Viral: రోజూ సైకిల్ పైనే 40 కిలోమీటర్లు తిరిగి ఫుడ్ డెలివరీ.. ఐఏఎస్ అవాలన్నదే ఈ కుర్రాడి కల..!
ABN, First Publish Date - 2023-12-06T12:04:53+05:30
ఐఏఎస్ కలను నిజం చేసుకోవడానికి ఈ కుర్రాడు పడుతున్న కష్టం ఎంతోమంది యువతకు స్పూర్తిగా మారుతోంది.
కలలు కనండి కలలను సాకారం చేసుకోండి అని అబ్దుల్ కలాం చెప్పారు. ఈయన మాటలను స్పూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నవారు ఎందరో ఉన్నారు. పేదరికాన్ని సైతం లెక్కచేయకుండా కష్టపడేవారున్నారు. అలాంటి వారిలో ఈ కుర్రాడు కూడా ఒకరు. రోజూ సైకిల్ పైన 40కి.మీ తిరుగుతూ ఫుడ్ డెలివరీ చేస్తూ తన ఐఏఎస్ కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ కుర్రాడు సైకిల్ పై ఫుడ్ డెలివరీకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ కుర్రాడిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అసలితనెవరు? ఇతని కథేంటి? తెలుసుకుంటే..
పంజాబ్(Punjab) రాష్ట్రానికి చెందిన ఓ కుర్రాడు తన కలను నెరవేర్చుకునేందుకు పడుతున్న కష్టం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంజాబ్ రాష్ట్రం పటియాలాకు చెందిన సౌరవ్ భరద్వాద్ అనే కుర్రాడు ఐటీఐ చదువుతున్నాడు. అతను ఉదయం నుండి సాయంత్రం వరకు కాలేజీకి వెళతాడు. అనంతరం సాయంత్రం 4 నుండి రాత్రి 11గంటల వరకు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్స్ ఇవ్వడానికి వెళతాడు. అది కూడా సైకిల్ పైనే రోజూ 40కి.మీ తిరుగుతాడు(food delivery on bicycle). 5కి.మీ దూరంలో ఉన్న ప్రాంతాలకు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి అతను ఆర్డర్లు తీసుకుంటాడు. వాటిని సకాలంలో కస్టమర్లకు అందిస్తాడు. ఇలా రోజంతా 40కి.మీ ప్రయాణిస్తాడు. వీడియోలో ఇతను ఫుడ్ ఆర్డర్ చేయడానికి సైకిల్ పైన వెళ్తున్నప్పుడు ఒకరు ఇతన్ని కారులోంచి పలకరించి అతని గురించి అడగుతారు. అప్పుడు తన గురించి చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: ఎండు ద్రాక్షలను అసలెందుకు తినాలో చెప్పే 10 కారణాలు..!
సౌరవ్ తండ్రి ఫోటోగ్రాఫర్. కుటుంబానికి సరైన ఆర్థిక రాబడి లేని కారణంగా సౌరవ్ స్విగ్గీలో డెలివరీ బాయ్ అవతారం ఎత్తాడు. ఒకవైపు తన కుటుంబానికి ఆర్థికంగా సహాయపడుతూనే మరోవైపు తన ఐఏఎస్ కల కోసం శ్రమిస్తున్నాడు(Punjab young man work as delivery boy for his IAS dream). ఎప్పటికైనా తన కలను నెరవేర్చుకుంటానని అంటున్నాడు. సౌరవ్ సైకిల్ పైన ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళుతున్న వీడియోను @Hatindersinghr3 అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఐటీఐ చదువుతన్న ఈ కుర్రాడు స్విగ్గీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తూ కుటుంబానికి సహయపడుతున్నాడు. ఐఏఎస్ కావడమే తన కల అని చెబుతున్నాడు' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడీయో చూసిన పలువురు ఈ కుర్రాడిని ప్రశసించకుండా ఉండలేకపోతున్నారు. ఇతని కల నెరవేరాలని ఆశీర్వదిస్తున్నారు. ఇతను చాలా మందికి స్పూర్తిగా నిలుస్తాడని అభినందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: చపాతీలు, బెల్లం.. ఈ వింత కాంబినేషన్ వల్ల లాభమేంటంటే..!
Updated Date - 2023-12-06T12:05:01+05:30 IST