Viral Video: అమ్మ కొడుతోంటే తప్పించుకోవడం ఎలా..? అంటూ తమ్ముడితో రిహార్సల్స్.. సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన తల్లి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
ABN, First Publish Date - 2023-04-25T17:05:07+05:30
'అమ్మ కొడుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి?' అనే కోణంలో తమ్ముడితో కలసి రిహార్సల్ చేస్తున్నన్నాడు. అప్పుడే సడన్ గా తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత జరిగిందేంటో చూస్తే..
అల్లరి పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పే.. కొందరు తల్లులు తమ పిల్లలు తప్పులు చేసినప్పుడు వెనకేసుకొస్తే మరికొందరు బ్యాండ్ వాయిస్తారు. వంట గదిలో గరిటతో కట్టేవాళ్లే కాదు.. కుర్రాళ్ల అల్లరి భరించలేక బూతులు తిడుతూ చెప్పు తీసుకుని కొట్టే తల్లులు కూడా ఉంటారు. ఓ కుర్రాడు 'అమ్మ కొడుతున్నప్పుడు ఎలా తప్పించుకోవాలి?' అనే కోణంలో తమ్ముడితో కలసి రిహార్సల్ చేస్తున్నన్నాడు. అప్పుడే సడన్ గా తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత జరిగిందేంటో చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..
ఎదిగిన పిల్లల్ని కొట్టకూడదు అని పెద్దవాళ్లు అనుకుంటారు. కానీ కుర్రాళ్ళు మాత్రం తల్లిదండ్రులకు కొట్టే ఛాన్స్ ఇస్తారు. బృందావన్ కాలనీ, రఘవరన్ బిటెక్ తరహా కుర్రాళ్ళు బానే ఉంటారు. వీళ్ళతో తల్లిదండ్రులకు ఎప్పుడూ తిట్టడం. కొట్టడం రొటీన్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా కొడుకుల అల్లరి భరించలేక కొందరు చెప్పు తీసుకుని మరీ కొట్టేస్తారు. ఓ కుర్రాడికి తన తమ్ముడితో కలసి చేసే అల్లరికి తల్లి చేతిలో ఫుల్లుగా దెబ్బలు తినడం అలవాటు. కానీ ఆ దెబ్బలు తప్పించుకోవాలని అతని ప్లాన్.. 'తప్పు చేసినప్పుడు తల్లి చెప్పు తీసుకుని కొట్టడానికి వస్తే ఎలా తప్పించుకోవాలి?' అనే విషయం మీద ఓ కుర్రాడు ఏకంగా రిహార్సల్(rehearsal to escape from mother) మొదలు పెట్టాడు. ఆ రిహార్సల్ లో తమ్ముడు తల్లి గెటప్ వేయగా తప్పించుకునే పాత్రలో అతను నటిస్తున్నాడు. తల్లి గెటప్ లో ఉన్న తమ్ముడు కొట్టడానికి చెప్పు పైకెత్తగా అతను చెయ్యి అడ్డుకుని ఆత్మరక్షణ(self defence) విద్య ప్రదర్శిస్తూ తమ్ముడిని కింద పడేసి చేతిలో చెప్పు తీసుకున్నాడు. 'అమ్మ కొట్టేటప్పుడు ఇలా తప్పించుకోవాలి. అమ్మ చేతిలో నుండి చెప్పు ఇలా లాక్కోవాలి' అని చెప్పాడు. ఇదంతా ఇలా చెబుతుండగానే ఆ కుర్రాడి తల్లి అలా సడన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె కొడుకు చేస్తున్న పని చూసి 'ఏంట్రా ఏం చేస్తున్నావ్?' అని అడిగింది. అతను ఏదో కవరింగ్ ఇవ్వబోయాడు కానీ కొడుకు మీద ఆమెకు చాలా కాన్ఫిడెంట్ ఉన్నట్టుంది కాబోలు కాలులో చెప్పు తీసుకుని ఒక్కషాట్ ఇచ్చింది. అంతే ఆ దెబ్బకు అతను కింద పడటం వీడియో ఎండ్ అవ్వడం ఒకేసారి జరిగాయి.
Viral Video: చిన్న పిల్లాడిని గుండెలపై పడుకోబెట్టుకుని స్కూటీపై ఇలా పడుకున్నాడో తండ్రి.. మరుక్షణంలోనే ఊహించని సీన్..!
CCTV IDIOTS అనే ట్విట్టర్ అకౌంట్ నుండి ఈ వీడియోను షేర్ చేశారు. ఇది స్క్రిప్టెడ్ గా అనిపిస్తున్నప్పటికీ ఈ వీడియో నెటిజన్లకు ఫన్ పంచుతోంది. 'కొడుకు తల్లి మాట వినలేదు, అందుకే ఇంకా రిహార్సల్ చేస్తుండగానే ఫెయిల్ అయ్యాడు' అంటున్నారు. మరికొందరు 'సారీ బ్రదర్' అని కామెంట్ చేశారు.ఎక్కువ భాగం మంది తల్లికొట్టిన షాట్ కు పొట్టచెక్కలయ్యేలా నవ్వుతున్నారు.
Viral Video: ఈ ఆంటీ తెలివి తేటలు మామూలుగా లేవుగా.. రెండు నిమిషాల్లో అయే మ్యాగీతో ఇలా కూడా చేస్తారా..?
Updated Date - 2023-04-25T17:05:07+05:30 IST