ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ వికలాంగుడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. జొమాటోలో డెలివరీ బాయ్‌గా కొత్త జర్నీ స్టార్ట్.. ట్రై సైకిల్‌పై వెళ్తూనే..

ABN, First Publish Date - 2023-04-26T21:42:16+05:30

నడవడమే ఇబ్బందిగా ఉండి వీల్ చైర్ లో తిరిగే ఇతను ఏకంగా జొమాటోలో డెలివరీ బాయ్(Zomato delivery boy) అవతారమెత్తాడు. నిమిషాల నుండి గంటలోపు డెలివరీ ఇవ్వాల్సిన ఈ జొమాటో ఉద్యోగాన్ని ట్రై సైకిల్ మీద ఎలా చేస్తున్నాడో తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాలామందికి జీవితంలో మేము ఓడిపోయాం అని చెప్పడానికి చాలా కారణాలు కనిపిస్తాయి. కానీ గెలవాలనే ప్రయత్నం చేయడానికి కారణాలు అక్కర్లేదు.. సాధించాలనే తపన, మనకేం తక్కువ అనే ఆత్మవిశ్వాసం చాలు. ఇతనిలోనూ ఆత్మవిశ్వాసం, జీవితంలో ఓడిపోకూడదనే తపన మెండుగా ఉన్నాయి. అందుకే తన శారీరక లోపాన్ని అధిగమించి తన ప్రయాణాన్ని కొత్తగా మొదలుపెట్టాడు. నడవడమే ఇబ్బందిగా ఉండి వీల్ చైర్ లో తిరిగే ఇతను ఏకంగా జొమాటోలో డెలివరీ బాయ్(Zomato delivery boy) అవతారమెత్తాడు. నిమిషాల నుండి గంటలోపు డెలివరీ ఇవ్వాల్సిన ఈ జొమాటో ఉద్యోగాన్ని ట్రై సైకిల్ మీద ఎలా చేస్తున్నాడో తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

వికలాంగులు(disable people) అనే పదంలోనే వారు పడే సమస్యలు అన్నీ కళ్లముందు మెదులుతాయి. చేతులు సరిగాలేక పనులు సరిగా చేసుకోలేక ఇబ్బంది పడేవారు కొందరైతే.. కాళ్లు సరిగాలేక నడవడానికే ఇబ్బంది పడేవారు మరికొందరు. ఇలాంటి వాళ్లు చాలా వరకు కుటుంబ సభ్యుల మీద, ఇతరుల మీదా ఆధారపడుతుంటారు. కానీ కాళ్లు లేని ఓ వికలాంగ వ్యక్తి మాత్రం తనకు ఈ సమస్య ఏదీ అడ్డంకి కాదని ఆత్మవిశ్వాసంతో కొత్త జీవితాన్ని, కొత్త ఉద్యోగంతో ప్రారంభించాడు. పట్టణాల్లోనూ.. నగరాల్లోనూ.. రహదారుల్లో చూస్తే బైక్ ల మీద డెలివరీ బాయ్(delivery boys) లు ఎంతో వేగంగా వెళుతూ కనబడతారు. ఇలాంటి ఉద్యోగం వికలాంగులకు సాధ్యమా అనే డౌట్ వస్తుంది. కానీ సాధ్యమే అని నిరూపించాడు ఇతను. జొమాటో డెలివరీ బాయ్ గా ఓ వికలాంగ వ్యక్తి ఉద్యోగం(disable zomato delivery boy) చేస్తున్నాడు. వీడియోలో ఒకే ఒక చక్రంతో స్కూటీ(single wheel scooty) ముందు భాగంలా ఉన్న ఓ వాహనం దగ్గరకు వీల్ చైర్(wheel chair) లో వచ్చాడు ఓ వికలాంగుడు. అతను దాని దగ్గరగా వెళ్లి తన వీల్ చైర్ కు ఆ వెహికల్ పార్ట్ ను అటాచ్ చెయ్యగా అది ట్రై మోటార్ వెహికల్(tri motorcycle) గా మారిపోయింది. ఆ మోటార్ వెహికల్ స్టార్ట్ చేసి అతను సునాయాసంగా అందరిలానే ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి సాగిపోయాడు.

Viral Video: నిజమైన వైద్యుడివి అంటే నువ్వేనయ్యా.. ఓ శునకం ఆహారం తినడం మానేసిందని ఈ డాక్టర్ ఏం చేశాడో మీరే చూడండి..!


logkyakahengay అనే ఇన్స్ట్రాగ్రామ్ పేజీలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఈ డెలివరీ బాయ్ ఆత్మవిశ్వాసానికి ఫిదా అవుతున్నారు. 'నీ సంకల్పం చాలా గట్టిది బ్రదర్.. నీకు హ్యాట్సాప్' అని కామెంట్స్ చేస్తున్నారు. 'అన్ని అవయవాలు బాగుండీ జీవితంలో ఓడిపోతున్నాం అని అనుకునేవారు ఇతన్ని చూసి చాలా నేర్చుకోవాలి' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Viral News: అద్దాలను మాత్రం వదిలేశాడా డాక్టర్.. కారు మొత్తాన్ని ఆవు పేడను పూసేశాడు.. ఎందుకీ పని అని ఆ డాక్టర్‌ను అడిగితే..


Updated Date - 2023-04-26T21:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising