ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఇనుప కంచెలో ఇరుక్కుపోయిన జింకను కాపాడాడొక వ్యక్తి.. ఆ తరువాత జింక ఏం చేసిందో చూస్తే షాకవుతారు..

ABN, First Publish Date - 2023-03-26T11:09:38+05:30

ఎవరూ ఊహించని విధంగా ఈ జింక చేసిన పని చూస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం. మన చుట్టూ ఉండే కుక్కలు, పిల్లుల గురించి అయితే మనకు కాస్త అవగాహన ఉంటుంది. కానీ అడవి జంతువుల(wild Animals) గురించి మనకు తెలియదు. అందుకే వాటి ప్రవర్తన చూసి మనం ఆశ్చర్యపోతుంటాం. ఇప్పుడు కూడా అలాంటి ఆశ్చర్యపరిచే సంఘటన నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఇనుప కంచెలో ఇరుక్కుపోయిన జింకను కాపాడాడు. ఆ తరువాత జింక సహాయం చేసిన వ్యక్తి ఇంటికి వెళ్ళింది. కేవలం అదొక్కటే కాదు.. తన మందను మొత్తం వెంట బెట్టుకెళ్ళింది. ఎవరూ ఊహించని విధంగా చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే..

పొందిన సహాయాన్ని మనుషులకంటే జంతువులే చాలా బాగా గుర్తుంచుకుంటాయి. అంతేకాదు కృతజ్ఞత తెలపడంలో కూడా అవి ఎలాంటి భేజషాలకు పోవు. ఓ జింక తనకు సహాయం చేసిన వ్యక్తికి కృతజ్ఞత తెలిపిన విధానం అందరి హృదయాలను హత్తుకుంటోంది. అడవి జంతువులకు అడవుల్లో ఆహారం సరిగ్గా దొరకక జనావాస ప్రాంతాలకు దగ్గరగా వెళుతుంటాయి. ఓ జింక(Deer) అలాగే జనావాస ప్రాంతాలకు వెళ్ళింది. అడవికి జనావాస ప్రాంతాలకు మధ్య ఇనుప తీగతో కంచె(Iron fence) వేశారు. జింక మొదట ఆ కంచెను దాటి వెళ్ళింది. కానీ తిరిగి అడవిలోకి వెళ్ళేటప్పుడు ఆ తీగ దగ్గర ఇరుక్కుపోయింది. దీంతో దాని వెనుక కాళ్ళు రెండూ అలాగే గాల్లో ఉండిపోయాయి. ఆ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో దానికి సహాయం చేసేవారు కూడా కనిపించలేదు. పాపం ఆ జింక గంటలకొద్ది అలాగే నిస్సహాయంగా ఉండిపోయింది.

Read also: Viral Video: రెండు భారీ ఏనుగులు యుద్దానికి దిగితే ఇదిగో ఇలాగే ఉంటుంది.. సినిమాల్లో కూడా ఇలా చూపించి ఉండరు..


చాలాసేపటి తరువాత ఒక వ్యక్తి తన కొడుకుతో అటుగా వెళుతూ జింక పరిస్థితి చూశాడు. అతనికి జింకపై జాలివేసి దానికి సహాయం చేశాడు. దాన్ని క్షేమంగా కంచె దాటించాడు. అంతసేపు ముందరికాళ్ళమీద నిలబడిన జింక కంచె దాటగానే బ్రతికిపోయానురా దేవుడా అని నేలమీద చతికిలబడింది. జింకకు సహాయం చేసిన వ్యక్తి కొడుకు జింక పరిస్థితి చూశాడు. జాలివేసి కంచెలోపలికి చెయ్యి పెట్టి దాన్ని ఓదారుస్తున్నట్టే నిమిరాడు. తరువాత వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటిరోజు ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. తనను కాపాడిన వ్యక్తికి కృతజ్ఞత చెప్పడానికి సదరు జింక అతని ఇంటికి చేరుకుంది. కేవలం ఆ జింక మాత్రమే కాదు, తన మందను కూడా అతని ఇంటికి వెంటబెట్టుకెళ్ళింది. ముందురోజు జింకను కాపాడే సమయంలో వీడియో తీశారు. ఆ తరువాత జింక తన మందతో అతని ఇంటికి చేరుకున్నప్పుడు కూడా వీడియో తీశారు. రెండింటిని కలిపి ఓ వీడియోగా ఎడిట్ చేసి ట్విట్టర్ లో షేర్ చేశారు. Belgesel Zamani అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేశాడు. ఇదెక్కడ జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు జింక ప్రవర్తనకు ఫిధా అవుతున్నారు. ఇంత కృతజ్ఞత ప్రస్తుత కాలంలో మనుషుల్లో కూడా ఉండదని అంటున్నారు.

Read also: Skin Health: రోజూ ఇవి కొద్దిగా తింటే చాలు.. ముసలివాళ్ళు కూడా యవ్వనంగా మారతారు..


Updated Date - 2023-03-26T11:09:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising