షన్ కారణంగానే ఇలా జరిగిందని వైద్యుడు ధృవీకరించాడు. అయితే అప్పటికే ఆ మహిళ నాలుక మీదనే కాకుండా ముఖం మీద కూడా నల్లని మచ్చలు ఏర్పడి చాలా భయంకరంగా తయారైంది. చాలామంది ఆమెను చూసి భయపడుతున్నారు. ఆమె డాక్టర్ మందులు మార్చినట్టు తెలిపారు. కొద్దిరోజులు మందులు వాడితే మహిళ పరిస్థితి మెరుగవుతుందని చెప్పారు.

Viral Video: నీళ్ళోలో మాటు వేసిన మొసలి.. ఒడ్డున నిలబడి నీళ్లు తాగుతున్న జింక.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో..


Updated Date - 2023-05-12T16:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising