Viral Video: చలికే వణుకు పుట్టిచ్చేట్టు ఉన్నాడుగా.. వేడి నీళ్లకోసం ఇతను చేసిన పని చూస్తే నోరెళ్ళబెడతారు!
ABN, Publish Date - Dec 20 , 2023 | 11:27 AM
వేసవికాలంలో ఉక్కపోత భరించలేక ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇప్పుడు చలికాలం వంతు వచ్చింది. వేడినీటికోసం ఇతను చేసిన పని చూస్తే..
సీజన్ మారిన ప్రతి సారి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. చాలామంది ఈ వాతావరణాలను బీట్ చేయడానికి కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. వేసవిలో వేలాది రూపాయలు పెట్టి ఏసీలు కొనుగోలు చేయలేక చాలామంది సాధారణ పౌరులు తమలోని ట్యాలెంట్ ను బయటకు తీసిన విషయం తెలిసిందే. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో కూలర్లు తయారుచేసి నెటిజన్లతో భళా అనిపించుకున్నారు. ఇప్పుడు చలికాలం వంతు వచ్చింది. చలిని తరమడానికి ఇప్పుడు ప్రయోగాలు మొదలయ్యాయి. ఓ వ్యక్తి చలిని భరించలేక వేడినీటికోసం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
సోషల్ మీడియాలో ఎన్నోరకాల వీడియోలు వైరల్(Viral videos) అవుతుంటాయి. వీటిలో కామన్ మ్యాన్ ట్యాలెంట్ కు సంబంధించిన వీడియోలు చాలా ఆసక్తిగా ఉంటాయి. నెటిజన్ల నుండి స్పందన కూడా వీటికే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చలికాలం సాగుతోంది. చలి దారుణంగా ఉంటోంది. దీనికారణంగా ఇంట్లో కుళాయి ఆన్ చేయగానే మంచుగడ్డలా చల్లగా ఉన్న నీళ్లు వస్తుంటాయి. స్నానం చేయడం నుండి ఇంటి పనులు చేసుకోవడం వరకు చల్లనీళ్లతో తంటాలే. దీనికి చెక్ పెట్టడానికి ఓ వ్యక్తి వింత ప్రయోగం చేశాడు. మేడమీద ఉన్న ట్యాంకుకు హీటర్ ను సెట్ చేశాడు. వీడియోలో ఓ వ్యక్తి అపోలో వాటర్ ట్యాంక్ దగ్గర పని చేస్తుండటం చూడచ్చు. అతను వాటర్ ట్యాంక్ కు సైడ్ నుండి పెద్ద రంధ్రం చేస్తాడు. అనంతరం నీరు వేడి చేయడానికి ఉపయోగించే హీటర్(heater) ను ఆ ట్యాంక్ కు చేసిన రంధ్రం లోపల ఉంచుతాడు. ట్యాంక్ లో వాటర్ లీక్ అవకుండా రబ్బరు ముక్కలు, నట్ ల సహాయంతో దాన్ని బిగుతుగా బిగించాడు. దీంతో భారీ గీజర్(giant geyser) తయారైపోయింది. హీటర్ రాడ్ కు కరెంట్ సప్లై ఇస్తే ట్యాంకులో నీళ్ళు వేడి అవుతాయని అంటున్నారు.
ఇది కూడా చదవండి: తల్లిదండ్రులు చిన్నతనం నుండే పిల్లలలో పెంచాల్సిన 8 అలవాట్లు ఇవీ..!
ఈ వీడియోనుj_a_n_u_rajbhar అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. 'ఆ భారీ గీజర్ యమలోకానికి కాల్ కనెక్ట్ చేస్తుంది' అని ఒకరు కామెంట్ చేశారు.'భారీ గీజర్ కు తగ్గట్టే కరెంట్ బిల్ కూడా భారీగా వస్తుంది' అని ఇంకొకరు అన్నారు. 'ఈ ఐడియా చాలా బాగుంది' అంటూ మరికొందరు ఈ భాగీ గీజర్ ను మెచ్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: చలికాలంలో ముల్లంగి తింటే 9 లాభాలు!
మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Dec 20 , 2023 | 11:27 AM