ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral vide: 'ఇతనే మా గెస్ట్ గా ఉండాలి'..పరిచయం చేసిన ఆనంద్ మహీంద్రా.. ఇంతకూ ఇతనెవరంటే..

ABN, First Publish Date - 2023-02-12T18:22:07+05:30

'మా రిథమ్ ఫెస్టివల్ కు ఇతనే గెస్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను' అని ఆనంద్ మహీంద్రా పరిచయం చేసిన వ్యక్తిని చూస్తే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆనంద్ మహీంద్రా.. సోషల్ మీడియాకు పెద్దగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేని పేరు ఇది. భారతదేశ నలుమూలల ఎక్కడ ట్యాలెంట్ కనిపించినా తన ట్విట్టర్ వాల్ మీద షేర్ చేసి అందరికీ పరిచయం చేస్తుంటారీయన. తాజాగా ఆనంద్ మహీంద్రా ఒక వ్యక్తిని పరిచయం చేసి 'మా రిథమ్ ఫెస్టివల్ కు ఇతనే గెస్ట్ గా ఉండాలని నేను కోరుకుంటున్నాను' అని ఒక వీడియో షేర్ చేశాడు. ఇంతకూ ఆనంద్ మహీంద్రాను అంతగా ఇంప్రెస్ చేసిన ఆ వ్యక్తి ఎవరు తెలుసుకుంటే..

సాధారణంగా బయట తినడానికి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ నుండి అన్నిరకాల హోటల్స్, రెస్టారెంట్స్ లోనూ బిజినెస్ మీద దృష్టి పెట్టి సర్వీస్ లు జాగ్రత్తగా అమలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం తాము చేస్తున్న పనిని ఎంజాయ్ చేస్తారు. అలాంటి వారిలో ఆనంద్ మహీంద్రా పరిచయం చేసిన వ్యక్తి ఉన్నాడు. అతను ఎక్కడివాడో తెలియదు. హోటల్ లో ఫుడ్ తయారు చేసి అమ్ముతూ అందులో భాగంగా తనకు ఇష్టమైన మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఫుడ్ తయారుచేసేటప్పుడు తన దగ్గరున్న గిన్నెలు, గరిట మొదలైన వాటితోనే మ్యూజిక్ క్రియేట్ చేసిన ఈ వ్యక్తిలో ట్యాలెంట్ చాలా ఉందని అర్థమైపోతుంది.

Read also: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 5 విడాకుల కేసులు.. ఒక్కొక్కరు ఎన్ని లక్షల కోట్లను భరణంగా ఇచ్చారంటే..

'ఈ జెంటిల్మెన్ ఎక్కడ పనిచేస్తాడో తెలీదు కానీ త్వరలో బెంగుళూరులో జరగబోయే మహీంద్రా రిథమ్ ఫెస్టివల్ కి ఇతను గెస్ట్ గా ఉండాలని కోరుకుంటున్నాను, తనకు నచ్చిన సంగీతంతో తన పనిని ఆస్వాదిస్తున్న ఇతను తృప్తిగా జీవించడంలో సజీవ సాక్ష్యంగా కనిపిస్తున్నాడు' అని చెప్పాడు. ఎంతైనా ట్యాలెంట్ ను గుర్తించి సోషల్ మీడియాకు పరిచయం చేయడంలో ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందుంటాడు అంటున్నారు నెటిజన్లు.

Updated Date - 2023-02-12T18:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising