Viral Video: బాగా ఆకలిగా ఉన్న చిరుత వేట ఎలా ఉంటుందో తెలుసా? ఈ వీడియో చూస్తే గుండెలు అదురుతాయి..
ABN, First Publish Date - 2023-07-16T11:21:53+05:30
బాగా ఆకలిగా ఉన్న చిరుత సీరియస్ గా ఫిక్స్ అయితే దాని కంట్లో పడే ఏ జంతువూ తప్పించుకోలేదు. ఈ వీడియో దానికి బలం చేకూరుస్తోంది..
జంతువులు ఎన్ని ఉన్నా కదలిక, వేగం, తెలివి అధికంగా కలిగిన జంతువు చిరుతపులి. ఈ చిరుత పులుల శరీర నిర్మాణం వీటికి పెద్ద బలం. బాగా ఆకలిగా ఉన్న చిరుత సీరియస్ గా ఫిక్స్ అయితే దాని కంట్లో పడే ఏ జంతువూ తప్పించుకోలేదు. ఈ కారణంగా వేటంటే చిరుతపులిదే.. అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ మాటకు బలం చేకూరుస్తోంది ఒక వీడియో. నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఈ చిరుత వేట వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..
అడవి జంతువుల(Wild animals) జీవితం వేటతో(hunting) ముడిపడి ఉంటుంది. అడవికి ఎంత మృగరాజు అయినా సింహానికి కూడా లేనంత వేగం, కదలిక చిరుత పులికి ఉంటుంది. వీడియోలో ఓ చిరుత(Leopard) వేటాడటం చూడచ్చు. బాగా ఆకలిగా ఉన్న చిరుతకు(hungry Leopard hunting) ఓ కోతి(monkey) కనిపించింది. ఇంకేముంది దాన్ని వేటాడటానికి సన్నద్దమైంది. అయితే కోతి ప్రాణభయంతో చెట్టెక్కింది. ఆ కోతిని ఎలాగైనా వేటాడాలనే పట్టుదలతో చిరుత కూడా చెట్టెక్కింది. చిరుతనుండి తప్పించుకోవాలనే ప్రయత్నంలో కోతి చెట్టుకొమ్మ నుండి పక్కనున్న చెట్టు మీదకు గెంతింది. అయితే చిరుత తెలివిగా ఆలోచించింది.అది పక్కనున్న చెట్టుమీదకు గెంతకుండా తనున్న చెట్టు దిగి పక్కనున్న చెట్టెక్కింది. చెట్టుదిగి పారిపోదామనుకున్న కోతి కిందనుండి చిరుత తరుముకుంటూ రావడం చూసి ఇరకాటంలో పడింది. ఇక చేసేది లేక అక్కడినుండి మళ్ళీ వెనక్కు తిరిగి పక్కనున్న చెట్టుమీదకు గెంతింది. అయితే ఈసారి చిరుత తన విశ్వరూపం చూపించింది. కోతి ఎలాగైతే పక్కనున్న చెట్టుమీదకు గెంతిందో,అదే విధంగా చిరుతకూడా పక్కనున్న చెట్టుమీదకు గెంతి కొమ్మచివర ఉన్న కోతిని పట్టుకుంది. ఆ తరువాత కోతిని పట్టుకునే పైనుండి కిందకు జారిపడింది. ఇలా చిరుత చెట్లమీద కూడా అలవోకగా, నైపుణ్యంతో వేట సాగిస్తాయి. చిరుత వేట, దాని తెలివి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వీడియోను ఐఎప్ఎస్ ఆఫీసర్(IFS Officer) Susanta Nanda తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. 'చిరుతలను బహుముఖ వేటగాళ్లు అని అంటారు ఇందుకే' అని ఈ వీడియోకు క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'దేవుడా.. ఇదేదో సినిమా షూటింగ్ లో భాగంగా స్టంట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది' అని ఒకరు కామెంట్ చేశారు. 'చిరుత పులులు చాలా బరువును పట్టుకుని సుమారు 50అడుగుల చెట్టును అయనా సునాయాసంగా ఎక్కగలవు, చెట్లు ఎక్కడంలో ఇలాంటి బలం వేరే జంతువుకు ఉండదు'అని మరొకరు కామెంట్ చేశారు. 'అది చాలా ఆకలితో ఉన్నట్టుంది, అందుకే అంత కసితో వేటాడింది. ఆకలిగా ఉన్న చిరుత కంటపడితే ఇక అంతే..'అని ఇంకొకరు అన్నారు.
Updated Date - 2023-07-16T11:24:21+05:30 IST