ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: సైబర్ నేరగాళ్లకే చుక్కలు చూపించాడుగా.. చిన్న పని చేస్తే డబ్బే డబ్బంటూ మెసేజ్ పెడితే మనోడు ఏకంగా చాటింగ్ స్టార్ట్ చేసి..!

ABN, First Publish Date - 2023-06-08T13:14:02+05:30

ఎవరైనా ఈజీగా డబ్బు సంపాదించొచ్చని, కష్టపడకుండానే వేలు, లక్షలు వస్తాయని చెబితే చాలా తొందరగా టెంప్ట్ అయిపోతారు. ఓ కుర్రాడికి వాట్సప్ లో ఓ స్కామర్ మెసేజ్ చేస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత కాలంలో సైబర్ నేరగాళ్ళ ఆగడాలు హెచ్చుమీరిపోయాయి. ఏ చిన్న అవకాశం దొరికినా క్షణాల్లో ఎదుటివారి బ్యాంకు ఖాతాలు ఫినిష్ చేస్తారు. ఇలాంటి మోసాలకు బీజం పడేది డబ్బు ఆశ చూపడంతోనే. ఎవరైనా ఈజీగా డబ్బు సంపాదించొచ్చని, కష్టపడకుండానే వేలు, లక్షలు వస్తాయని చెబితే చాలా తొందరగా టెంప్ట్ అయిపోతారు. ఓ కుర్రాడికి వాట్సప్ లో ఓ స్కామర్ మెసేజ్ చేసి డబ్బు సంపాదన గురించి ఆశ పెట్టాడు. అయితే ఆ కుర్రాడు స్కామర్ తోనే చాటింగ్ చేసి స్కామర్ కు ఫ్యూజులు ఎగ్గొట్టాడు. ప్రస్తుతం ఈ చాటింగ్ కు చెందిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ స్క్రీన్ షాట్ చూసిన నెటిజన్లు 'ఈ కుర్రాడు మామూలోడు కాదు' అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ మొదలైన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ చాట్ బాక్స్ లలో రోజూ ఎంతోమంది మెసేజ్ లు చేస్తుంటారు. ఇంటిపట్టునే ఈజీగా డబ్బు సంపాదించచ్చని, కేవలం గంట సేపు మొబైల్ లో పర్క్ చేసి వేల రూపాయలు సంపాదించవచ్చంటూ బోలెడు మెసేజ్ లు వస్తుంటాయి.(money earning scam messages) ఇవన్నీ స్కామ్ లకు సంబంధించిన మెసేజ్ లు. వీటి వైపు ఆసక్తి చూపితే బ్యాంకు ఖాతా వివరాలు(bank account details) అడగడం లేదా వారు పంపిన లింక్స్ ఓపెన్ చేయమని చెప్పడం చేస్తారు. వారు చెప్పినట్టు చెయ్యగానే బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బు మొత్తం స్వాహా చేస్తారు. ఓ కుర్రాడికి వాట్సాప్ లో ఓ స్కామర్ నుండి మెసేజ్(scammer message to young man) వచ్చింది. 'హలో.. నేను మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని అనుకుంటున్నాను. మీ విలువైన సమయాన్ని నాకోసం వెచ్చించగలరా?' అని అవతలి వ్యక్తి ఆ కుర్రాడికి మెసేజ్ చేశారు. అది చూసిన ఆ కుర్రాడు 'నేను మీతో స్నేహం చేయాలకనుకుంటున్నాను' అని రిప్లే ఇచ్చాడు. ఆ వెంటనే ఆ స్కామర్ 'నా పేరు వియన్, నేను గ్లోబల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్(global group of companies)నుండి వచ్చాను, మీరు పార్ట్ టైమ్ లేదా పర్మినెంట్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నట్టైతే నేను చెప్పే విషయం మీకు సహాయపడుతుంది. మీరు కేవలం 5 నుండి 30నిమిషాలు పనిచేయడం ద్వారా 500 నుండి 5వేల రూపాయలు సంపాదించవచ్చు' అంటూ మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ చూసిన ఆ కుర్రాడు 'ఈ గ్రహం మీద ఒకే విధమైన ఆలోచన కలిగిన ఇద్దరు వ్యక్తులు ఎక్కడా ఉండరు' అని ఒక సాడ్ ఎమోజీ పెట్టాడు. అయితే ఆ స్కామర్ 'స్నేహితులను సంపాదించడం మంచిదే కానీ డబ్బు సంపాదించడం చాలా మంచిది' అని మెసేజ్ చేశాడు. ఇలా స్కామర్ కు కుర్రాడికి మధ్య చాటింగ్ సాగింది.

Viral News: దీనికి ఓకే చెబితేనే జాబ్ ఇస్తామంటూ ఓ కంపెనీ వింత కండీషన్.. ఇదెక్కడి విడ్డూరమంటూ విస్తుపోతున్న నెటిజన్లు..!


ఈ చాటింగ్ స్క్రీన్ షాట్ ను Mahesh అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ట్విట్టర్ లో షేర్ చేశారు.'ఓ వాట్సాప్ స్కామర్ ఈరోజు నాకు ఒక విలువైన పాఠం నేర్పాడు' అని క్యాప్షన్ మెన్షన్ చేశాడు. ఈ చాటింగ్ చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'వామ్మో ఈ కుర్రాడు మామూలోడు కాదు' అంటున్నారు. 'స్కామర్ లు చాలా తెలివిగా అందరినీ ట్రాప్ చేస్తారు' అని అంటున్నారు. 'పాపం ఆ స్కామర్ కుర్రాడిని మోసం చేయాలని వస్తే, ఆ కుర్రాడు స్కామర్ ను ఫ్రెండ్షిప్ పేరుతో ఆడేసుకున్నాడు' అని మరికొందరు కామెంట్ చేశారు.

Viral News: అయ్యా.. నా కూతురు పది పాస్ అయిందంటూ సంతోషాన్ని పంచుకుందో పనిమనిషి.. ఆ యజమాని ఏం చేశారో మీరే చూడండి..!


Updated Date - 2023-06-08T13:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising