Viral Video: ఎర్రటి ఎండలో రోడ్డు పక్కన పడిపోయి ఉన్న ఒంటె.. ఏంటా అని వాహనాన్ని ఆపి వెళ్లి చూశాడో డ్రైవర్.. అసలు విషయం గ్రహించి..!
ABN, First Publish Date - 2023-06-13T16:30:40+05:30
ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులకంటే మనుషులకే గొప్ప జీవితం ఉంది. కావలసిందేంటో అడిగి తీసుకునే వెసులుబాటు నుండి సాటి జీవుల పట్ల స్పందించడం వరకు మనుషులకు ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. మనుషులకే ఉన్న గొప్ప గుణం మానవత్వం. ఓ ట్రక్ డ్రైవర్ రోడ్డుమీద వెళుతూ ఉంటే అతనికి రోడ్డు ప్రక్కన ఓ ఒంటె పడిపోయి కనిపించింది.
ఈ ప్రపంచంలో అన్ని ప్రాణులకంటే మనుషులకే గొప్ప జీవితం ఉంది. కావలసిందేంటో అడిగి తీసుకునే వెసులుబాటు నుండి సాటి జీవుల పట్ల స్పందించడం వరకు మనుషులకు ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. మనుషులకే ఉన్న గొప్ప గుణం మానవత్వం. ఓ ట్రక్ డ్రైవర్ రోడ్డుమీద వెళుతూ ఉంటే అతనికి రోడ్డు ప్రక్కన ఓ ఒంటె పడిపోయి కనిపించింది. 'హా.. ఒంటెకు ఏమవుతుందిలే.. ఎంత ఎండలో అయినా తిరగగలదు, రెండు నెలలరకు పైగా నీళ్లు తాగకుండా ఉండగలదు. దానికేంటి ఇక సమస్య' అని అతను తన దారిన తాను వెళ్ళిపోలేదు. ట్రక్ దిగి అతను దాని దగ్గరకు వెళ్లి చూసి షాకయ్యాడు. ఆ తరువాత జరిగిందేంటో చూస్తే అందరి మనసులు బరువెక్కుతాయి. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఈ ఏడాది ఎండలు(Summer waves) గడగడలాడిస్తున్నాయి. చాలా చోట్ల 50డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇక ఎడారి రాష్ట్రాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓ వ్యక్తి రహదారిలో ట్రక్కులో(man going in truck) వెళుతున్నాడు. అతనికి రోడ్డు మీద పక్కగా ఓ ఒంటె పడిపోయి కనిపించింది(camel fell by the road side). అసలే ఎర్రటి ఎండ, రోడ్డంతా నిప్పుల కుంపట్లలా మండిపోతోంది. అలాంటి ఎండలో ఒంటె రోడ్డు మీద పడిపోయి ఉండటంతో అతనికి ఏదో డౌటొచ్చింది. అతను వెంటనే ట్రక్కు దిగి గబా గబా ఒంటె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ ఒంటెను గమనించాడు. పాపం నీళ్ళు లేకుండా రెండు నెలలు అయినా జీవించగల ఒంటె ఎండల దాటికి తట్టుకోలేక తన ఒంట్లో శక్తి మొత్తం కోల్పోయి మరణం అంచున కొట్టుమిట్టాడుతోంది. దాని పరిస్థితి అర్థం చేసుకున్న ట్రక్ డ్రైవర్ వెంటనే తన దగ్గరున్న నీటి బాటిల్ మూత తీసి ఒంటె నోటికి అందించాడు(truck driver gave water to camel). దీంతో ఆ ఒంటె చాలా ఆత్రంగా నీళ్లు తాగేసింది. అది నీళ్ళు తాగుతున్న విధానం గమనిస్తే అది ఎంత దాహంతో ఉందో అర్థం అవుతుంది. బాటిల్ నీళ్ళు తాగేశాక ఒంటెలో వచ్చిన మార్పు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. అప్పటిదాకా మరణం అంచున ఉన్న ఆ ఒంటె, నీళ్లు తాగిన తరువాత చురుగ్గా కదలడం చూడచ్చు.
Apollo Doctor: హార్ట్ అటాక్ రాకుండా ఉండేందుకు 6 మెడిసిన్స్.. ఓ అపోలో డాక్టర్ రాసిన ప్రిస్కిప్షన్.. నెట్టింట యమా వైరల్..!
ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ Susanta Nanda తన ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. 'ఎండవేడిమి భరించలేక ఇక కాసేపట్లో ప్రాణాలు పోతాయనే పరిస్థితిలో ఉన్న ఒంటెకు దయగల ట్రక్ డ్రైవర్ నీరు ఇచ్చి దాని ప్రాణాలు నిలబెట్టాడు. ఎండ వేడిమికారణంగా చాలా ప్రాణులు నీటికి ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నినీళ్ళు వాటి ప్రాణాలు కాపాడతాయి. మీ ప్రయాణాలలో వాటి పట్ల దయ చూపించండి' అంటూ ఆయన చాలా భావోద్వేగమైన క్యాప్షన్ మెన్షన్ పెట్టారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ట్రక్ డ్రైవర్ ను చాలా ప్రశంసిస్తున్నారు. 'అతను జెంటిల్మెన్' అని ఒకరు కామెంట్ చేశారు. 'బోలెడు నీళ్లతో కార్లను, ఇతర వస్తువులను కడిగే ధనవంతులకు ఈ వీడియో చూపిస్తే నీటి విలువ అర్థం అవుతుంది' అని అంటున్నారు
ఓ చిన్న కాటన్ ముక్క చాలు.. పుచ్చకాయ సహజంగా పండిందో.. రసాయనాలతో పండించారో ఈజీగా తెలుసుకోవచ్చు..!
Updated Date - 2023-06-13T16:30:40+05:30 IST