Viral Video: ఓ చిన్న బాతు.. పులితోనే ఓ ఆటాడుకుందిగా.. చంపి తినేందుకు వస్తే.. పులికే చుక్కలు చూపించిన బాతు..!
ABN, First Publish Date - 2023-03-09T10:12:28+05:30
బాతే కదా.. పిల్ల బచ్చాది, నా పంజాతో ఒక్కటిచ్చానంటే దాని ఖేల్ ఖతం అనుకుందొక పులి. కానీ
'వేట అంటే వీటిదే.. అసలు తిరుగులేదు' అని పులుల గురించి చెప్పుకుంటాం. బాతే కదా.. పిల్ల బచ్చాది, నా పంజాతో ఒక్కటిచ్చానంటే దాని ఖేల్ ఖతం అనుకుందొక పులి. కానీ బాతు మాత్రం పులి కూడా నాముందు పిల్లితో సమానమే అని లైట్ తీసుకుంది. తనను చంపడానికి వచ్చిన పులికి చుక్కలు చూపించింది. 'బాడీలో ఏముంది బాస్.. అంతా బుర్రలోనే కదా ఉండేది' అని బాతు పులికి చెప్పినట్టు, అనుభవపూర్వకంగా చూపినట్టు ఉంది ఈ వీడియో చూస్తుంటే. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి వివరాల్లోకి వెళితే..
మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య ఎత్తుకు పై ఎత్తులు వేయడం, తెలివి ప్రయోగించి తమను తాము కాపాడుకోవడం కనిపిస్తుంటుంది. ప్రస్తుతం అలాంటిదే నెట్టింట్ల వైరల్ అవుతోంది. ఆస్ట్రేలియా(Austrila) దేశం సిడ్నీ(sydney)లో సింబియో వైల్డ్ లైఫ్ పార్క్(Symbio Wildlife Park) ఉంది. ఈ పార్కులో ఓ నీటి కొలనులో(Water Pool) పులి(Tiger) విశ్రాంతి తీసుకుంటోంది. అప్పుడే బాతు(Duck) ఆ కొలనులోకి వచ్చి అటూ ఇటూ ఈదుతుంది. బాతును చూసిన పులికి కొలను మధ్యలో చిన్న స్నాక్ లాగా ఈ బాతు భలేగుంటుందనే ఫీలింగ్ వచ్చినట్టుంది. వెంటనే లేచి నీటిలో దికి ఆ బాతును కసక్కున పట్టేసి చప్పరించేయాడానికి బయల్దేరింది.
పులిరాజు తనమీదకు రావడం చూసి బాతుకు మొదట భయం వేసినా తరువాత బల్బ్ వెలిగింది. 'నన్ను పట్టుకోవడం నీచేత కాదు పులిమామా.. కాసుకో చూద్దాం' అని నీళ్ళలో దాగుడుమూతలాట మొదలెట్టింది. పులి బాతుకోసం ముందుకు వెళ్ళగానే.. ఆ బాతు బుడుంగున నీటిలో మునిగి పులి వెనక్కు చేరుకుంటుంది. పులి పలుమార్లు ఆ బాతును ఎలాగైనా పట్టేయాలనే మొండితనంలో ప్రయత్నాలు చేసింది. చివరికి నేను ఓడిపోయాను వెళ్ళిపోతున్నా.. అనే ఫీలింగ్ తో అక్కడినుండి వెళ్ళిపోయింది. ఈ వీడియోను The Compilation Master అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేశారు. పులి, బాతుల మధ్య జరిగిన ఈ దాగుడుమూతల ఫైట్ ను నెటిజన్లు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కండ బలం కంటే బుద్దిబలం గొప్పదని మన పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారుగా అంటున్నారు.
Updated Date - 2023-03-09T10:23:11+05:30 IST