Viral Video: వామ్మో.. ఆడ చిరుతలు వేటలో ఇంత గ్రేటా? నీళ్ళలో మాటు వేసి మరీ ఓ ఆడచిరుత ఎలా వేటాడిందో చూస్తే..
ABN, First Publish Date - 2023-06-20T17:26:17+05:30
అడవి జంతువులలో చిరుతలు(Leopard) చాలా చురుకైనవి. ఎనీ టైం, ఎనీ ప్లేస్ వార్ కు సై అనేలా ఉంటాయి చిరుతలు. వీటి కంట్లో పడ్డాక తప్పించుకోవడం జంతువులకు కష్టం. అయితే ఓ ఆడచిరుత నీళ్ళలో మాటువేసి మరీ సాగించిన వేట చూస్తే షాకవుతారు.
వేటాడటం జంతువుల సహజగుణం. అడవి జంతువుల వేట ఎప్పుడూ ఆసక్తికరంగానూ, ఏదో ఒక నీతికథను చెబుతున్నట్టు అనిపిస్తాయి. మాటువేయడం, ఉన్నపళంగా దాడిచేయడం, వ్యూహాలు పన్నడం అడవి జంతువుల వేటలో భాగం. ఇప్పుడు ఓ ఆడచిరుత వేటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. నీళ్లలో మాటువేసి మరీ చిరుత చేసిన వేట చూస్తే వామ్మో ఆడచిరుతలు వేటలో ఇంత గ్రేటా అని ఆశ్చర్యపోతారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
అడవి జంతువులలో చిరుతలు(Leopard) చాలా చురుకైనవి. ఎనీ టైం, ఎనీ ప్లేస్ వార్ కు సై అనేలా ఉంటాయి చిరుతలు. వీటి కంట్లో పడ్డాక తప్పించుకోవడం జంతువులకు కష్టం. అయితే స్థాన బలం అనేదొకటి ఉంటుంది కదా.. నీళ్ళలో మొసలి ఎంతో భారీగా ఉన్న ఏనుగునే పట్టేస్తుందని మనకు తెలుసు. కానీ నీళ్ళలోకి వెళ్ళి, మాటు వేసి మరీ మొసలినే వేటాడిందొక ఆడ చిరుత(female leopard). వీడియోలో ఓ ఆడచిరుత నీళ్ళలో మాటువేయడం చూడొచ్చు. ఆ చిరుత మధ్యలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడినా ఏమాత్రం తన ప్లాన్ చెడిపోకుండా మళ్లీ నీళ్ళలోనే దాక్కుంది. అప్పుడే నీళ్లలో అటువైపుగా ఓ మొసలి( crocodile) వచ్చింది. అప్పటివరకు మొసలికోసమే మాటువేసిన ఆడచిరుత చాలా సునాయాసంగా మొసలిని వేటాడింది. ఆ తరువాత మొసలిని తన నోట కరుచుకుని ఎంతో దర్జాగా నీళ్లలో నుండి బయటకు వచ్చింది. ఆ ఆడచిరుత నోట కరుచుకున్న మొసలిని గమనిస్తే అది చాలా భారీ మొసలి(giant crocodile) అని అర్థం అవుతుంది. ఈ సీన్ చూసిన వారు 'వామ్మో ఆడచిరుతకు నీళ్ళలో మొసలిని కూడా మట్టుబెట్టేంత శక్తి ఉంటుందా?' అని ఆశ్చర్యపోతున్నారు.
Viral News: బీరువాలో వెతుకుతోంటే బయటపడిందో కాగితం.. 88 ఏళ్ల క్రితం రూ.18 కే ఏం కొన్నారో చూసి అవాక్కవుతున్న జనం..!
ఈ వీడియోను The Best అనే ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆడచిరుత వేట చూసి ఆశ్చర్యపోతున్నారు. 'అందం, బలం రెండింటి కలయిక ఈ ఆడచిరుత సొంతం' అని మరొకరు కామెంట్ చేశారు. 'వామ్మో నీటిలో మొసలిని వేటాడాలంటే చాలా బలం ఉండాలి, అందులోనూ అంత భారీ మొసలిని వేటాడటం, దాన్ని బయటకు మోసుకురావడం మామూలు విషయం కాదు' అని అంటున్నారు. 'దాని కాన్ఫిడెంట్ కు సలాం చేయాలి' అని మరొకరు కామెంట్ చేశారు.
Health Tips: పిచ్చి గడ్డి అని పీకి పారేస్తున్నారు కానీ.. అసలు నిజాలు తెలిస్తే బంగారంలా పెంచుకుంటారు.. జ్యూస్‌గా చేసుకుని తాగితే..
Updated Date - 2023-06-20T17:26:17+05:30 IST