ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పట్టు పురుగుల నుంచి అసలు దారాన్ని ఎలా తీస్తారన్న డౌట్ ఎప్పుడైనా వచ్చిందా..? ఈ వీడియో చూస్తే ఫుల్లు క్లారిటీ ఖాయం..!

ABN, First Publish Date - 2023-04-14T21:28:28+05:30

అసలు పురుగుల నుండి అంత దారం ఎలా వస్తుంది? పట్టు పురుగుల(Silk worms) నుండి ఈ దారాన్ని ఎలా వేరుచేస్తారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భారతీయ మహిళలకు అత్యంత ఇష్టమైన దుస్తులు ఏవైనా ఉన్నాయంటే అవి పట్టుచీరలే(Silk sarees).. ఉప్పాడ, ధర్మవరం, కంచి, వెంకటగిరి, గద్వాల్, మైసూరు, బనారస్ ఇలా చెబితే పెద్ద లిస్టే ఉంది. పట్టుచీరలు సాంప్రదాయంగానూ.. మరెంతో అందంగానూ ఉంటాయి. చాలా వరకు శుభకార్యాలలో పట్టుదుస్తులు ధరించడానికే ఇష్టపడతారు. అయితే పట్టు దారాన్ని(Silk thread) ఎలా తయారు చేస్తారు? పట్టు పురుగుల(Silk worms) నుండి ఈ దారాన్ని ఎలా వేరుచేస్తారు అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? అసలు పురుగుల నుండి అంత దారం ఎలా వస్తుందని అనుకునేవారికి ఈ వీడియో ఫుల్లు క్లారిటీ ఇస్తుంది. పట్టుదారం తయారీ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి పూర్తీగా తెలుసుకుంటే..

పట్టుచీరలకు పుట్టిల్లు భారతదేశం. ఇప్పుడు ఈ పట్టు దుస్తులను విదేశీయులు కూడా ధరించడానికి ఇష్టపడుతున్నారు. కేవలం రెండు నుండి మూడురోజులు మాత్రమే బ్రతికే ఈ పురుగులు ఇంతగొప్ప దుస్తుల తయారీకి పట్టుదారాన్ని ఇస్తున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. నేరుగా షాపులకు వెళ్ళి పట్టు వస్త్రాలు కొనుగోలు చేసేవారికి వాటివెనుక ఎంత తతంగం ఉందో తెలీదు. పట్టుపురులను(Silk worms) పెద్ద వృత్తాకార జల్లెడలో మల్బరీ ఆకుల(Mulberry leaves) మధ్య ఉంచుతారు. తరువాత వీటిని పెద్ద వెదురు చట్రాలలో వేసి సూర్యరశ్మి తగిలేలాగా నిలువుగా పెడతారు. ఎండకు పట్టుపురుగులు సహజంగా తమచుట్టూ గూడు కట్టుకుంటాయి. ఇందుకోసం కోకన్(cocoon) అనే పదార్దాన్ని విడుదల చేస్తాయి. ఈ పట్టు గూళ్ళు పెంచిన వారు వెదురు చట్రాలనుండి పట్టుగూళ్ళు(silk nest) సేకరించి అన్నింటినీ ఎండలో పెడతారు. ఎండకు ఎండి పట్టుగూళ్లు గట్టిపడతాయి. ఆ తరువాత వీటిని వేడి నీళ్ళలో(Hot water) వేస్తారు. వేడినీళ్ళలో వేయగానే పురుగులు చచ్చిపోతాయి. మెత్తబడిన దారాన్ని చిన్న కర్ర సహాయంతో వేరుచేస్తూ ఆ తరువాత దారాన్ని సేకరిస్తారు. ఈ దారాన్ని ఒక చట్రానికి చుడతారు. ఇలా పట్టుదారం తయారవుతుంది.

Cadbury Bournvita ఆరోగ్యానికి మంచిదేనా..? తయారు చేసేందుకు వాడేదేంటి..?.. అసలు నిజాలివేనంటూ వైరల్‌గా మారిన ఓ వ్యక్తి వీడియో..


పట్టుదారం తయారు చేస్తున్న వీడియోను foodywoody67 అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో(Instagram page) షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'పట్టుదారం తయారు వెనుక ఇంత తతంగం ఉందా?' అని కళ్లు తేలేస్తున్నారు. మరికొందరు మాత్రం 'ఒకజీవిని ఇంత దారుణంగా చంపడం చాలా దుర్మార్గం, దయచేసి వాటిని చంపకండి' అని అంటున్నారు. 'ఇందుకేనా పట్టు అంత ధర ఉంటుంది' అని వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. మరికొందరు మాత్రం 'ఆ పట్టుపురుగులు కేవలం 2-3రోజులు మాత్రమే బ్రతుకుతాయి. ఆ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి' అని అంటున్నారు.

Viral Video: బుడ్డోడు కాదండోయ్.. బాల భీముడు.. 12 ఏళ్ల వయసుకే సిక్స్ ప్యాక్ బాడీ.. ఏకంగా 91 కేజీల బరువు ఈజీగా ఎత్తేస్తాడు..!


Updated Date - 2023-04-14T21:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising