ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఎలా వస్తాయమ్మా.. ఇలాంటి ఐడియాలు.. ఈ మహిళ టీ ని ఎలా తయారు చేసిందో చూస్తే..!

ABN, First Publish Date - 2023-10-04T11:30:38+05:30

టీ అనేది ఒక ఎమోషన్.. టైం తో సంబంధం లేకుండా ఎప్పుడంటే అప్పుడు టీ తాగేవారున్నారు. కానీ ఈమె చేసన టీ చూస్తేనే వాంతి వస్తోంది..

టీ అనేది కేవలం ఒక పానీయం కాదు అదొక ఎమోషన్. విదేశాల నుండి భారతదేశానికి వచ్చినా టీని భారతీయులు అక్కున చేర్చుకున్నారు. ఎంతగా అంటే టీ అంటే పడి చస్తారు. టీ ఉడుకుతున్న వాసన వస్తే చాలు ఏదో ఒక సాకుతో అక్కడికి చేరుకుని ఒక కప్పు చాయ్ తాగనిది మనసు ఊరుకోదు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా వంటి నగరాల పేర్లతో టీలు ప్రసిద్దికెక్కాయి అంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ కొన్ని సార్లు ఇంత మంచి అనుభూతిని పాడుచేస్తారు కొందరు. అలాంటి కోవకు చెందినదే ఈ మహిళ కూడా. ఈమె తయారుచేసిన టీ చూస్తే వాంతి రావడం ఖాయం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'మీ సొంత పూచీకత్తు మీద ఈ వీడియో చూడండి' అని నెటిజన్లు అంటున్నారు. అసలు అందరూ అంత అసహ్యించుకోవడానికి ఆమె ఏం చేసిందో చూస్తే..

టీ(tea) అనేది చాలామందికి ఎమోషన్. టైం పాడు లేకుండా అర్థరాత్రులు కూడా టీ తాగడానికి వెళ్ళేవారు చాలామంది ఉంటారు. టీ పౌడర్ నుండి టీ తయారీ వరకు ఎన్నో వెరైటీలు ఉన్నాయి. అల్లం, యాలకులు, లవంగం, మసాలా, తందూరీ ఇలా చాలా రకాల టీలు తయారుచేస్తారు. కానీ ఓ బెంగాలీ మహిళ(Bengali women) మాత్రం జీవితంలో ఎవ్వరూ చూడని, అసలు ఊహించని టీని తయారుచేసింది. సుల్తానాస్ కుక్(sultana's cook) అనే వీడియోలో ఓ మహిళ ఒక గిన్నెలో టీ పొడి, పాలు వేసి టీ ఉడికించడం చూడచ్చు. ఆ మహిళ సడన్ గా ఆ టీ లోకి ఒక చేప ముక్కను వేస్తుంది. ఆ చేప ముక్క టీతో పాటు బాగా ఉడికిన తరువాత దాన్ని టీలో నుండి తీసేసి గ్లాసులోకి వడగడుతుంది. ఆ తరువాత ఒక ఐస్ క్రీం పుల్లకు అంతకుముందే టీలో ఉడికిన చేప ముక్కను గుచ్చి దాన్ని టీ గ్లాసులో ఉంచింది. దీన్ని ఫిష్ టీగా(Fish tea) పేర్కొంది. సాధారంగా జ్యూస్ గ్లాసుకు పై భాగాన ఫ్రూట్స్ తో డెకరేషన్ చేసినట్టు ఈమె చేప ముక్కతో చేసింది.

Health Facts: ఛూయింగ్ గమ్‌ను పొరపాటున మింగితే.. కడుపులో అది కరిగిపోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలిస్తే..!



ఈ వీడియోను P R I C E T R A C E R అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ లో షేర్ చేశారు. 'టీ లవర్స్ ఎక్కడున్నారు? ఇక్కడ మీకోసం ఏదో ఉంది' అనే క్యాప్షన్ ను మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. దీని గురించి పలువిధాలుగా కామెంట్ చేస్తున్నారు. 'బాబోయ్ అది తాగడానికే చేశారా?' అని ఒకరు కామెంట్ చేశారు. 'అసలు ఇలాంటివి ఎందుకు చేస్తారు తల్లీ, చూస్తుంటేనే వాంతి వస్తోంది' అని మరొకరు అన్నారు. 'టీ కు ఉన్న గొప్పదనం అంతా ఈ మహిళ పాడు చేస్తోంది, ఈ వీడియో చూశాక టీ అంటే విరక్తి వస్తోంది' అని ఇంకొకరు కామెంట్ చేశారు. సోషల్ మీడియా ఈ మహిళ మీద దుమ్మెత్తిపోస్తోంది.

Viral Video: బాబోయ్.. ఇదేం పిచ్చి పని..? ప్రియుడి చేతిని కొరికిన ప్రేయసి.. గాట్లు పడిన తర్వాత అతడేం చేశాడో చూస్తే..!


Updated Date - 2023-10-04T11:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising