ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ బుడ్డోడి తెలివి మాములుగా లేదుగా.. ఈ పిల్లాడు చేపలు పట్టే టెక్నిక్ చూస్తే అవాక్కవుతారు..

ABN, First Publish Date - 2023-04-30T15:09:02+05:30

ఈ పిల్లకాయ టెక్నిన్ చూస్తే 'అయ్యో.. ఇన్నాళ్లు మాకు ఇలాంటి టెక్నిక్ ఒకటుందని ఎందుకు తెలీలేదు' అని బాధపడతారు కూడా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అసలే వేసవి కాలం.. నీళ్ళ ఎద్దడి ప్రాంతాలకు ఈతకు వెళ్ళి పనిలో పనిగా నాలుగు చేపలు పట్టుకుని ఇంటికి తీసుకెళ్లేవాళ్లు అధికం. కొందరు చాలా ఈజీగా చేపలు పట్టేస్తారు, మరికొందరు చేపలు పట్టడానికి కిందామీదా అయిపోతారు. కానీ వేలెడంత లేని ఈ బుడ్డోడు మాత్రం ఈజీగా చేపలు పట్టేస్తున్నాడు. ఈ పిల్లకాయ టెక్నిన్ చూస్తే 'అయ్యో.. ఇన్నాళ్లు మాకు ఇలాంటి టెక్నిక్ ఒకటుందని ఎందుకు తెలీలేదు' అని బాధపడతారు కూడా. ఈ బుడ్డోడు చేపలు పడుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీ తెలుసుకంటే..

చేపలు పట్టడానికి(fishing) ఎంతో ఓపిక ఉండాలి. ఓపిక కంటే ఎక్కువ తెలివి కూడా ఉండాలి. ఎందుకంటే..చేపలు పట్టడంలో నేర్పు చాలా ముఖ్యం. అన్ని చేసినా అవి దొరకాలంటే అదృష్టం ఉండాలి. కానీ ఓ బుడ్డోడు మాత్రం 'ఓస్.. చేపలు పట్టడం ఇంత ఈజీనా' అనేలా చేస్తున్నాడు. వీడియోలో ఓ పిల్లాడు రెండు చిన్న చెక్క దుంగలను(wood logs) గిలక బావి పై భాగంలో ఉన్నట్టుగా దూరంగా సెట్ చేశాడు. గిలక బావికి తాడు వేసే ప్రాంతంలో మాంజాను(manja) సెట్ చేశాడు. ఈ పరికరాన్ని భుజం మీద మోసుకుని నీటి ప్రాంతానికి వెళ్లాడు. ఆ పరికరాన్ని ఒడ్డు దగ్గర ఇసుకలో గుచ్చాడు. అది బాగా బలంగా నిలబడటానికి తన వెంట సంచిలో తెచ్చుకున్న సుత్తి తీసుకుని చెక్క దుంగలమీద గట్టిగా దెబ్బలు వేశాడు. దీంతో ఆ దుంగలు రెండూ మట్టిలో లోతుగా, బలంగా పాతుకుపోయాయి. ఆ తరువాత తన వెంట గిన్నెలో తెచ్చుకున్న పిండిని ముద్దలుగా చేసి చేపలు పట్టడానికి ఉపయోగించే దారాల కొనను ఆ పిండి ముద్దల మధ్యలో ఉంచి, ఆ మాంజాను నీటిలో దూరంగా విసిరాడు. ఆ తరువాత పిల్లాడు ఒడ్డున అలా కూర్చుండిపోయాడు. పిల్లాడు వేసిన ఎరకు చేపలు పడగానే మాంజా ఒక్కసారిగా తిరుగుతుంది. అది చూడగానే పిల్లాడు వేగంగా పరిగెత్తి ఆ మాంజాను ఆపి.. దాన్ని బయటికి లాగుతాడు. పూర్తీగా బయటకు లాగగానే పెద్ద చేపలు రెండు కనబడతాయి. ఈ బుడ్డోడికి కనీసం ఆ చేపల్ని మోసేంత బలం కూడా లేదు కానీ వాటిని పట్టే తెలివి మాత్రం చాలా ఉన్నట్టు అర్థమవుతుంది.

Success Story: నిత్యం వేధించే పోలీస్ భర్తకు గుడ్ బై.. నువ్వేం చేయలేవ్ అన్న భర్త మాటలతో పంతం.. ఇప్పుడు ఈమె ఏం చేస్తోందో తెలిస్తే..


ఈ వీడియోను The Best అనే ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. Determination + Ingenuity + Patience = Success అనే క్యాప్షన్ ను జతచేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు బుడ్డోడి ట్యాలెంట్ కు ఫిదా అయిపోయారు. 'ఈ ప్రపంచంలో చాలా వరకు ట్యాటెంట్ మరుగున పడిపోయి ఉంది' అని అంటున్నారు. 'ఈ పిల్లాడు ప్రపంచంలో సమస్యలతో సంబంధం లేకుండా తన పనిలో తాను మునిగిపోయాడు' అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: మీ CV పంపండి అంటూ ఓ కాలేజీ కుర్రాడికి గూగుల్ నుండి సందేశం..అతను చేసిన ఒకే ఒక్క పనితో అదిరిపోయే ఉద్యోగం.. ఇంతకూ అతనేం చేశాడంటే..


Updated Date - 2023-04-30T15:09:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising