Viral Video: జింక ఏం చేస్తుందిలే అనుకున్న నక్కకు ఊహించని షాక్.. ఎలా ముప్పుతిప్పలు పెట్టిందో మీరే చూడండి..
ABN, First Publish Date - 2023-08-06T10:34:43+05:30
ఈ జింకకు ఎంత కోపం వచ్చిందో ఏమో కానీ.. నక్కను ముప్పుతిప్పలు పెట్టి మరీ ఉరికించింది..
ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి మనుగడ కోసం పోరాడాల్సిందే. లేకపోతే మరణం ఏదో ఒక రూపంలో చుట్టుముడుతుంది. కొందరు మరణానికి లొంగిపోతారు. మరికొందరు యుద్దం చేస్తారు. ఇది మనుషుల కంటే జంతువులలో అధికం. జింకే కదా ఏం చేస్తుందిలే అనుకున్న ఓ నక్క జింక పిల్లను చంపడానికి సిద్దమైంది. అయితే ఆ తల్లి తన పవర్ ఏంటో రుచి చూపించింది. దాన్ని ముప్పుతిప్పలు పెట్టి, మూడుచెరువుల నీళ్లు తాగించి మరీ తరిమికొట్టింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జింక పోరాటాన్ని చూసి ఫిదా అవుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
అడవి జంతువుల(Wild animals) జీవితం దినదిన గండమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా జింకలు, కుందేళ్ళు, పక్షులు, ఉడుతలు లాంటి చిన్నజీవులు, సాధు జీవులు ప్రాణాల కోసం నిరంతర పోరాటం చెయ్యాల్సిందే. చాలావరకు అడవిలో సింహాలు, పులులకు జింకలే టార్గెట్ అవుతుంటాయి. ఎప్పుడూ పులో, సింహమో తినగా మిగిలిపోయింది తిని గడిపే ఓ నక్కకు(Jackal) జింక పిల్ల(Baby deer)మీద కన్ను పడింది. వీడియోలో ఓ నక్క జింక పిల్ల మీద దాడి చేసి దాన్ని చంపడానికి ప్రయత్నిస్తుండటం చూడచ్చు. అయితే దూరంనుండి ఇదంతా తల్లి జింక(mother deer) చూసింది. ఆ తల్లి జింక వెంటనే గెంతుతూ తన బిడ్డ దగ్గరకు చేరుకుంది. తన బిడ్డ మీద దాడి చేస్తున్న నక్కను అక్కడి నుండి తరిమికొట్టడానికి ప్రయత్నించింది. అయితే ఆ నక్క అంత తేలిగ్గా జింక పిల్లను వదిలిపెట్టదల్చుకోలేదు. అది పదే పదే జింక మీద దాడిచేస్తూనే ఉంది(jackal attack on baby deer). జింక తోక పట్టుకుని ఇష్టానుసారం దాన్ని తిప్పసాగింది. ఎలాగైనా ఆ జింకపిల్ల చచ్చిపోతే తల్లి జింక వదిలేసి పోతుందని ఆ నక్క అనుకుందేమో.. జింక ఎంత తరుముతున్నా అది అక్కడినుండి పోలేదు. అది వెనక్కు వెళ్ళినట్టే వెళ్ళి మళ్లీ జింకపిల్ల మీద పడుతోంది. దీంతో తల్లి జింక కోపంతో రగిలిపోయింది. ఆగకుండా గెంతుతూ నక్కను అక్కడినుండి తరిమికొట్టింది. ఆ తరువాత తన బిడ్డ దగ్గరకు వెళ్లి దానికి రక్షణ కవచంలా అక్కడే నిలబడిపోయింది.
Viral Video: ఈ పిల్లల ధైర్యానికి హ్యాట్సాప్.. ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటున్న కుక్కను ఎలా కాపాడారంటే..!
ఈ వీడియోను Massimo అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. దాదాపుగా జింకపిల్ల ప్రాణాలు పోతాయని అనుకుంటున్న క్షణంలో తల్లి జింక వచ్చి బిడ్డను కాపాడుకుంది' అంటూ క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తల్లిజింక పోరాటాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. 'పరిస్థితులు ఎలాంటివైనా సరే.. తల్లిమాత్రమే ఇలా పోరాడగలదు'అని ఒకరు కామెంట్ చేసారు. 'ఆ జింక పిల్ల క్షేమంగానే ఉందా? పాపం ఆ నక్క దాడి చూస్తే ఆ జింక పిల్ల చాలా దెబ్బతిని ఉంటుందని అనిపిస్తోంది' అని మరొకరు కామెంట్ చేసారు. 'ఇదంతా వీడియో తీస్తున్న వ్యక్తి అలా వీడియో తీయకపోతే ఆ జింక పిల్లను కాపాడటానికి వెళ్లచ్చు కదా..' అని మరికొందరు వీడియో గ్రాఫర్ మీద విరుచుకుపడుతున్నారు.
Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌లో వండిన అన్నం తింటున్నారా..? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే..!
Updated Date - 2023-08-06T10:34:43+05:30 IST