ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: హర్ష సాయి లాగా ఓ నిరుపేద కుటుంబానికి కట్టలు కట్టలుగా డబ్బులను ఇచ్చాడో యూట్యూబర్.. చివరకు జరిగింది చూస్తే..!

ABN, First Publish Date - 2023-10-26T16:02:31+05:30

అచ్చం హర్షసాయిలాగే ఓ అమెరికన్ యూట్యూబర్ భారతదేశానికి వచ్చి మరీ కట్టలకొద్దీ డబ్బును ఓ నిరుపేద మహిళకు ఇచ్చాడు. ఆ తరువాత జరిగిందిదీ..

హర్షసాయి.. ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. విజయనగరానికి చెందిన ఈ కుర్రాడు యూట్యూబ్ లో ఓ పెద్ద సంచలనమే. పేదవారికి కట్టలు కట్టలు డబ్బులు సాయం చేస్తూ వారి సంతోషాన్నే తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేస్తుంటారు. ఇవి మాత్రమే కాకుండా ఇతను మరెన్నో స్టంట్ లు, వ్లోగ్స్ కూడా చేస్తుంటాడు. భారతదేశంలో ఉన్న పాపులర్ యూట్యూబర్స్ లో ఇతనూ ఒకరు. అయితే ఇతనిలాగే ఓ అమెరికన్ యూట్యూబర్ భారతదేశానికి వచ్చి కట్టలకొద్దీ డబ్బును ఓ నిరుపేద మహిళకు ఇచ్చాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ అమెరికన్ యూట్యూబర్ ఎవరు? అతను ఎందుకంత డబ్బిచ్చాడు? అతను డబ్బు ఇచ్చిన తరువాత ఆ మహిళ రియాక్షన్ ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

ఇతరులకు సహాయం చేయాలంటే చాలా గొప్ప మనసుండాలి. పదిరూపాయలు ఇతరులకు ఇవ్వాలంటే చాలా భాధపడిపోయే మనుషులన్న కాలంలో కొందరు వేలు, లక్షల రూపాయలను ఎలాంటి సంకోచం లేకుండా ఇచ్చేస్తుంటారు. ఇబ్బందులు పడుతున్న వారి గురించి తెలుసుకుని వారికి సహాయం చేయడంలో యూట్యూబర్ హర్షసాయికి(Youtuber Harsha sai) ఉన్న పేరు అందరికీ తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు ఓ అమెరికన్ యూట్యూబర్(American Youtuber) భారతదేశంలో మెరిశాడు. IsShowSpeed పేరుతో ఓ అమెరికన్ వ్యక్తి యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నాడు. అతను భారతదేశ పర్యటనకు వచ్చాడట. వీడియోలో భారతదేశంలోని రహదారుల్లో రాత్రి సమయంలో ప్రయాణం చేస్తూ ఒక్కసారిగా కారును ఆపి కారు నుండి దిగాడు. తన కారుకు కొద్ది దూరంలో నిలబడుకున్న ఓ పేద మహిళ దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఉన్న కరెన్సీ నోట్ల కట్టను ఆమె చేతికి ఇచ్చాడు(American Youtuber gave money to a poor women). ఆ డబ్బు ఆమె అవసరాల కోసం ఇచ్చినట్టు చెబుతాడు. అతనలా అంత డబ్బు ఇవ్వడంతో ఆ మహిళ తీవ్ర భావోద్వేగానికి లోనవుతుంది. కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకుని కన్నీళ్ళ పర్యంతం అవుతుంది.

Health Tips: వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు.. అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..!



యూట్యూబర్ తనకు ఇచ్చిన డబ్బును చూస్తూ ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తన గురించి తాను చెప్పుకుంది. ఆమెను తన భర్త వదిలేయగా తను ఒంటరిదాన్ని అయిపోయానని, తనకు ఓ కొడుకున్నాడని ఆ బాబును పోషించుకోవడానికి తాను కష్టపడుతున్నానని ఆమె చెప్పింది. ఈ మాటలు విన్న తరువాత యూట్యూబర్ ఆ మహిళకు మానసిక ధైర్యం కూడా చెబుతాడు. ఈ వీడియోను sarcasticschool అనే ఇన్ట్సాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ అమెరికన్ యూట్యూబర్ ను మెచ్చుకుంటున్నారు. అతని మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: కారుకు ఎదురెళ్లి మరీ.. సైకిల్‌పై ఓ వ్యక్తి రిస్కీ స్టంట్స్.. నడిరోడ్డుపై పిచ్చి వేషాలేస్తే ఇలాగే జరుగుతుందిగా..!


Updated Date - 2023-10-26T16:02:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising