ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో.. ఈ పాప వయసు కేవలం 8 ఏళ్లే.. కానీ కాలేజీ కుర్రాళ్లకు సైతం సవాల్ విసురుతోందిగా..!

ABN, First Publish Date - 2023-05-30T14:03:27+05:30

8ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు బొమ్మలతోనో, ఫ్రెండ్స్ తోనో ఆడుకుంటూ ఉంటారు. లేకపోతే మొబైల్ లో వీడియో గేమ్స్ లేదా టీవీలో కార్టూన్ ఛానల్స్ చూస్తుంటారు. కానీ ఈ పాప మాత్రం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8ఏళ్ళ వయసులో ఉన్న పిల్లలు బొమ్మలతోనో, ఫ్రెండ్స్ తోనో ఆడుకుంటూ ఉంటారు. లేకపోతే మొబైల్ లో వీడియో గేమ్స్ లేదా టీవీలో కార్టూన్ ఛానల్స్ చూస్తుంటారు. కానీ ఈ పాప మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. ఈ పాప చేస్తున్న పని చూసి కుర్రాళ్ళే కళ్ళు తేలేస్తున్నారు. ఈ పాపకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 'ఈ పాప ఇండియా ఫ్యూచర్' అని అంటున్నారు. అసలింతకీ ఈ పాప ఎవరు? కుర్రాళ్ళనే భయపెట్టేలా ఏం చేస్తోంది? పూర్తీ వివరాలు తెలుసుకుంటే..

మనం ఇంట్లో ఓ చిన్న బియ్యం బస్తా ఎత్తాలన్నా, హాల్ లో ఉన్న గ్యాస్ సిలిండర్ వంటగదిలోకి తెచ్చి పెట్టుకోవాలన్నా చాలా కష్టపడతాం. ఇవన్నీ సుమారు 30కేజీల లోపే బరువుంటాయి. అవి కూడా కుర్రాళ్ళు పెద్దలు తప్ప పిల్లలు ఎత్తడం అంటే కష్టం. కానీ 8సంవత్సరాల పాప ఇప్పుడు అందరికీ దిమ్మ తిరిగిపోయే షాకిస్తోంది. బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో వెయిట్స్ తో ఆడుకుంటోంది. హర్యానా(Haryana) రాష్ట్రం పంచకుల ప్రాంతంలో అర్షియా గోస్వామి(Arshia Goswami) అనే 8సంవత్సరాల బాలిక(8years girl) తన తల్లితండ్రులతో కలసి నివసిస్తోంది. ఈ పాప తండ్రి రోజూ జిమ్ కు వెళ్ళి వర్కౌట్స్ చేసేవాడు(Father gym workouts). తనతోపాటు అర్షియాను కూడా వెంటబెట్టుకెళ్ళేవాడు. ఈ క్రమంలో అర్షియాకు జిమ్ కసరత్తుల మీద ఆసక్తి కలిగింది. తను కూడా జిమ్ లో హడావిడి చేయడం మొదలుపెట్టింది. పాపలో ఉన్న ఆసక్తి గమనించి జిమ్ ట్రైనర్ తో పాటు పాప తండ్రి కూడా ప్రోత్సహించారు. అర్షియా ఎంతో సునాయాసంగా బరువులు ఎత్తడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో పాపను ప్రోత్సహించారు. దాని ఫలితంగా అర్షియా ఆరేళ్ళ వయసులోనే 45కేజీల(45kg weight lifting in 6years age) బరువు ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు 8ఏళ్ల వయసులో ఏకంగా 60కేజీల బరువును సునాయాసంగా ఎత్తేస్తోంది(60years weight lifting in 8years age). ఈ పాప జిమ్ లో బరువులు ఎత్తుతుండటం చూసి కుర్రాళ్ళ గుండెలు అధిరిపడుతున్నాయి.

Unwanted Hair: ముఖం మీద అవాంచిత రోమాలను తొలగించుకోవడం ఇంత సులువా? ఇలా చేశారంటే అవాంచిత రోమాలు జన్మలో మళ్లీ రావు..


ఈ పాప వెయిట్ లిఫ్ట్ చేస్తున్న వీడియోస్ ఇన్స్టాగ్రామ్(Instagram), యూట్యూబ్(You Tube) సహా చాలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పోస్ట్ చేయబడ్డాయి. అర్షియా వెయిట్ లిఫ్ట్ చేయడం చూసి నెటిజన్లు కళ్ళు తేలేస్తున్నారు. 'ఈ పాప భారతదేశ భవిష్యత్తు, దేశం గర్వించేలా చేస్తుంది' అంటున్నారు. 'ఈ పాప ఫేస్ లో కాన్ఫిడెన్స్, ఆ పాప భవిష్యత్తేంటో చెబుతోంది' అని పాపను కొనియాడుతున్నారు. పెద్దవాళ్ళు కూడా చేయలేని పని ఈ పాప చేస్తోంది. నిజంగా గ్రేట్' అని కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: ఇతని గొప్ప మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ప్రాణాపాయంలో ఉన్న శునకాన్ని ఎలా కాపాడాడంటే..


Updated Date - 2023-05-30T14:03:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising