ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: దంచి కొడుతున్నాడు భయ్యా.. స్ట్రీట్ సెల్లర్ ప్రమోషన్ మామూలుగా లేదుగా..

ABN, First Publish Date - 2023-02-23T13:06:57+05:30

పోట్టకూటి కోసం పడే పాట్లు పేదోడికే అర్థం అవుతాయి. వీధుల్లోనూ, రహదారుల్లోనూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కచ్చాబాదం పాట విన్నారా.. సోషల్ మీడియోను షేక్ చేసిన ఈ పాట వేరుశనగలు అమ్ముకునే ఓ వ్యాపారి నోట అందరూ వినే ఉంటారు. ఇది అందరికీ ఎంటర్టైన్మెంట్ అయినా పోట్టకూటి కోసం పడే పాట్లు పేదోడికే అర్థం అవుతాయి. వీధుల్లోనూ, రహదారుల్లోనూ తాము అమ్మే వస్తువులు అందరూ కొనాలని జనాలను ఇంప్రెస్ చెయ్యడానికి విభిన్నంగా ప్రయత్నించేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీధులన్నీ తిరిగి వ్యాపారం చేసుకునే ఇతనూ అదే చేశాడు. కానీ ఇతని ప్రమోషన్ మాత్రం నెట్టింటిని బద్దలు కొట్టేస్తోంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే..

వీధులలో, రహదారులలో వ్యాపారం చేసుకునేవారు చాలా స్కిల్స్ ఉపయోగించి తమ బిజినెస్ నలుగురి దృష్టిలో పడేలా చేస్తారు. కొందరు స్టైల్ గా అరుస్తారు, మరికొందరు మాటకారితనంతో మాయచేస్తారు. కచ్చా బాదం పాట కూడా ఇలాగే వైరల్ అయింది. ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే ఓ వ్యక్తి ప్రమోషన్ ఇప్పుడు ఇంటర్నెట్ ను ఊపేస్తోంది.ఇతను పాటలు పాడలేదు కానీ దంచి కొట్టేస్తున్నాడు. ట్విట్టర్ వేదికగా దీపాన్షు కబ్రా అనే ఐపియస్ ఆఫీసర్ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశారు. వీధులలో తిరిగి ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే ఓ వ్యక్తి తను తెచ్చిన వస్తువులు అమ్ముడుపోవడం కోసం తనదైన మార్క్ చూపించాడు. ఇతను రిక్షాలో సామాన్లు తీసుకొచ్చాడు. వాటిని అమ్మడానికి తన చేతిలోకి రెండు ప్లాస్టిక్ టబ్ లను తీసుకుని వాటిని రోడ్డుమీద బలం కొద్ది కొడుతున్నాడు. అలా అంత గట్టిగా కొట్టినా ఆ ప్లాస్టిక్ టబ్ లు చీలడం, విరగడం జరగలేదు. వస్తువు క్వాలిటీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో అతను అలా చేశాడు. అయితే ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది. అతను ఆ ప్లాస్టిక్ వస్తువులను కొడుతున్న తీరుకు నెటిజన్లు పడిపడి నవ్వుతున్నారు. ఏం మార్కెటింగ్ లెవల్ బాబూ అంటున్నారు. మరికొందరు మాత్రం అది మార్కెట్ ప్రమోషన్ అవునో కాదో కానీ వస్తువు నాణ్యత గురించి అందరికీ తెలియాలని అతను అలా చేస్తున్నాడు అని అన్నారు. ఏది ఏమైనా కామన్ మెన్ పడే పాట్లకు కామా, ఫుల్ స్టాప్ ఉండవు.

Read also: Anand Mahindra: ఓ రైతు వాడుతున్న ట్రాక్టర్ ను చూసి ఆనంద్ మహీంద్రా షాక్.. కారణం ఏమిటంటే..


Updated Date - 2023-02-23T13:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising