Viral Video: వామ్మో ఈ కేరళ కుర్రాడి తెలివి మామూలుగా లేదుగా.. మారుతీ కారును ఎలా మార్చేశాడో చూస్తే..
ABN, First Publish Date - 2023-10-08T11:10:09+05:30
ఈ కుర్రాడు తనదగ్గరున్న మారుతీ800 కారును ఎలా మార్చేశాడో చూస్తే నోళ్లు వెళ్లబెడతారు.
కార్లంటే చాలా మందికి మోజు. సగటు మధ్యతరగతి వ్యక్తి కూడా బాగా సంపాదించి ఇల్లు, కారు కొనాలని కలలు కంటాడు. అయితే ఖరీదైన కార్లు కొనడం కోటీశ్వరులకే తప్ప సగటు మనిషికి సాధ్యం కాదు. కొందరు నిరుత్సాహంతో తమ కోరికను చంపేసుకుంటారు. మరికొంతరు తామే కొత్త ఆవిష్కరణ చేస్తారు. ఈ కుర్రాడు రెండవ కోవకు చెందినవాడు. తనదగ్గరున్న మారుతీ800 కారును అతనెలా మార్చేశాడో చూస్తే నోళ్లు వెళ్లబెడతారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
లగ్జరీ కార్లలో రోల్స్-రాయిస్(rolls royce) కారుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ దీన్ని కేవలం ప్రసిద్దుల కోసం, ప్రపంచంలో ఉన్న సంపన్నుల కోసం మాత్రమే తయారుచేస్తారు. కేరళకు(Kerala) చెందిన హదీప్ అనే కుర్రాడు కోట్లు పెట్టి రోల్స్-రాయిస్ కారు కొనలేకపోయినా తనే ఆ కారును తయారుచేశాడు. అతని దగ్గరున్న మారుతి800(Maruti 800) కారును అచ్చం రోల్స్ రాయిస్ కారులా మార్చేశాడు(Maruti800 turn to rolls royce). మారుతి కారుకు పూర్తీగా కొత్త బాడీని డిజైన్ చేయడంతో పాటు కారు లోపలి భాగాలను కూడా మార్పులు చేశాడు. కారు ముందు భాగం తొలగించి రోల్స్ రాయిస్ లాంటి గ్రిల్, హెడ్ లైట్స్ సెట్ చేశాడు. ఈ కారుకు న్యూ లుక్ ఇవ్వడానికి స్టీల్ షీట్ తో దీన్ని కవర్ చేశారు. కారులోపల BMW స్పోర్ట్స్ కార్ సీట్లను(BMW sports car seats) అమర్చాడు. మారుతి కారు టైర్లు, డోర్లు, వీల్ కవర్ లు మాత్రం అవే ఉంచాడు. పైకప్పు కూడా సేమ్ అదే ఉంది. కారు ఎత్తు కూడా పెంచాడు. లోపల కిటికిలు అరెంజ్ చేశాడు. మొత్తానికి ఇది చూడగానే వావ్ అనిపించేలా ఉంది. కేవలం రూ. 45వేలతో ఈ మార్పులు చేసినట్టు చెప్పడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
Mobile Charging: జెట్ స్పీడ్‌లో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ అవాలా..? ఈ 4 టిప్స్‌ను తూచా తప్పకుండా పాటిస్తే సరి..!
హదీప్ కు చిన్నప్పటినుండి యంత్రాలన్నా, కార్లన్నా చాలా ఆసక్తి ఉండేదట. ఆ ఆసక్తితోనే అతను కార్లకు సంబంధించి వివిధ ఆవిష్కరణలు చేస్తుంటాడు. మోటార్ సైకిల్ ఇంజిన్ సహాయంతో జీప్ ను తయారుచేయడం కూడా ఇలాంటి వింత ఆవిష్కరణే. ఇతను తన ప్రయోగాలను అన్నింటిని 'ట్రిక్స్ ట్యూబ్ బై ఫాజిల్ బషీర్'(Tricks Tube by Fazil Basheer) అనే తన యూట్యూబ్ ఛాలెన్(You Tube channel) లో అప్లోడ్ చేస్తుంటాడు. ఈ రోల్స్ రాయిస్ కారు ఆవిష్కరణను యూట్యూబ్ లో అప్లోడ్ చేయగా నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'నువ్వు తొందరలోనే నిజమైన రోల్స్-రాయిస్ కొంటావు బ్రదర్' అని ఒకరు కామెంట్ చేశారు. 'నువ్వు సూపర్ బ్రదర్, అద్భుతంగా చేశావ్' అని మరొకరు కామెంట్ చేశారు. చాలామంది ఇతన్ని మెచ్చుకుంటున్నారు.
Viral News: ఎవరీ రాంబాబు..? ఒకప్పుడు రోజు కూలీగా పనిచేసిన ఈ కుర్రాడే.. నేడు దేశం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు..!
Updated Date - 2023-10-08T11:10:09+05:30 IST