ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఈ బుడ్డొడికి ఎంత ధైర్యం..బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో ఏం చేస్తున్నాడో చూస్తే షాకవుతారు..

ABN, First Publish Date - 2023-03-02T10:44:11+05:30

పిల్లలు ఆడుకోవడానికి బోలెడు ఆట వస్తువులు ఉన్నాయి. కానీ ఇవన్నీ కాదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చిన్నప్పుడు మనం బొమ్మలతో ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు ట్రెండ్ కాస్త మారి బొమ్మలతో పాటు స్మార్ట్ ఫోన్స్ కూడా పిల్లల చేతుల్లో బొమ్మల్లాగే మారిపోతున్నాయి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి బోలెడు ఆట వస్తువులు ఉన్నాయి. కానీ ఇవన్నీ కాదని ఓ పిల్లాడు భారీ కొండచిలువతో ఆడుతున్నాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

పాములంటే(Snakes) భయపడనివారు ఉండరు. మనం కొన్ని అసంకల్పిత ప్రతీకారచర్యలు ఎలా కలిగి ఉన్నామో అలాగే పామును నేరుగా అయినా, ఫోటోస్(Photos) లో, వీడియోస్(Videos) లో చూసినా భయపడతాము. కాస్త పెద్ద సైజు పాములు మన కళ్ళముందు నుండి అలా జరజరా వెళ్ళినపుడు అవి మనల్ని ఏమీ చెయ్యకపోయినా మన వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. తిరిగి మామూలు మనుషులవ్వడానికి చాలా సమయమే పడుతుంది. కానీ నిండా రెండేళ్ళు కూడా నిండని పిల్లాడు భారీ కొండచిలువ(Heavy Python)తో ఉన్న వీడియో ఇప్పుడు నెటిజన్స్ ను షాక్ లోకి నెట్టేస్తోంది. పిల్లలు పెంపుడు జంతువులైన పిల్లులు(Pet Cats), కుక్కల(Pet Dogs)తో ఎలా ఆడుకుంటారో అలాగే ఈ బుడ్డోడు భారీ కొండచిలువతో ఆడుతున్నాడు. అది భయంకరమైనదని, తనను ఏమైనా చేస్తుందనే ధ్యాస పిల్లాడికి లేదు. పిల్లాడి తల్లిదండ్రులు కూడా కొండచిలువ గురించి ఏమాత్రం కంగారు లేని వాళ్ళలా పిల్లాడిని స్వేచ్చగా దాని ముందు వదిలేశారు.

Read also: Viral Video: ఈ డాక్టర్ నిజంగా దేవుడే.. చిన్నపిల్లాడి ఆనందం చూస్తే మీరు అదే చెబుతారు..


జర్నలిస్ట్(JOurnalist) LP పంత్(LP Pant) అనే వ్యక్తి @pantlp అనే యూజర్ నేమ్ తో ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాకవుతున్నారు.'బొమ్మపాము చూస్తేనే భయపడతాం అలాంటిది అంతపెద్ద కొండ చిలువతో ఆడుకోవడం ఏంటి?' అని ముక్కున వేలేసుకుంటున్నారు. కొందరైతే 'ఆ కొండచిలువ ఎంత మచ్చికైతే మాత్రం తల్లిదండ్రులు పిల్లాడిని అలా వదిలెయ్యడం చాలా ప్రమాదమం' అని అన్నారు. మరికొందరు 'ఇది చాలా భయంకరమైన చర్య' అని కామెంట్ చేశారు. మరొకరు 'ఈ పిల్లాడు చాలా ధైర్యవంతుడు' అని చెప్పుకొచ్చారు. ఇంకొకరు 'ఆ కొండచిలువ ఏం తప్పు చేసింది? పిల్లలకు అన్ని జీవులను గౌరవించడం నేర్పించండి, ఆ కొండచిలువ గురించి రాద్దాంతం చేయడం ఆపండి' అని కొండచిలువ గురించి భయం వ్యక్తం చేస్తున్న అందరికీ కౌంటర్ ఇచ్చారు.

Updated Date - 2023-03-02T10:44:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!