ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ ట్రాఫిక్ పోలీసుది ఎంతమంచి మనసు.. ఇతను చేసిన పనికి నెట్టింట ప్రశంస వర్షం కురుస్తోంది

ABN, First Publish Date - 2023-03-19T12:32:31+05:30

ఇక ప్రాణాలు పోతాయేమోనని అంతా అనుకుంటున్న సమయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పోలీసులు నిత్యం శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి రెక్కలు కట్టుకుని వాలిపోతారు. పోలీసులు కఠినమైన వాళ్ళు అని అందరూ అంటారు. కానీ పోలీసులలో కూడా మంచి మనసుంటుంది. అది సందర్భానుసారం బయటపడుతూ ఉంటుంది. ఇప్పుడూ అలాగే ఓ ట్రాఫిక్ పోలీసులో ఉన్న మంచి మనసు బయటపడింది. ఇక ప్రాణాలు పోతాయేమోనని అంతా అనుకుంటున్న సమయంలో ట్రాఫిక్ పోలీసు చేసిన సాహసం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ సంఘటన గురించి పూర్తీగా తెలుసుకుంటే..

రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జైపూర్(Jaipur) లో ఒక రహదారి రద్దీగా ఉంది. ఆ రహదారికి పైన పదులకొద్దీ కరెంట్ తీగలు ఉన్నాయి. పక్కనే ట్రాఫిక్ సిగ్నల్ స్తంభం(Traffic signal pillar) ఉంది. ఓ పావురం(Pigeon) అటుగా ఎగురుతూ వెళుతోంది. దాని కాలికి ముందే గాలిపటం మంజా(Kite manja) చిక్కుకుని ఉండటంతో ట్రాఫిక్ స్తంభం దగ్గరకు రాగానే అది ఆ స్తంబానికి చుట్టుకుంది. పాపం పావురం ఆ స్తంభానికి ఇరుక్కుపోయింది. విడిపించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసినా పావురానికి సాధ్యం కాలేదు. దీంతో పావురం తలకిందులుగా వేలాడుతూ కొట్టుమిట్టాడసాగింది. చాలా మంది అటుగా వెళ్లేవారు ఆ పావురాన్ని చూసి పాపం అని వెళ్ళిపోయేవారే తప్ప దాన్ని కాపాడాలనే ప్రయత్నం చెయ్యలేదు. అదే సమయంలో ట్రాఫిక్ పోలీస్(Traffic police) అక్కడికి వచ్చాడు. పావురం ఇరుక్కుపోయి కొట్టుమిట్టాడుతుండటం చూశాడు. దాన్ని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో చుట్టూ పరికించి చూశాడు. ఓ ఆర్మీ కోచింగ్ సెంటర్ బస్(Army coaching center bus) అటుగా వెళ్తూ కనిపించింది. వెంటనే బస్సును ఆపి ఆ బస్సు మీదకు ఎక్కి పావురాన్ని ట్రాఫిక్ సిగ్నల్ స్తంబం నుండి వేరుచేశాడు. ట్రాఫిక్ పోలీస్ చేతుల్లోనుండి పావురాన్ని తీసుకున్న స్థానికుడు ఆ పావురానికి ఉన్న గాలిపటం మంజాను తొలగించే ప్రయత్నం చేశాడు. ట్రాపిక్ పోలీస్ కూడా బస్సు దిగిపచ్చి పావురం కాళ్ళలో ఇరుక్కుపోయిన మంజాను తొలగించడంలో సహాయం చేశాడు.

ఈ సంఘటన మొత్తాన్ని వీడియో తీశారు. పావురాన్ని కాపాడిన తరువాత ఆ ట్రాఫిక్ పోలీస్ పావురాన్ని బైక్ మీద దూరంగా తీసుకెళ్ళి దాన్ని వదిలేశాడు. పావురం ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ పావురాన్ని కాపాడిన వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహూ(IAS Officer Supriya Sahu) తన ట్విట్టర అకౌంట్ Supriya Sahu IAS నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన పలువురు పోలీసాఫీసర్ ను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి మంచి పోలీసులు ఉండబట్టే ప్రజలు, మూగజీవులు కాస్తయినా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. గాలిపటాల మంజా కారణంగా ఎన్నో పక్షులు ప్రాణాలు కోల్పోతున్నాయని వాటిని వాడటం రద్దు చెయ్యాలని కొందరు అంటున్నారు.

Updated Date - 2023-03-19T12:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising