Viral Video: నది పుట్టడం ఎప్పుడైనా చూశారా? కళ్ళ ముందే ఎంతబాగా నది ఏర్పడిందో చూడండి..
ABN, First Publish Date - 2023-07-05T14:08:10+05:30
ప్రకృతి నుండి మనిషి పుట్టాడు. మనిషిలోనూ ప్రకృతి ఉంటుంది. కానీ ఆ ప్రకృతిని అర్థం చేసుకోవడం మనిషికి కాస్త క్లిష్టతరమైన విషయం.
ప్రకృతి నుండి మనిషి పుట్టాడు. మనిషిలోనూ ప్రకృతి ఉంటుంది. కానీ ఆ ప్రకృతిని అర్థం చేసుకోవడం మనిషికి కాస్త క్లిష్టతరమైన విషయం. ప్రకృతిలో చోటుచేసుకునే వింతలను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇప్పుడూ అలా ఆశ్చర్యం కలిగించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నది పుట్టుకకు సంబంధించి ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ వీడియో గురించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
పంచభూతాలతో(panchabutas) ప్రకృతి(Nature) ఏర్పడుతుంది. ఈ పంచభూతాలలో నీరు(Water) ఒకటి. ఇది చాలా విచిత్రమైనది, సముద్రాల నుండి ఆకాశానికి ఎగసి, అటునుండి వర్షంలా కురిసి, అడవులలో(Foresrt) కాలువలు, నదులుగా రూపుకట్టుకుంటాయి. అవి పొంగి ప్రవహించి తిరిగి మళ్ళీ సముద్రంలోకే కలుస్తుంది నీరు. అయితే వర్షంలా కురిసిన నీరు నదిగా ఏర్పడటం ఎప్పుడైనా చూశారా?(Birth of river) వీడియోలో అడవి ప్రాంతంలో ఉన్న విశాల ప్రాంతంలో మెల్లగా నీళ్లు ఓ చిన్న పాయగా ప్రవహిస్తూ రావడం చూడచ్చు. ఆ చిన్న పాయ కాస్తా విస్తరించుకుంటూ అది వెడల్పైన నదిగా రూపాంతరం చెందుతుంది. నదులు చాలావరకు కొండచరియలు, అడవులలోనే పుడతాయి(rivers burn in forests). ఇప్పుడీ నది అలాగే అడవిలో పురుడు పోసుకుంది. ఫారెస్ట్ అధికారులు ఉదయం 6గంటల సమయంలో అడవిలో పెట్రోలింగ్(forest petroling) కు వెళ్ళినప్పుడు నది ఏర్పడుతున్న దృశ్యం చూశారు. అటవీ అధికారులు ఈ నది ఏర్పడటానికి అనువుగా ఆ ప్రాంతం మొత్తం క్లియర్ చేశారు. నీరు మెల్లగా ప్రవహిస్తూ వస్తుంటే ఫారెస్ట్ అధికారులు నది ఏర్పడుతున్న విధానాన్ని పర్యవేక్షించడం కూడా వీడియోలో చూడచ్చు. ప్రస్తుతం ఇది నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.
Viral: ఒకటి కొంటే మరొకటి ఫ్రీగా వచ్చిందిగా.. మార్కెట్ నుంచి కూరగాయలను తెచ్చిన కవర్‌ను ఓపెన్ చేసి చూస్తే..!
ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్(IFS officer) పర్వీన్ కస్వాన్ Parveen Kaswan, IFS తన ట్విట్టర్ ఖాతా నుండి షేర్ చేశారు. 'నదులు ఇలాగే ఏర్పడతాయి. అడవులు నదులకు తల్లులు, ఉదయం 6గంటల ప్రాంతంలో కాలిబాటన పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కనిపించిన దృశ్యమిది' అని క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు నదుల పుట్టుక చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రకృతి ప్రియులు అయితే మైమరిపోతున్నారు. 'నది కొత్తగా పుట్టలేదు, ఎండిపోయిన నది కొత్త ఊపిరి పోసుకుంది' అని నదుల గురించి అవగాహన ఉన్న కొందరు కామెంట్ చేశారు. 'ఒకవైపు అడవులను నరికేస్తూ కాంక్రీటు బిల్డింగులు కడుతుంటే మరొకవైపు అడవులు నదులకు జన్మనిస్తున్నాయి. ప్రకృతి తన పని తాను చేసుకుపోతుందని ఇందుకే అంటారు' అని మరికొందరు భావోద్వోగమైన కామెంట్స్ చేశారు. 'ఈ వీడియో చాలా అధ్బుతంగా ఉంది' అని అంటున్నారు.
Ice Cream: ఐస్ క్రీమ్ గురించి విస్తుపోయే నిజాలు .. ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే..
Updated Date - 2023-07-05T15:58:09+05:30 IST