ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చిన్న పిల్లాడిని గుండెలపై పడుకోబెట్టుకుని స్కూటీపై ఇలా పడుకున్నాడో తండ్రి.. మరుక్షణంలోనే ఊహించని సీన్..!

ABN, First Publish Date - 2023-04-24T16:41:25+05:30

ఓ వ్యక్తి తన కొడుకును ఆడిస్తూ ఏకంగా స్కూటీ పైనే పడుకున్నాడు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలను ఆడించడం ప్రతి ఒక్కరికీ సరదా.. ముఖ్యంగా తమ పిల్లలను ఎత్తుకుని తండ్రులు చాలా మురిసిపోతూ ఉంటారు. ఓ వ్యక్తి తన కొడుకును ఆడిస్తూ ఏకంగా స్కూటీ పైనే పడుకున్నాడు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. 'బాబూ.. అది స్కూటీ అనుకున్నావా లేక పరుపు అనుకున్నావా అలా పడుకున్నావ్!' అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

తల్లిదండ్రులు పిల్లలను(kids) ఆడిస్తూ తమని తాము మరిచిపోతుంటారు. తండ్రులు పిల్లలను భుజాల మీద ఎత్తుకుని తిప్పడం, ఆడించడం, బయటకు తీసుకెళ్ళడం ఇలా చాలా చేస్తారు. ఓ వ్యక్తి తన కొడుకును ఇంటి బయటకు(out side) తీసుకొచ్చాడు. బయట పార్క్ చేసిన స్కూటీ(scooty) మీద కూర్చుని తన కొడుకును ఆడిస్తున్నాడు. అతను పిల్లాడిని మరింత నవ్వించాలనే ఉద్దేశంతో స్కూటీ సీటు మీద పడుకుని (sleeping on scooty seat)పిల్లాడిని పైకి కిందకు ఆడించాడు. ఆ తరువాత అతను స్కూటీ మీద నుండి లేవబోతుండగా అతని కాలుకు స్కూటీ హ్యాండిల్(scooty handle) అడ్డు తగిలింది. అతను కాలును పక్కకు తీసుకున్నాడు కానీ ఆ కుదుపుకు స్కూటీ ఒక్కసారిగా పడిపోయింది(scooty fall down). అది పడటంతోనే దాని మీద కూర్చున్న అతను కూడా కింద పడిపోయాడు. అయితే అతని చేతిలో ఉన్న పిల్లాడు ఎక్కడ కింద పడతాడో.. ఆ బాబుకు ఏ ప్రమాదమవుతుందోనని అతను బాబును చాలా గట్టిగా పట్టుకున్నాడు(hold tight). అతను కింద పడి పల్టీ కొట్టినా బాబును మాత్రం వదల్లేదు. ఈ కారణంగా బాబు ఏ ప్రమాదం జరగకుండా బయటపడ్డాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Viral video: పాపం ఉక్కపోత భరించలేక ఈ పాండా ఏం చేస్తోందో చూడండి..


annu22_sa_ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్(Instagram account) నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. 'నువ్వేం తండ్రివి? అది స్కూటీ అనుకున్నావా లేక పరుపు అనుకున్నావా?' అని విమర్శిస్తున్నారు. 'పిల్లాడిని ఎత్తుకున్నప్పుడు అంత అజాగ్రత్త ఏంటి?' అని మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం 'అతను రిస్క్ చేసి మరీ పిల్లాడిని కాపాడుకున్నాడు' అని అంటున్నారు. 'తండ్రి ప్రమాదంలో ఉన్నా పిల్లాడిని మాత్రం వదిలిపెట్టడు' అని అతన్ని మెచ్చుకుంటున్నారు.

Updated Date - 2023-04-24T16:41:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising