Viral Video: మీకు కేక్ అంటే చాలా ఇష్టమా?.. అయితే ఒక సారి ఈ వీడియో చూడండి..
ABN, First Publish Date - 2023-07-24T19:56:17+05:30
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక బయట దొరికే మనకు ఇష్టమైన అనేక ఆహార పదార్థాలను ఎలా తయారు చేస్తారనే అంశంపై అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలను చూశాక తయారీదారుల కష్టాన్ని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కానీ ఎక్కువ వీడియోలు మాత్రం నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక బయట దొరికే మనకు ఇష్టమైన అనేక ఆహార పదార్థాలను ఎలా తయారు చేస్తారనే అంశంపై అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలను చూశాక తయారీదారుల కష్టాన్ని నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. కానీ ఎక్కువ వీడియోలు మాత్రం నెటిజన్ల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నాయి. కొంతమందైతే ఆ వీడియోలు చూసి సదరు ఆహార పదార్థాలను తినడం కూడా మానేస్తున్నారు. ముఖ్యంగా ఆయా పదార్థాల తయారీలో శుభ్రత పాటించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇటీవల కాలంలో వైరల్ అయిన పానీ పూరీ, చాక్లెట్, ఐస్ క్రీంల తయారీ వీడియోలు ఈ కోవలకే వస్తాయి. సోషల్ మీడియాలో సదరు వీడియోలను చూసిన నెటిజన్లు శుభ్రత పాటించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తపరిచారు. అయితే తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
పుట్టిన రోజైనా, పెళ్లి రోజైనా, నిశ్చితార్ధమైనా వేడుక ఏదైనా సరే కేక్ కట్ చేయడం ఈ మధ్య కాలంలో ఆనవాయితీగా మారిపోయింది. ఇక కేక్‌ను ఇష్టంగా తినే వారి సంఖ్య చాలానే ఉంటుంది. కూల్ కేక్ అని, చాక్టెట్ కేక్ అని, ఆరెంజ్ కేక్ అని రకరకాల ఫ్లెవర్లు సైతం బేకరీల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక చిన్నపిల్లలకు కేక్ అంటే ఎంతో ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మనమంతా అంతగా ఇష్టపడే కేక్‌లను ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఊహించారా? దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిమిషం పాటు ఉన్న ఆ వీడియోలో కేక్ తయారీ విధానం పూర్తిగా ఉంది. ఆ వీడియో చూసిన వారిలో కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.
వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. ఒక వ్యక్తి అనేక గుడ్లను పగలగొట్టి ఒక బకెట్‌లో వేశాడు. పగలగొట్టిన గుడ్లను మిషన్‌లో వేశాడు. దానికి నీళ్లు, పిండి కలిపాడు. ఆ తర్వాత ఆ మూడు కలిసిపోయే విధంగా మిషన్‌ను తిప్పాడు. కొంత సమయం తర్వాత పిండి, నీళ్లు, గుడ్లు కలిసి పోయి పిండి పదార్థంగా తయారయ్యాయి. అలా కలిసిపోయిన దానిని ఒక పెద్ద పాత్రలో పోశారు. పేపర్ పెట్టి ఉన్న ట్రేలలోకి ఆ పిండిని అంతా తీసుకున్నారు. ఆ ట్రేలను వేడి చేశారు. దీంతో అందులోని పిండిపదార్థం రంగు మారిపోయింది. అలా రంగు మారిపోయిన పిండి పదార్థంపై శాండ్ విచ్ పూశారు. ఆ తర్వాత వాటిని ఒకదానిపై ఒకటి ఉంచి గుండె ఆకారం వచ్చేలా కట్ చేశారు. రెండు మూడు ఒక దానిపై ఒకటి పెట్టి తెల్లటి క్రీములను పూశారు. ఆ తర్వాత దానిపై అనేక రకాల డిజైన్లను వేశారు. దాని చుట్టూ పసుపు రంగు గల క్రీము పూశారు. పూలు, పక్షులు వంటి రకరకాల డిజైన్లను వేశారు. అంతే కేక్ తయారైపోయింది. తయారైనా కేక్‌లను ఒక్కొక్కటిగా డబ్బాలలోకి ప్యాకింగ్ చేశారు. అయితే అంతా బాగానే ఉంది కానీ కేక్‌లు తయారు చేసిన చోట శుభ్రత పాటించపోవడం గమనార్హం.
అయితే ఇది ఎక్కడా జరిగిందనే వివరాలు తెలియవు కానీ ఓ వ్యక్తి సదరు వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు సైతం ఇదే విషయాన్ని కామెంట్ చేస్తున్నారు. బేకరీలు, రెస్టారెంట్లు పరిశుభ్రత పాటించేందుకు మార్గదర్శకాలు ఉండాలని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ఈ వీడియో చూశాక నేను ఇక నుంచి కేక్ తినాలనుకోవడం లేదని మరొకరు కామెంట్ చేశారు. కేక్‌ల తయారీలో పరిశుభ్రత పాటించకుండా సామాన్యుల ఆరోగ్యాలను పాడుచేస్తున్నారని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-07-24T19:57:39+05:30 IST