ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వామ్మో.. పిల్ల కాదు పిడుగు.. ఎంత గట్టి పోటీ ఇస్తోందో చూస్తే షాకవుతారు..

ABN, First Publish Date - 2023-04-23T16:14:11+05:30

పిల్లలకు ఇష్టమైన పనిని ఎంకరేజ్ చేస్తే ఎలాగుంటుందంటే.. ఇదిగో ఈ పాప లాగా ఉంటుందని టక్కున చెప్పేయచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్నపిల్లలు ఏదైనా చాలా తొందరగా నేర్చేసుకునే మైండ్ సెట్ కలిగి ఉంటారు. అయితే ఏదంటే అది వారికి నేర్పించాలని చూస్తే మాత్రం తల్లిదండ్రులకు నిరాశ ఎదురవుతుంది. పిల్లలకు ఏది ఆసక్తిగా అనిపిస్తే దాన్నే వారు నేర్చుకుంటారు. పిల్లలకు ఇష్టమైన పనిని ఎంకరేజ్ చేస్తే ఎలాగుంటుందంటే.. ఇదిగో ఈ పాప లాగా ఉంటుందని టక్కున చెప్పేయచ్చు. టేబుల్ టెన్నిస్ ఆడుతున్న ఓ పాప వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ పాప ఆటను చూసి కచ్చితంగా ఫ్యూచర్ ఛాంపియన్ అవుతుందని జోస్యం చెబుతున్నారు. దీని గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

ఈ వేగవంతకాలంలో ప్రతీదీ వేగంగానే జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల చదువులు(Kids education), వారి భవిష్యత్తు గోల్స్(future goals) విషయంలో తల్లిదండ్రులు పదడుగులు ముందే ఉంటారు. అయితే పిల్లల్లో ఉన్న ట్యాలెంట్ ను గుర్తించి, అందులో ప్రోత్సహించే తల్లిదండ్రులు చాలా తక్కువ. ఈ పాపను ఆమె తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించినట్టున్నారు. నిండా ఐదేళ్ళు కూడా లేని పాప ఓ ఛాంపియన్ కుర్రాడితో టేబుల్ టెన్నిస్(table tennis) ఆడుతోంది. చిన్నపిల్లకదా ఏదో ముచ్చట పడి ఉంటుంది, అందుకే అలా ఆడుకుంటోంది అనే అనుమానం వస్తుందేమో.. కానీ ఐదేళ్ళు కూడా నిండని ఆ పిల్ల దాదాపు పాతికేళ్ళ వయసు ఆటగాళ్ళలా చెలరేగిపోయింది. ముందుకు వెనక్కు కదలడం, ఆ వేగం, ఆ బ్యాలెన్స్ ఇవన్నీ చూస్తే ఆ పాప ఎన్నేళ్ళ నుండి ప్రాక్టీస్ చేస్తోందో అనిపించకమానదు. ఆ పాపకు ఆపోజిట్ గా ఉన్న కుర్రాడేమీ తక్కువ వాడు కాదు. చాలా వేగంగా ఆ పాపకు సవాల్ విసురుతున్నాడు. కానీ ఆ పాప మాత్రం అతడి ముందు చిచ్చరపిడుగులాగే ఆడింది.

Viral Video: వావ్ దీనికి భలే ట్రైనింగ్ ఇచ్చారే.. యజమాని చెయ్యి చాపగానే ఈ ఊడత ఏం చేసిందో మీరే చూడండి!


ఈ వీడియోను Top Videos అనే ట్విట్టర్ అకౌంట్ నుండి పోస్ట్ చేశారు. ఈ పిల్ల పిడుగు ఆట చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'వామ్మో ఆ వేగం ఏంటి? ఆ ఆట ఏంటి? మైండ్ బ్లాకవుతోంది' అని ఆశ్చర్యపోతున్నారు. 'ఈ పాప ఇప్పటికే ఛాంపియన్ లా అనిపిస్తోంది, ప్యూచర్ లో లెజెండ్ అవుతుంది' అని అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Viral News: తల్లి నుంచి మెసేజ్.. ఆఫీసులో మీటింగ్‌లో ఉన్నా.. ఏమైనా అర్జెంటా..? అని ఆ కొడుకు అడిగితే తల్లి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి..


Updated Date - 2023-04-23T16:14:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising